ప్రివ్యూల వినియోగ నిబంధనలు

ప్రివ్యూల వినియోగ నిబంధనలు

తేదీ: 24 సెప్టెంబర్ 2024. నుండి అమల్లోకి వచ్చింది 24 మే, 2024 తేదీ నాడు చివరిగా సవరించబడింది

తిరిగి స్వాగతం! ఈ Previews నిబంధనలు (“ప్రివ్యూల నిబంధనలు”) సర్వీస్‌ల యొక్క నిర్దిష్ట కొత్త ఫీచర్‌లను (ప్రతి దానిని, ఒక “ఫీచర్” అంటారు) మీరు యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి వర్తిస్తాయి అలాగే నియంత్రిస్తాయి. మీరు ఇప్పటికే అంగీకరించిన మా యూజర్ ఒప్పందం మరియు  Econ నిబంధనలకు (మొత్తంగా, “Reddit నిబంధనలు”), అదనంగా ఈ ప్రివ్యూల నిబంధనలు వర్తిస్తాయ, మరియు ఇవి Reddit నిబంధనలలో నిర్వచించబడిన నిర్దిష్ట నిబంధనలను కలిగి ఉంటాయి.

1. అంగీకారం

ఏదైనా ఫీచర్‌ను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ప్రివ్యూల నిబంధనలకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.

ఒకవేళ మీరు ఒక థర్డ్-పార్టీ (ఉదాహరణకు, మీ ఎంప్లాయర్ లేదా యజమాని) తరపున ఈ ప్రివ్యూల నిబంధనలకు అంగీకరిస్తుంటే, ఆ థర్డ్-పార్టీని ఈ ప్రివ్యూల నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి, మీకు అధికారం ఉందని మరియు మీరు వారి అధీకృత ప్రతినిధి అని మాకు హామీ ఇస్తున్నారు. అంతేకాకుండా, ప్రివ్యూల నిబంధనలలో ఉపయోగించిన “మీరు” అనే పదం ఆ థర్డ్-పార్టీని కూడా సూచిస్తుంది.

ప్రివ్యూల నిబంధనలు మరియు ఏదైనా ఫీచర్, ఏ కారణం చేతనైనా లేదా ఎటువంటి కారణం లేకుండానే, మా స్వంత విచక్షణతో, ముందస్తు నోటీసు లేకుండా మరియు Redditకు ఎటువంటి బాధ్యత లేకుండా ఎప్పుడైనా (వర్తించే చట్టానికి లోబడి) మార్చబడవచ్చని మీరు అంగీకరిస్తున్నారు మరియు అర్థం చేసుకున్నారు. ఏవైనా మార్పుల కోసం దయచేసి ప్రివ్యూల నిబంధనలను సమీక్షించవలసిందిగా కోరుతున్నాము; అలా చేయడం మీ బాధ్యత.

ఒకవేళ మీరు ప్రివ్యూల నిబంధనలకు అంగీకరించకపోతే, మీరు ఏదైనా ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి అనుమతి ఉండదు.

2. అర్హత

మీరు కింది సందర్భాలలో ఏ ఫీచర్‌నైనా యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి అర్హులు కారు:

  • మీరు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారైనా లేదా మీ నివాస దేశపు చట్టాల ప్రకారం బైండింగ్ కాంట్రాక్ట్‌లలో ప్రవేశించడానికి అవసరమైన కనీస వయస్సు లేనివారు అయినా;

  • ఆర్థిక లేదా వాణిజ్య ఆంక్షలు, నిషేధాలు, ఎగుమతి పరిమితులు కింద ఎవరితోనైతే లావాదేవీలు నిషేధించబడ్డాయో అటువంటి వ్యక్తిగా మీరు ఉండకూడదు, లేదా నిషేధించబడిన లేదా పరిమితం చేయబడిన పక్షాల జాబితాలో మీ పేరు ఉండకూడదు, లేదా పైన పేర్కొన్న ఆంక్షలకు లోబడి ఉన్న దేశంలో మీరు నివసించే వ్యక్తి (లేదా పౌరుడు) అయి ఉండకూడదు;

  • మీ ఖాతా (మీ నియంత్రణలో ఉన్న ప్రత్యామ్నాయ ఖాతాతో సహా) సస్పెండ్ చేయబడినా, రద్దు చేయబడినా, Reddit నిబంధనలను ఉల్లంఘించినా లేదా మరే ఇతర కారణాల వల్లనైనా మంచి స్థితిలో లేకపోయినా; లేదా

  • లేదా మీరు వర్తించే చట్టాల ప్రకారం ఏదైనా ఫీచర్‌ను యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి చట్టపరంగా నిషేధించబడి ఉండాలి.

ఏదైనా ఫీచర్‌ను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు అలా చేయడానికి అర్హులని మరియు ప్రివ్యూల నిబంధనలు, Reddit నిబంధనలు, అలాగే మీ యాక్సెస్ మరియు ఫీచర్ వినియోగానికి వర్తించే అన్ని చట్టాలు, నియమాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉంటారని మీరు Redditకు హామీ ఇస్తున్నారు.

(వర్తించే చట్టానికి లోబడి), ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ లేదా బాధ్యత లేకుండా, మా స్వంత విచక్షణ మేరకు, ఏ కారణం చేతనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానే, ఏ సమయంలోనైనా ఏ ఫీచర్‌కైనా యాక్సెస్‌ను బ్లాక్ చేసే, సస్పెండ్ చేసే, పరిమితం చేసే లేదా రద్దు చేసే హక్కు Redditకు ఉంది. చట్టం అనుమతించిన గరిష్ఠ పరిమితి మేరకు, ఏదైనా ఫీచర్‌కు యాక్సెస్‌ను బ్లాక్ చేయడానికి, సస్పెండ్ చేయడానికి, పరిమితం చేయడానికి లేదా రద్దు చేయడానికి Reddit నిర్ణయించుకుంటే, ఆ ఫీచర్‌పై మీకు ఉన్న ఎలాంటి హక్కునైనా మీరు కోల్పోతారు మరియు ఆ ఫీచర్‌ను నిరంతరం ఉపయోగించడానికి మీకు ఉండే ఎలాంటి క్లెయిమ్‌నైనా వదులుకోవాల్సి వస్తుంది.

3. Reddit వాల్ట్

3.1 అవలోకనం

Reddit వాల్ట్ అనేది సర్వీసెస్‌లో (“వాల్ట్”) అంతర్గతంగా పొందుపరచబడిన ఒక డిజిటల్ వాలెట్, ఇది ప్రివ్యూల నిబంధనలు మరియు Reddit నిబంధనలకు అనుగుణంగా సర్వీసెస్ ద్వారా, మీ ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను (క్రింద నిర్వచించబడినవి) స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి మరియు స్వయంగా మీ ఆధీనంలో ఉంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

3.2 మీ వాల్ట్‌ను క్రియేట్ చేయడం

సర్వీస్‌ల ద్వారా వాల్ట్‌ను క్రియేట్ చేయడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి:

  • మీరు సర్వీస్‌లను ఉపయోగించి కొన్ని ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను క్లెయిమ్ చేసినా లేదా కొనుగోలు చేసినా, ఆ ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను స్టోర్ చేయడానికి Reddit మీ ఖాతా కోసం ఆటోమేటిక్‌గా ఒక వాల్ట్‌ను క్రియేట్ చేస్తుంది; లేదా

  • మీరు సర్వీసులను ఉపయోగించి వాల్ట్‌ను క్రియేట్ చేయవచ్చు.

మీ వాల్ట్ క్రియేట్ అయినప్పుడు, మీకు ఒక పబ్లిక్ అడ్రస్ మరియు ఒక ప్రైవేట్ కీ లభిస్తాయి. పబ్లిక్ అడ్రస్ అనేది Ethereum-అనుకూల బ్లాక్‌చెయిన్‌లపై ఉన్న మీ చిరునామా అవుతుంది, ఇక్కడ మీ వాల్ట్‌లోని ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులపై మీ యాజమాన్యం మరియు హక్కులకు సంబంధించిన రికార్డ్ స్టోర్ చేయబడుతుంది.

మీ వాల్ట్‌లోని ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి ప్రైవేట్ కీ మాత్రమే ఏకైక మార్గం. Reddit మీ ప్రైవేట్ కీని ఆటోమేటిక్‌గా స్వీకరించదు లేదా స్టోర్ చేయదు. ప్రైవేట్ కీ మీ పరికరంలో స్టోర్ చేయబడుతుంది మరియు దాని భద్రతకు మీరే పూర్తి బాధ్యత వహించాలి.

మీ వాల్ట్ క్రియేట్ అయినప్పుడు, మీ వాల్ట్ యొక్క ప్రైవేట్ కీ కోసం 12-పదాల రికవరీ పదబంధం కూడా ఆటోమేటిక్‌గా రూపొందించబడుతుంది (మీ “రికవరీ పదబంధం”). మీరు మీ రికవరీ పదబంధాన్ని ఉపయోగించి సైన్ ఇన్ చేసి మీ వాల్ట్‌ను యాక్సెస్ చేయవచ్చు, లేదా వాల్ట్ లేదా MetaMask వంటి ఇతర వాలెట్‌లలో మీ ప్రైవేట్ కీని తిరిగి క్రియేట్ చేయవచ్చు.

ఒకవేళ మీరు మీ ప్రైవేట్ కీ మరియు రికవరీ పదబంధాన్ని పోగొట్టుకుని, మీ వాల్ట్‌ను సురక్షితం చేసుకోకపోతే, అప్పుడు మీ వాల్ట్‌లోని ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు శాశ్వతంగా అందుబాటులోకి రాకుండా పోతాయి.

3.3 మీ వాల్ట్‌ను భద్రపరచడం

మీ వాల్ట్ క్రియేట్ అయిన తర్వాత, దానికి మీ యాక్సెస్‌ను మీరు ఖచ్చితంగా తగిన రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి. మీరు మీ వాల్ట్ యాక్సెస్‌ను ఈ విధంగా సురక్షితం చేసుకోవచ్చు:

  • సర్వీసెస్ ద్వారా మీ క్లౌడ్ స్టోరేజ్ ప్రొవైడర్‌తో మీ రికవరీ పదబంధం యొక్క బ్యాకప్‌ను క్రియేట్ చేయడం (మీ “క్లౌడ్ బ్యాకప్”);

  • సర్వీసెస్ ద్వారా మీ వాల్ట్ కోసం కొత్త మరియు ప్రత్యేకమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడం (మీ “వాల్ట్ పాస్‌వర్డ్”); లేదా

  • మీ ప్రైవేట్ కీ మరియు రికవరీ పదబంధాన్ని మాన్యువల్‌గా సేవ్ చేసి, వాటిని సురక్షితమైన చోట భద్రపరుచుకోవడం.

మీ వాల్ట్‌కు యాక్సెస్‌ను సురక్షితం చేసుకోవడం పూర్తిగా మీ బాధ్యత; Reddit దానికి యాక్సెస్‌ను కలిగి ఉండదు. మీరు మీ వాల్ట్ యొక్క ప్రైవేట్ కీ, రికవరీ పదబంధం, క్లౌడ్ బ్యాకప్ మరియు వాల్ట్ పాస్‌వర్డ్‌ను (వీటన్నింటినీ కలిపి, మీ “వాల్ట్ యాక్సెస్ సమాచారం”) పోగొట్టుకున్నా లేదా మర్చిపోయినా, మీ వాల్ట్‌ను (దానిలోని ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులతో సహా) పునరుద్ధరించడంలో Reddit మీకు సహాయం చేయదు.

ముఖ్యంగా మీరు మీ వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని మరెవరికీ (Reddit‌తో సహా) ఎప్పటికీ ఇవ్వకూడదు. మీ వాల్ట్ మరియు వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని భద్రపరచడానికి పూర్తి బాధ్యత మీదే. మీ వాల్ట్ మరియు వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని తిరిగి పొందడం, రీసెట్ చేయడం లేదా రికవర్ చేయడంలో Reddit మీకు సహాయం చేయదు.

మీ వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని గానీ, మీరు నియంత్రించే మరే ఇతర బ్లాక్‌చెయిన్ ఖాతా యొక్క ప్రైవేట్ కీ లేదా రికవరీ పదబంధాన్ని గానీ మాకు ఎప్పుడూ అందించవద్దు. ఏ Reddit ఉద్యోగి కూడా మిమ్మల్ని మీ వాల్ట్ యాక్సెస్ సమాచారం అడగరు.

మీ వాల్ట్‌ను (Vault) మరియు వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని ఎలా సురక్షితం చేసుకోవాలో తెలుసుకోవడానికి,  ఇక్కడ పేర్కొన్న వాల్ట్ సెక్యూరిటీ గైడ్‌లో మీరు మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.

3.4 వాల్ట్ యాక్సెస్‌ను కోల్పోవడం

మీ వాల్ట్‌ను లేదా దానిలోని ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను రికవర్ చేయడానికి, Reddit‌కు మీ వాల్ట్ లేదా వాల్ట్ యాక్సెస్ సమాచారానికి యాక్సెస్ లేదు. ఒకవేళ మీ వాల్ట్ మీ మొబైల్ డివైజ్‌లలో ఎక్కడా స్టోర్ చేయబడలేదని మరియు మీ వాల్ట్ యాక్సెస్ సమాచారంలో ఏదీ మీకు అందుబాటులో లేదని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకుంటే, మీ వాల్ట్‌ను అన్‌లాక్ చేయడానికి మేము ఎటువంటి సహాయం చేయలేము అలాగే మీరు తప్పనిసరిగా కొత్త వాల్ట్‌ను క్రియేట్ చేయాల్సి ఉంటుంది.

మీ ఖాతా దానితో అనుబంధించబడిన ఒకే ఒక్క యాక్టివ్ వాల్ట్‌ను మాత్రమే కలిగి ఉండగలదు. ఇప్పటికే ఒక వాల్ట్ ఉన్న ఖాతాలో మీరు రెండవ వాల్ట్‌ను క్రియేట్ చేసినట్లయితే, ఆ రెండవ వాల్ట్ ఆ ఖాతాతో అనుబంధించబడిన అధికారిక వాల్ట్‌గా మారుతుంది. అటువంటి సందర్భంలో, మీ అసలు వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని మీరు భద్రపరుచుకోకపోతే, ఆ అసలు వాల్ట్ ఇంకా దానిలోని ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను తిరిగి పొందడం సాధ్యం కాకపోవచ్చు.

మీరు మీ వాల్ట్ యాక్సెస్ సమాచారం ద్వారా మీ వాల్ట్‌ను నియంత్రిస్తుండగా, Reddit మా సర్వీస్‌లను నియంత్రిస్తుంది. మేము మీ వాల్ట్‌ను, మీ నుండి తీసివేయలేనప్పటికీ, సర్వీస్‌ల ద్వారా మీ వాల్ట్‌తో (మరియు దానిలో స్టోర్ చేయబడిన ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులతో) మీరు వ్యవహరించే సామర్థ్యాన్ని మేము పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు, మీ ఖాతా సస్పెండ్ అయినా లేదా నిషేధించబడినా, Reddit విచక్షణ మేరకు, ఆ సస్పెన్షన్ ముగిసే వరకు లేదా శాశ్వతంగా సర్వీస్‌లను ఉపయోగించి మీ వాల్ట్‌ను మరియు ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను మీరు యాక్సెస్ చేయలేకపోవచ్చు.

3.5 గోప్యతా అంశాల పరిశీలన

Ethereum బ్లాక్‌చెయిన్ వంటి పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లు బహిరంగమైనవని మరియు ఎవరైనా వాటిని యాక్సెస్ చేయగలరని గుర్తుంచుకోండి. మీ వాల్ట్ లేదా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లకు లింక్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే ఆ ప్లాట్‌ఫామ్‌లు మరియు పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లపై మీ కార్యకలాపాలను బట్టి థర్డ్-పార్టీలు మిమ్మల్ని గుర్తించగలరు. Reddit తన సర్వీస్‌లలో లావాదేవీల చరిత్రను ప్రదర్శించనప్పటికీ, పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లపై జరిగే లావాదేవీలు (ధృవీకరించబడిన డిజిటల్ వస్తువుల కొనుగోళ్లు, బదిలీలు మరియు అమ్మకాలతో సహా) కూడా పబ్లిక్‌గా ఉంటాయని మరియు ఎవరైనా వాటిని యాక్సెస్ చేయవచ్చని గుర్తుంచుకోండి. బ్లాక్‌చెయిన్‌లో గోప్యత గురించి మరింత తెలుసుకోండి.

4. ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు

4.1 అవలోకనం

ప్రివ్యూల నిబంధనలు మరియు Reddit నిబంధనల ప్రకారం, మా సర్వీస్‌ల ద్వారా పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌పై క్రిప్టోగ్రాఫిక్‌గా ధృవీకరించగల నిర్దిష్ట డిజిటల్ వస్తువులను మీరు సంపాదించవచ్చు, క్లెయిమ్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు లేదా బహుమతిగా ఇవ్వవచ్చు (వీటన్నింటినీ కలిపి, "ధృవీకరించిన డిజిటల్ వస్తువులు" అని పిలుస్తారు).

4.2 Reddit కలెక్టిబుల్ అవతార్‌లు

Reddit కలెక్టిబుల్ అవతార్‌లు అనేవి పరిమిత-ఎడిషన్ అవతార్‌లు అలాగే ఒక రకమైన ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు, వీటిని మీరు: (a)  Reddit క్రియేటర్ నిబంధనల కింద విక్రయించవచ్చు; లేదా (b) ప్రివ్యూల నిబంధనలు ఇంకా Reddit నిబంధనల ప్రకారం సర్వీస్‌ల ద్వారా క్లెయిమ్ చేయవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు ("కలెక్టిబుల్ అవతార్‌లు"). ప్రివ్యూల నిబంధనలలో మరియు థర్డ్-పార్టీ హక్కుల హోల్డర్లు అందించే నిబంధనలతో సహా, మీరు కలెక్టిబుల్ అవతార్‌ను క్లెయిమ్ చేసినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు మీకు అందించే ఇతర నిబంధనలలో వివరించిన విధంగా, కలెక్టిబుల్ అవతార్‌లు వాటి యజమానులకు సర్వీస్‌లలో (మరియు సర్వీస్‌ల వెలుపల) ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి.

ప్రతి కలెక్టిబుల్ అవతార్ కూడా దానితో ముడిపడి ఉన్న ఒక నిర్దిష్ట మరియు ప్రత్యేకమైన అవతార్ ఆర్ట్‌ను కలిగి ఉంటుంది; ఇది ఒక ప్రత్యేక గేట్‌వే ద్వారా ఇంటర్‌ప్లానెటరీ ఫైల్ సిస్టమ్‌లో లేదా ప్రత్యామ్నాయ సర్వీస్‌లో పిన్ భద్రపరచబడి ఉంటుంది. మీరు ఒక కలెక్టిబుల్ అవతార్‌ను పొందినప్పుడు, మీరు దానికి యజమాని అవుతారు. అంటే మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌ను కంట్రోల్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు, బదిలీ చేయవచ్చు, విక్రయించవచ్చు లేదా ఇతరత్రా ఏ విధంగానైనా తొలగించవచ్చు. అయినప్పటికీ, దీని అర్థం మీరు అవతార్ ఆర్ట్ యొక్క మేధో సంపత్తి హక్కులను కలిగి ఉన్నారని కాదు. అవతార్ ఆర్ట్ లైసెన్స్ ఇవ్వబడినది మాత్రమే, విక్రయించబడినది కాదు. ప్రివ్యూల నిబంధనలలో స్పష్టంగా పేర్కొనబడని అవతార్ ఆర్ట్‌కు సంబంధించిన అన్ని హక్కులను Reddit మరియు మా లైసెన్సర్‌లు తమ వద్దే ఉంచుకుంటారు.

మీరు ఒక కలెక్టిబుల్ అవతార్‌ను కలిగి ఉంటే, మీరు ప్రివ్యూల నిబంధనలను నిరంతరం పాటించే షరతుకు లోబడి, మీ కలెక్టిబుల్ అవతార్‌తో అనుబంధించబడిన అవతార్ ఆర్ట్ యొక్క మొత్తం లేదా కొంత భాగాన్ని ఉపయోగించడానికి, కాపీ చేయడానికి మరియు ప్రదర్శించడానికి, అలాగే ఆ అవతార్ ఆర్ట్‌ను Reddit మరియు దాని లైసెన్సర్‌లు, సర్వీస్‌ల ద్వారా అందుబాటులో ఉంచిన ఇతర అవతార్ ఆర్ట్‌తో మిక్స్-అండ్-మ్యాచ్ చేయడానికి, అన్ని సందర్భాలలోనూ, మీ స్వంత వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కోసం, Reddit మీకు ప్రపంచవ్యాప్త, శాశ్వత, నాన్-ఎక్స్‌క్లూజివ్, సబ్‌లైసెన్స్ చేయదగిన లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది (“లైసెన్స్ పొందిన హక్కులు” అంటారు). లైసెన్స్ పొందిన హక్కులను మంజూరు చేయడంలో, Reddit తన తరపున లేదా మా లైసెన్సర్‌ల తరపున వారికి లైసెన్సీగా లేదా ఏజెంట్‌గా వ్యవహరించవచ్చు.

కలెక్టిబుల్ అవతార్‌లు, సర్వీస్‌లలో అదనపు ఫీచర్‌లను అన్‌లాక్ చేయడానికి కూడా మీకు వీలు కల్పిస్తాయి. మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌తో అనుబంధించబడిన అవతార్ ఆర్ట్‌ను, సర్వీస్‌లలో మీ అవతార్‌గా ప్రదర్శిస్తే, మీ అవతార్ ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్‌లను కలిగి ఉంటుంది అలాగే మీ కలెక్టిబుల్ అవతార్‌ను చేర్చిన యానిమేటెడ్ రెస్పాన్స్‌లను క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. అదనంగా, అవతార్‌ల కోసం Reddit యొక్క బిల్డర్ టూల్‌ను ఉపయోగించి, అవతార్ ఆర్ట్‌ను అనేక భాగాలుగా విడదీయడానికి మరియు ఆ భాగాలలో కొన్నింటితో లేదా అన్నింటితో మీ అవతార్‌ను రూపొందించుకోవడానికి కలెక్టిబుల్ అవతార్‌లు అనుమతిస్తాయి. ఈ అదనపు ఫీచర్‌లు మీ కలెక్టిబుల్ అవతార్, మీ వాల్ట్‌లో ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌ను మీ అవతార్‌గా సెట్ చేయకపోతే (మీరు ఇప్పటికీ దానిని కలిగి ఉన్నప్పటికీ), ప్రత్యేక విజువల్ ఎఫెక్ట్‌లు వర్తించబడవు. అంతే కాకుండా మీరు అదనపు ఫీచర్‌లను ఉపయోగించలేకపోవచ్చు. మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌ను విక్రయించినా, బదిలీ చేసినా, లేదా మరే విధంగానైనా తొలగించినా, మీకు ఈ అదనపు ఫీచర్‌లకు ఇకపై యాక్సెస్ ఉండదు.

ప్రివ్యూల నిబంధనలు మరియు Reddit నిబంధనలకు అనుగుణంగా, మీ కలెక్టిబుల్ అవతార్ విక్రయం లేదా తొలగింపునకు సంబంధించి మాత్రమే, మీ లైసెన్స్ హక్కులను బదిలీ చేయడానికి మీకు పరిమిత హక్కు కూడా ఉంటుంది. ప్రివ్యూల నిబంధనలు లేదా Reddit నిబంధనలకు అనుగుణంగా, లైసెన్స్‌తో కూడిన మీ హక్కులు రద్దు చేయబడినా, లేదా ఇతరత్రా ఆ నిబంధనలను ఉల్లంఘించినా, మీరు ఈ బదిలీ హక్కును కోల్పోతారు. మీ నుండి కలెక్టిబుల్ అవతార్‌ను పొందే ఏ గ్రహీత అయినా తప్పనిసరిగా ప్రివ్యూల నిబంధనలను మరియు Reddit నిబంధనలను అంగీకరించాలి. మీ కలెక్టిబుల్ అవతార్ యొక్క ఏదైనా విక్రయం లేదా విక్రయ ప్రయత్నానికి సంబంధించి, ఆ థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లు లేదా మార్కెట్‌ప్లేస్‌లు, మీ కలెక్టిబుల్ అవతార్ యాజమాన్యాన్ని క్రిప్టోగ్రాఫిక్‌గా ధృవీకరించి, కింద పేర్కొన్న రాయల్టీ నిబంధనలను గౌరవించినంత వరకు లేదా వాటిని గౌరవించడానికి తగిన మార్గాలను అందించినంత వరకు, మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌తో అనుబంధించబడిన అవతార్ ఆర్ట్‌ను సదరు థర్డ్-పార్టీ ప్లాట్‌ఫామ్‌లలో లేదా మార్కెట్‌ప్లేస్‌లలో ప్రదర్శించవచ్చు.

మీరు Reddit సర్వీస్‌ల ద్వారా మరియు అవి వర్తించే విధంగా క్రియేటర్ల నుండి కలెక్టిబుల్ అవతార్‌ను కొనుగోలు చేస్తే, నిర్ణీత ధరను చెల్లిస్తారు అలాగే, Reddit మీ నుండి ఎలాంటి ఫీజులను (క్రియేటర్ లేదా రాయల్టీ ఫీజుతో సహా) వసూలు చేయదు; అదే విధంగా, మీరు Reddit నుండి కలెక్టిబుల్ అవతార్‌ను క్లెయిమ్ చేస్తే, Reddit మీ నుండి ఎలాంటి ఫీజులను వసూలు చేయదు. అయితే, మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌ను ఆ తర్వాత విక్రయిస్తే, మీ నుండి కలెక్టిబుల్ అవతార్‌ను కొనుగోలు చేసే పార్టీ, సదరు లావాదేవీలో అమ్మకపు ధరలో 5%కి సమానమైన రాయల్టీ ఫీజును Redditకు అలాగే, వర్తించే పక్షంలో, క్రియేటర్‌లకు, మా లైసెన్సర్‌లకు చెల్లించాలి. సదరు కలెక్టిబుల్ అవతార్ వివరాల పేజీలో ప్రత్యామ్నాయ రాయల్టీ ఫీజు శాతం వర్తిస్తుందని సూచిస్తే తప్ప ఇది వర్తించదు.

ఈ నిబంధనలను నెరవేర్చని మీ లైసెన్స్ పొందిన హక్కులను బదిలీ చేయడానికి చేసే ఎలాంటి ప్రయత్నమైనా చెల్లకుండా పోతుంది మరియు అది ప్రివ్యూల నిబంధనలు, Reddit నిబంధనల యొక్క తీవ్రమైన ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌ను ఒక థర్డ్-పార్టీకి బదిలీ చేసినా లేదా విక్రయించినా, అవతార్ ఆర్ట్‌కున్న మీ లైసెన్స్ రద్దవుతుంది మరియు మీ ఆధీనంలో లేదా నియంత్రణలో ఉన్న అవతార్ ఆర్ట్ యొక్క డిజిటల్ లేదా ఫిజికల్ కాపీలేవైనా ఉంటే, వాటిని వెంటనే తొలగించాలి.

నిర్దిష్ట కలెక్టిబుల్ అవతార్‌లు, ఒక థర్డ్-పార్టీ అందించే ఏదైనా ప్రయోజనాన్ని పొందడానికి తొలి కొనుగోలుదారునికి అర్హత కల్పించవచ్చు (దీనిని "థర్డ్-పార్టీ ప్రయోజనం" అని పిలుస్తారు). మీరు మీ కలెక్టిబుల్ అవతార్‌కు మాత్రమే ప్రత్యేకం అయిన థర్డ్-పార్టీ ప్రయోజనాన్ని పొందడానికి లేదా రిడీమ్ చేసుకోవడానికి, మా సర్వీస్‌లను ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా థర్డ్-పార్టీ ప్రయోజనాన్ని ఉపయోగించడం లేదా రిడీమ్ చేయడం అనేది, ప్రత్యేక చట్టపరమైన నిబంధనలకు, గోప్యతా విధానాలకు అనుగుణంగా ఉండవచ్చు. ఏదైనా థర్డ్-పార్టీ ప్రయోజనాల ప్రొవైడర్‌లతో మీరు చేసుకునే ఒప్పందాలలో Reddit భాగస్వామి కాదు, మరియు అటువంటి ఒప్పందాలను పాటించడానికి సదరు ప్రొవైడర్‌లే పూర్తి బాధ్యత వహిస్తారు. మీరు థర్డ్-పార్టీ ప్రయోజనాల ప్రొవైడర్ అందించే ఏ సర్వీస్‌లనైనా ఉపయోగించే ముందు, వారి చట్టపరమైన నిబంధనలను మరియు గోప్యతా విధానాలను జాగ్రత్తగా చదవాలి. థర్డ్-పార్టీ ప్రయోజనాల ప్రొవైడర్‌లపై, Redditకి ఎలాంటి నియంత్రణ లేనప్పటికీ, మీరు థర్డ్-పార్టీ ప్రయోజనాలను సులభంగా రిడీమ్ చేసుకోవడానికి వీలు కల్పించే మా సర్వీస్‌ల ఫీచర్‌లను Reddit నియంత్రిస్తుంది. మా విచక్షణ మేరకు వాల్ట్ ఫీచర్‌లను పర్యవేక్షించడానికి, పరిమితం చేయడానికి, సవరించడానికి మరియు తొలగించడానికి Reddit‌కు హక్కు ఉందని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.

4.3 ధృవీకరించబడిన డిజిటల్ వస్తు బదిలీలు

ప్రివ్యూల నిబంధనలకు అనుగుణంగా, Ethereum-అనుకూల బ్లాక్‌చెయిన్‌లకు సపోర్ట్‌ను ఇచ్చే మరొక వాల్ట్ లేదా థర్డ్-పార్టీ ద్వారా నిర్వహించబడే ఏదైనా డిజిటల్ వాలెట్‌కు ("థర్డ్-పార్టీ వాలెట్") మీ ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను బదిలీ చేయడానికి మీరు మా సర్వీస్‌లను ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా థర్డ్-పార్టీ వాలెట్‌ను ఉపయోగించడం అనేది వారి ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు లోబడి ఉంటుంది. ఏదైనా థర్డ్-పార్టీ వాలెట్ ప్రొవైడర్లతో మీరు కుదుర్చుకునే ఒప్పందాలలో Reddit భాగస్వామి కాదు. అలాగే, మీరు సదరు థర్డ్-పార్టీ వాలెట్‌ను ఉపయోగించడానికి సంబంధించి అన్ని రకాల చట్టపరమైన నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఆ ప్రొవైడర్లు మాత్రమే బాధ్యత వహిస్తారు అంతే కాకుండా థర్డ్-పార్టీ వాలెట్ ప్రొవైడర్ అందించే ఏవైనా సర్వీస్‌లను ఉపయోగించే ముందు, మీరు వారి చట్టపరమైన నిబంధనలను, గోప్యతా విధానాలను తప్పనిసరిగా జాగ్రత్తగా చదవాలి.

పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లు లేదా మీ వాల్ట్‌పై మాకు ఎలాంటి నియంత్రణ లేదు అలాగే ప్రివ్యూల నిబంధనల ప్రకారం ధృవీకరించబడిన డిజిటల్ వస్తువుల బదిలీలు గానీ లేదా మీ వాల్ట్ ద్వారా మీరు సమర్పించే ఇతర లావాదేవీ వివరాలు గానీ పూర్తవుతాయనే హామీని ఇవ్వలేము. మీ వాల్ట్ ద్వారా బదిలీలు లేదా ఇతర లావాదేవీ వివరాలను పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌కు సమర్పించిన తర్వాత, మీ బదిలీలను లేదా ఇతర లావాదేవీ వివరాలను రద్దు చేయడానికి, వెనక్కి తీసుకోవడానికి లేదా ఇతరత్రా సవరించడానికి మేము మీకు సహాయం చేయలేము. మీరు మీ బదిలీ సమాచారాన్ని మరియు ఇతర లావాదేవీల వివరాలను సమర్పించడానికి ముందే, వాటిని జాగ్రత్తగా సమీక్షించుకోవాలని మేము గట్టిగా సిఫారసు చేస్తున్నాము.

పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లపై లేదా మీ వాల్ట్‌పై Redditకి ఎలాంటి నియంత్రణ లేనప్పటికీ, సర్వీసెస్‌లో భాగమైన వాల్ట్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్‌లను Reddit నియంత్రిస్తుంది. ఇవి సర్వీసెస్‌ను ఉపయోగించి మీ ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను సులభంగా మేనేజ్ చేయడానికి మరియు బదిలీ చేయడానికి మీకు సహాయపడతాయి (“వాల్ట్ ఫీచర్‌లు” అని పిలుస్తారు). మా విచక్షణ మేరకు, వాల్ట్ ఫీచర్‌లను పర్యవేక్షించే, పరిమితం చేసే, సవరించే మరియు తొలగించే హక్కు Reddit‌కు ఉందని మీరు అర్థం చేసుకుని, మీరు అంగీకరిస్తున్నారు. ఉదాహరణకు, మీరు ప్రివ్యూల నిబంధనలను ఉల్లంఘించారని లేదా ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తున్నారని Reddit సహేతుకంగా విశ్వసిస్తే, వాల్ట్ ఫీచర్‌లను ఉపయోగించి మీరు బదిలీ చేసే ధృవీకరించబడిన డిజిటల్ వస్తువుల ఫ్రీక్వెన్సీ మరియు పరిమాణంపై Reddit పరిమితులను విధించవచ్చు లేదా అటువంటి వాల్ట్ ఫీచర్‌లకు మీ యాక్సెస్‌ను తాత్కాలికంగా పరిమితం చేయవచ్చు.

వాల్ట్ ఫీచర్‌లను ఉపయోగించి ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను బదిలీ చేయడానికి, బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ ఫీజులను చెల్లించాల్సిందిగా లేదా ఇతర పెయిడ్ సర్వీస్‌లను కొనుగోలు చేయాల్సిందిగా మిమ్మల్ని కోరవచ్చు. బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ ఫీజులను, Reddit నియంత్రించదు. బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ ఫీజులను మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చెల్లించడాన్ని సులభతరం చేయడానికి, Reddit వాల్ట్ ఫీచర్‌ల ద్వారా ఉచిత సర్వీస్‌లను లేదా పెయిడ్ సర్వీస్‌లను అందించవచ్చు. అయినప్పటికీ, మా సర్వీస్‌ల ద్వారా మీరు చెల్లించే బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ ఫీజులు లేదా ఇతర పెయిడ్ సర్వీస్‌ల ఫీజులను థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్లే ప్రాసెస్ చేస్తారు. అందువల్ల, వారు అందించే సర్వీస్‌లను మీరు ఉపయోగించడం అనేది వారి ప్రత్యేక చట్టపరమైన నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు లోబడి ఉంటుంది. Reddit అనేది, ఎలాంటి థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌తోనైనా మీరు చేసుకునే ఒప్పందాలలో భాగస్వామి కాదు. మీ బ్లాక్‌చెయిన్ నెట్‌వర్క్ ఫీజుల చెల్లింపుకు సంబంధించి అన్ని నియంత్రణ అవసరాలను పాటించడానికి సదరు ప్రొవైడర్‌లే పూర్తి బాధ్యత వహిస్తారు. వారు అందించే ఏవైనా సర్వీస్‌లను ఉపయోగించే ముందు, వారి చట్టపరమైన నిబంధనలను మరియు గోప్యతా విధానాలను మీరు తప్పనిసరిగా జాగ్రత్తగా చదవాలి.

4.4 ధృవీకరించిన డిజిటల్ వస్తువుల విషయంలో థర్డ్-పార్టీ హక్కులు

కొన్ని ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు అనేవి, Reddit మరియు థర్డ్-పార్టీ లైసెన్సర్‌ల మధ్య భాగస్వామ్యాలు కావచ్చు. ధృవీకరించిన డిజిటల్ వస్తువులతో అనుబంధించిన డిజిటల్ వస్తువు ఆర్ట్‌లోని థర్డ్-పార్టీ హక్కులకు కూడా  Econ నిబంధనల  యొక్క సెక్షన్ 4 నియమ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి.

ధృవీకరించబడిన మీ డిజిటల్ వస్తువుకు సంబంధించిన ఏదైనా డిజిటల్ వస్తువు ఆర్ట్ విషయంలో ఏవైనా థర్డ్-పార్టీ హక్కులు ఉన్నట్లయితే, మీరు ఈ క్రింది వాటిని అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు:

  • డిజిటల్ వస్తువు ఆర్ట్‌లో పొందుపరిచిన విధంగా మరియు ప్రివ్యూల నిబంధనలలో ఉన్న లైసెన్స్ మరియు పరిమితులకు లోబడి తప్ప, ఏ విధంగానూ థర్డ్-పార్టీ హక్కులను ఉపయోగించుకునే హక్కు మీకు ఉండదు;

  • సదరు థర్డ్-పార్టీ హక్కులను కలిగి ఉన్న వ్యక్తి, ప్రివ్యూల నిబంధనల యొక్క ఉద్దేశిత లబ్ధిదారుడు అవుతారు;

  • మీరు ఏదైనా ధృవీకరించిన డిజిటల్ వస్తువును క్లెయిమ్ చేసినప్పుడు లేదా కొనుగోలు చేసినప్పుడు సదరు థర్డ్-పార్టీ హక్కుల హోల్డర్‌కు సంబంధించిన ఏవైనా అదనపు నిబంధనలను మీకు అందిస్తే, ఆ నిబంధనలు (ప్రివ్యూల నిబంధనలతో పాటు) మీ ధృవీకరించిన డిజిటల్ వస్తువు వినియోగానికి వర్తిస్తాయి మరియు దానిని నియంత్రిస్తాయి

  • థర్డ్-పార్టీ హక్కుల హోల్డర్ మంజూరు చేసిన లైసెన్స్ స్వభావాన్ని బట్టి, డిజిటల్ వస్తువు ఆర్ట్‌ను ఉపయోగించే మీ సామర్థ్యంపై Reddit అదనపు పరిమితులను విధించాల్సి రావచ్చు; మరియు

  • థర్డ్-పార్టీ హక్కుల కారణంగా డిజిటల్ వస్తువు ఆర్ట్ వినియోగానికి అదనపు పరిమితులు వర్తిస్తాయని Reddit మీకు నోటిఫై చేస్తే, మీరు తప్పనిసరిగా అట్టి పరిమితులను పాటించాలి.

ఒకవేళ డిజిటల్ వస్తువు ఆర్ట్ ఉల్లంఘన క్లెయిమ్‌గా మారితే (లేదా మారే అవకాశం ఉందని Reddit నిర్ధారిస్తే), సదరు డిజిటల్ వస్తువు ఆర్ట్‌ను భర్తీ చేయడానికి, దానిని ఉపయోగించడం కొనసాగించే హక్కును పొందడానికి, లేదా డిజిటల్ వస్తువు ఆర్ట్‌కు సంబంధించిన మీ లైసెన్స్ హక్కులను (వర్తించే పక్షంలో, అవతార్ ఆర్ట్‌కు సంబంధించిన మీ లైసెన్స్ హక్కులతో సహా) రద్దు చేయడానికి Redditకు పూర్తి హక్కు ఉంటుంది.

5. Devvit యాప్‌లు

5.1 అవలోకనం

మీరు సర్వీస్‌ల ద్వారా Reddit డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో రన్ అయ్యే యాప్‌లతో (Reddit యొక్క డెవలపర్ నిబంధనలలో నిర్వచించిన విధంగా) ఇంటరాక్ట్ అవ్వడానికి అనుమతించబడవచ్చు (మొత్తంగా, వీటిని “Devvit యాప్‌లు” అని అంటారు). Devvit యాప్‌లు, Reddit ద్వారా లేదా ఒక థర్డ్-పార్టీ ద్వారా (ఒక “డెవలపర్”) క్రియేట్ చేయబడవచ్చు, మరియు ఇవి సాధారణంగా కమ్యూనిటీలలోని మోడరేటర్ల చేత ఇన్‌స్టాల్ చేయబడి, Devvit యాప్‌లుగా లేబుల్ చేయబడతాయి.

మీరు ఒక కమ్యూనిటీ యొక్క మోడరేటర్‌గా ఒక Devvit యాప్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంటే, మీ ఇన్‌స్టాలేషన్‌కు మరియు ఏదైనా Devvit యాప్ ఉపయోగానికి Reddit నిబంధనలు (మా మోడరేటర్ ప్రవర్తనా నియమావళితో సహా) నిరంతరం వర్తిస్తాయని గుర్తుంచుకోవడం ముఖ్యం. Devvit యాప్‌లను ఎలా ఇన్‌స్టాల్ చేయాలో మరియు ఉపయోగించడం ఎలా ప్రారంభించాలో తెలుసుకోవడానికి  Devvit యాప్‌ల గైడ్‌లో ఇక్కడ మీరు మరింత సమాచారాన్ని కనుగొనవచ్చు.

కొన్ని Devvit యాప్‌లు వాటితో పరస్పర చర్యలు జరపడానికి మరియు వాటి పరిధిలోనే కంటెంట్‌ను క్రియేట్ చేయడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. Devvit యాప్‌తో మీరు జరిపే ఏవైనా సంభాషణలు మరియు దానిలో మీరు క్రియేట్ చేసే కంటెంట్ అన్నీ మా Reddit నిబంధనలకు లోబడి ఉంటాయి.(మా  గోప్యతా విధానం మరియు Reddit నిబంధనలతో సహా).

మీరు Reddit డెవలపర్ ప్లాట్‌ఫామ్ మరియు Devvit యాప్‌ల గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ కనుగొనవచ్చు.

5.2 Devvit వస్తువులు

Reddit లేదా డెవలపర్‌లు Devvit యాప్‌ల ద్వారా అందించే నిర్దిష్ట డిజిటల్ వస్తువులు, ఉత్పత్తులు లేదా ఫీచర్‌లను పొందడానికి మీరు గోల్డ్‌ను ఉపయోగించవచ్చు (మొత్తంగా, వీటిని “Devvit వస్తువులు” అని అంటారు). Reddit సంస్థే Devvit వస్తువులను అందించినప్పుడు, మీరు ఆ Devvit వస్తువులను నేరుగా Reddit నుండే పొందుతున్నారు, కాబట్టి వాటికి సంబంధించిన ఎలాంటి వివాదాన్నయినా ఇక్కడ Redditను సంప్రదించడం ద్వారానే పరిష్కరించుకోవాలి.

డెవలపర్‌ల నుండి పొందే Devvit వస్తువులు మా  Econ నిబంధనల  కింద థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌లుగా పరిగణించబడతాయి మరియు అవి Devvit వస్తువుల కోసం డెవలపర్ విధించే ఏవైనా వినియోగ నిబంధనలకు లోబడి ఉంటాయి. ఒక డెవలపర్ Devvit వస్తువులను అందించినప్పుడు, Reddit ఆ డెవలపర్ తరపున లేదా వారికి ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ఉండవచ్చు, మరియు మీరు ఆ Devvit వస్తువులను నేరుగా డెవలపర్ నుండే పొందుతున్నారు. Devvit వస్తువులకు సంబంధించి మీకు మరియు డెవలపర్‌కు మధ్య వచ్చే ఎలాంటి వివాదాలనైనా నేరుగా ఆ డెవలపర్‌ను సంప్రదించడం ద్వారానే పరిష్కరించుకోవాలి, మరియు ఆ వివాదాన్ని పరిష్కరించడానికి సదరు డెవలపరే బాధ్యత వహిస్తారు. సంబంధిత Devvit యాప్ కోసం Devvit యాప్ డైరెక్టరీలో  ఇక్కడ శోధించడం ద్వారా మీరు Devvit వస్తువుల వినియోగ నిబంధనలను మరియు డెవలపర్ సంప్రదింపు సమాచారాన్ని కనుగొనవచ్చు.

Devvit వస్తువులను పొందడానికి, మీరు గోల్డ్‌ను ఉపయోగించడం అనేది, మా  Econ నిబంధనల కు (మా రీఫండ్ పాలసీతో సహా) లోబడి ఉంటుంది.

5.3 Devvit యాప్ గోప్యతా అంశాల పరిశీలన

Devvit యాప్‌లు, Reddit డెవలపర్ ప్లాట్‌ఫామ్‌లో హోస్ట్ చేయబడతాయి మరియు ఇవి మీ పబ్లిక్ కంటెంట్‌ను (Reddit యొక్క  పబ్లిక్ కంటెంట్ పాలసీలో నిర్వచించిన విధంగా), అలాగే Devvit యాప్‌లతో మీరు జరిపే పరస్పర చర్యలను సేకరించవచ్చు మరియు స్టోర్ చేయవచ్చు. కొన్ని Devvit యాప్‌లు ఆయా Devvit యాప్ యొక్క గోప్యతా విధానానికి అనుగుణంగా, మీ పబ్లిక్ కంటెంట్‌ను మరియు ఇంటరాక్షన్‌లను బాహ్య వెబ్‌సైట్‌లతో కూడా షేర్ చేయవచ్చు. అంతే కాకుండా, Devvit వస్తువులను అందించే Devvit యాప్‌లు, ఆయా Devvit వస్తువులకు సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా సేకరించవచ్చు, షేర్ చేయవచ్చు మరియు స్టోర్ చేయవచ్చు.

యూజర్ డేటాను సేకరించేటప్పుడు, పంచుకునేటప్పుడు మరియు స్టోర్ చేసేటప్పుడు డెవలపర్‌లు Reddit యొక్క గోప్యతా విధానానికి  కట్టుబడి ఉండవలసి ఉంటుంది. అయితే, Devvit యాప్‌ల యూజర్ డేటా నిర్వహణ పద్ధతుల గురించి మరింత తెలుసుకోవడానికి, వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి ముందే ఆయా Devvit యాప్ యొక్క గోప్యతా విధానాలను సమీక్షించడం ముఖ్యం. సంబంధిత Devvit యాప్ కోసం  ఇక్కడ Devvit యాప్ డైరెక్టరీలో వెతకడం ద్వారా మీరు ఆ Devvit యాప్ యొక్క గోప్యతా విధానాన్ని మరియు యూజర్ డేటా అనుమతులను కనుగొనవచ్చు, అలాగే సాధారణంగా Devvit యాప్ గోప్యత గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ తెలుసుకోవచ్చు.

6. Reddit ప్రోగ్రామ్‌లు

అర్హులైన రెడ్డిటర్‌లు మరియు థర్డ్-పార్టీలు వారి డిజిటల్ వస్తువులు, ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు, Devvit యాప్‌లు, Devvit వస్తువులు, సర్వీస్‌లు లేదా Reddit, సర్వీసెస్, కమ్యూనిటీలు లేదా ఇతర రెడ్డిటర్‌లకు అందించే ఇతర సహకారాలకు బదులుగా ప్రోత్సాహకాలు లేదా పరిహారం పొందేందుకు వీలు కల్పించేలా, మేము ఫీచర్‌లకు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకు రావచ్చు (వీటన్నింటిని కలిపి "Reddit ప్రోగ్రామ్‌లు" అని పిలుస్తారు). మీరు ఏదైనా Reddit ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి అనుమతి పొందడానికి ముందే, అదనపు నిబంధనలు, పాలసీలు, మార్గదర్శకాలు లేదా నియమాలను అంగీకరించాల్సిందిగా మిమ్మల్ని కోరవచ్చు ("Reddit ప్రోగ్రామ్ నిబంధనలు"). ఉదాహరణకు, డబ్బు సంపాదించడానికి మీకు వీలు కల్పించే ఏవైనా Reddit ప్రోగ్రామ్‌లలో పాల్గొనడం అనేది మా  సంపాదనల నిబంధనలు, సంపాదనల పాలసీ, మరియు ఆ Reddit ప్రోగ్రామ్‌కు వర్తించే ఇతర నిబంధనలకు లోబడి ఉంటుంది. ఒకవేళ Reddit ప్రోగ్రామ్ నిబంధనలు, ప్రివ్యూల నిబంధనలు లేదా Reddit నిబంధనలతో విభేదించిన పక్షంలో, వర్తించే Reddit ప్రోగ్రామ్‌లో మీ భాగస్వామ్యానికి సంబంధించి, Reddit ప్రోగ్రామ్ నిబంధనలే వర్తిస్తాయి.

7. ఖాతా తాత్కాలిక నిలిపివేత లేదా రద్దు

మా  యూజర్ ఒప్పందం మరియు మా Reddit నిబంధనల ప్రకారం, మీరు మా సర్వీస్‌ల నిబంధనలను మరియు మీరు పాల్గొనే వ్యక్తిగత సబ్‌రెడిట్‌ల నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అలా చేయని పక్షంలో, అది ప్రివ్యూల నిబంధనలను ఉల్లంఘించినట్లు కావచ్చు, దాని ఫలితంగా సర్వీసెస్ లేదా నిర్దిష్ట సబ్‌రెడిట్‌లలో మీపై తాత్కాలిక లేదా శాశ్వత నిషేధానికి దారితీయవచ్చు, లేదా మీరు ఫీచర్‌లను యాక్సెస్ చేయగల సబ్‌రెడిట్‌లతో సహా మీ పోస్ట్‌లు మరియు కామెంట్‌లు తొలగించబడవచ్చు. అటువంటి సందర్భాలలో, మీరు ఫీచర్‌ల యొక్క ప్రయోజనాలను కోల్పోవచ్చు, వీటిలో పెయిడ్ సర్వీస్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు, డిజిటల్ వస్తువులు, Devvit వస్తువులు, వాల్ట్ లేదా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులు వంటి ఫీచర్‌లు ఉండవచ్చు; మరియు ఈ నష్టానికి మేము మీకు ఎలాంటి పరిహారం చెల్లించబోము.

8. మీ అంగీకారాలు

సర్వీస్‌ల ద్వారా ఒక ఫీచర్‌గా అందుబాటులో ఉంచబడిన ఏదైనా డిజిటల్ వస్తువు, ధృవీకరించబడిన డిజిటల్ వస్తువు, వాల్ట్ ఫీచర్‌లు, సబ్‌స్క్రిప్షన్‌లు లేదా ఇతర Reddit Econ వస్తువులతో సహా (వీటన్నింటినీ కలిపి, “Reddit Econ ఫీచర్‌లు”) ఏదైనా ఫీచర్‌ను మీరు యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించడం విషయంలో, మీరు ఈ క్రింది వాటికి ప్రాతినిధ్యం వహిస్తారు, హామీ ఇస్తారు, గుర్తిస్తారు మరియు ఒప్పుకుంటారు:

  • Reddit Econ వస్తువుల గురించిన మీ అంగీకారాలు Reddit Econ ఫీచర్‌లకు కూడా వర్తిస్తాయి –  Econ నిబంధనల  యొక్క సెక్షన్ 6లో పేర్కొన్న Reddit Econ వస్తువుల గురించిన మీ అంగీకారాలు, Reddit Econ ఫీచర్‌లకు కూడా సమానంగా వర్తిస్తాయి;
  • Reddit Econ ఫీచర్‌లు సరదా మరియు వినోదం కోసం ఉద్దేశించినవి – మీరు వినోద ప్రయోజనాల కోసం మరియు సర్వీసెస్‌కు సంబంధించి వినియోగించుకునే ఉద్దేశంతోనే Reddit Econ ఫీచర్‌లను పొందుతున్నారు;
  • Reddit Econ ఫీచర్‌లు పెట్టుబడులు కావు – మీరు పెట్టుబడి ప్రయోజనాల కోసం Reddit Econ ఫీచర్‌లను పొందడం లేదు. వీటిని పెట్టుబడి అవకాశంగా ఇతరులకు చూపించకూడదు, మరియు వీటిని కలిగి ఉండటం ద్వారా ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదా లాభం ఆశించకూడదు. అలాగే, వీటిని ఆర్థిక ప్రయోజనం లేదా లాభం పొందే అవకాశంగా గానీ, Redditలో వాటా పొందే అవకాశంగా గానీ ఇతరులకు చూపించకూడదు. వీటిని పొందడం ద్వారా మీరు Redditలో ఎలాంటి ఈక్విటీ, యాజమాన్యం లేదా చట్టపరమైన హక్కులను పొందడం లేదు. మా అనుమతి లేకుండా ఏవైనా Reddit Econ ఫీచర్‌లలో పాక్షిక వాటాలను విక్రయించడానికి ప్రయత్నించకూడదు; ఏ వ్యక్తికైనా ఇందులో సెక్యూరిటీ ఇంట్రెస్ట్, లీన్ లేదా ఇతర హక్కులను బదిలీ చేయకూడదు; లేదా ఏవైనా Reddit Econ ఫీచర్‌లను ఉపయోగించడానికి సబ్‌స్క్రిప్షన్‌లు, లైసెన్స్‌లు లేదా ఇతర హక్కులను విక్రయించకూడదు;
  • మీరు చాలా వరకు Reddit Econ ఫీచర్‌లను బదిలీ చేయలేరు లేదా విక్రయించలేరు – ప్రివ్యూల నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్న పరిమిత మినహాయింపులతో తప్ప, మీ Reddit Econ ఫీచర్‌లను (మీ లైసెన్స్ హక్కులతో సహా) మా అనుమతి లేకుండా సర్వీసెస్ వెలుపల లేదా మీ ఖాతా వెలుపల విక్రయించడం, ట్రేడ్ చేయడం, వస్తు మార్పిడి చేయడం, బదిలీ చేయడం, ఎక్స్ఛేంజ్ చేయడం, విక్రయానికి ఉంచడం లేదా ఇతరత్రా ఉపయోగించడం సాధ్యపడదు;
  • మీరు చట్టానికి కట్టుబడి ఉంటారు మరియు విచక్షణను ఉపయోగిస్తారు – మోసపూరితంగా పొందిన, దొంగిలించబడిన, అనధికారికంగా తీసుకున్న లేదా ఇతరత్రా చట్టవిరుద్ధంగా పొందిన ఏవైనా Reddit Econ ఫీచర్‌లను సంపాదించడానికి లేదా విక్రయించడానికి మీరు మా సర్వీస్‌లను ఉపయోగించకూడదు లేదా ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు. (మార్కెట్ అవకతవకలు, మనీ లాండరింగ్, మోసం లేదా మరేదైనా చట్టవిరుద్ధమైన నేరాలతో సహా), ఎటువంటి చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం, సర్వీసెస్ లోపల లేదా వెలుపల ఎటువంటి Reddit Econ ఫీచర్‌ను ఉపయోగించకూడదు. అలాగే, ఎలాంటి పందాలు, బెట్టింగ్‌లు లేదా జూదం కోసం గానీ, లేదా  నిషేధించబడిన వస్తువులు లేదా సర్వీస్‌లకు సంబంధించిన లావాదేవీలపై Reddit విధానం కింద నిషేధించబడిన వస్తువులు లేదా సర్వీస్‌లతో కూడిన ఎలాంటి లావాదేవీలకు సంబంధించి గానీ వీటిని ఉపయోగించకూడదు. ధృవీకరించిన డిజిటల్ వస్తువులకు సంబంధించిన ఎలాంటి బహిర్గతం కాని ముఖ్యమైన సమాచారం మీ వద్ద ఉన్నప్పుడు, మీరు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ధృవీకరించిన డిజిటల్ వస్తువులను సంపాదించడం లేదా విక్రయించడం చేయకూడదు, మరియు ఏవైనా Reddit Econ ఫీచర్‌లను మీరు సంపాదించడం లేదా విక్రయించడం ద్వారా ఉత్పన్నమయ్యే పన్ను బాధ్యతలతో సహా వర్తించే చట్టాలకు అనుగుణంగా; మరియు
  • ప్రివ్యూల నిబంధనలను ఉల్లంఘించేలా మీరు మరెవరినీ ప్రోత్సహించకూడదు – పైన పేర్కొన్న లేదా ప్రివ్యూల నిబంధనలలో పొందుపరచబడిన ఎలాంటి ప్రాతినిధ్యాలు, హామీలు, అంగీకారాలు మరియు ఒప్పందాలను ఏ థర్డ్-పార్టీ అయినా ఉల్లంఘించేలా చేయడానికి లేదా అలా చేయడానికి ప్రయత్నించడానికి మీరు కారణం కాకూడదు.

పైన పేర్కొన్న నిబంధనలను పాటించడంలో మరియు వాటికి కట్టుబడి ఉండటంలో విఫలమైతే, అది ప్రివ్యూల నిబంధనలను ఉల్లంఘించినట్లు కావచ్చు, దాని ఫలితంగా Reddit లేదా నిర్దిష్ట సబ్‌రెడిట్‌లలో తాత్కాలిక లేదా శాశ్వత నిషేధానికి గురికావచ్చు లేదా Reddit Econ ఫీచర్‌లకు మీ యాక్సెస్ తొలగించబడవచ్చు. అటువంటి సందర్భాలలో, మీరు Reddit Econ ఫీచర్‌ల ప్రయోజనాలను కోల్పోవచ్చు మరియు ఈ నష్టానికి మేము మీకు పరిహారం చెల్లించము.

9. మీరు ఈ రిస్క్‌లను అంగీకరిస్తున్నారు

ఏదైనా Reddit Econ ఫీచర్‌ను మీరు యాక్సెస్ చేయడం మరియు ఉపయోగించిన సందర్భంలో, మీరు ఈ క్రింది ప్రమాదాలను అంగీకరించి, స్వీకరిస్తున్నారు మరియు మీపై వేసుకుంటున్నారు;అలాగే వాటి వల్ల కలిగే లేదా ఉత్పన్నమయ్యే ఎలాంటి బాధ్యత నుండి అయినా మీరు Redditకు నష్టపరిహార మినహాయింపును ఇస్తున్నారు:

  • Reddit Econ వస్తువుల (Reddit Econ Goods) రిస్క్‌లు Reddit Econ ఫీచర్‌లకు కూడా వర్తిస్తాయి –  Econ నిబంధనల  యొక్క సెక్షన్ 7లో జాబితా చేయబడిన Reddit Econ వస్తువుల రిస్క్‌లు, Reddit Econ ఫీచర్‌లకు కూడా సమానంగా వర్తిస్తాయి;
  • మీ వాల్ట్‌ను సురక్షితంగా ఉంచుకోవడంలో విఫలమవడం (మరింత తెలుసుకోండి) – మీరు మీ డివైజ్‌ను పోగొట్టుకున్నా, మీ వాల్ట్ యాక్సెస్ సమాచారాన్ని మరచిపోయినా, లేదా తప్పులు మరియు లోపాల వల్ల అయినా (దానిలో ఉన్న ఏదైనా వెరిఫైడ్ డిజిటల్ గూడ్స్‌తో సహా) మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి, వాల్ట్‌ను సృష్టించిన వెంటనే వీలైనంత త్వరగా దానిని భద్రపరచుకోవడానికి (ఉదాహరణకు, వాల్ట్ పాస్‌వర్డ్‌ను సృష్టించడం, మీ రికవరీ పదబంధం మరియు ప్రైవేట్ కీలను సేవ్ చేసుకోవడం లేదా ఇతర వాల్ట్ ఫీచర్లను ఉపయోగించడం ద్వారా) మీరు అంగీకరిస్తున్నారు; లేనిచో దానిలో మీరు స్టోర్ చేస్తున్న ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులకు యాక్సెస్ కోల్పోయే ప్రమాదం ఉంది. మీ వాల్ట్‌ను సురక్షితంగా ఉంచుకోవడంలో మీరు విఫలమై, దానికి యాక్సెస్‌ను కోల్పోతే, మీ వాల్ట్ యాక్సెస్ సమాచారంతో సహా మీ వాల్ట్‌లో స్టోర్ చేయబడిన ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను తిరిగి పొందడంలో Reddit మీకు సహాయం చేయలేదని మీరు అర్థం చేసుకున్నారు; అలాగే మీ ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను మీ స్వంత ఆధీనంలో ఉంచుకోవడంలో మీ వైఫల్యానికి Reddit మీ పట్ల బాధ్యత వహించదు;
  • బ్లాక్‌చెయిన్‌లతో సమస్యలు – వాల్ట్, వాల్ట్ ఫీచర్లు, మరియు ధృవీకరించబడిన డిజిటల్ వస్తువుల వినియోగానికి బ్లాక్‌చెయిన్ టెక్నాలజీపై తగినంత పరిచయం అవసరం, మరియు వాల్ట్ ఫీచర్ల ద్వారా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను బదిలీ చేయడానికి ముందు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ మరియు వాల్ట్ మరియు ధృవీకరించబడిన డిజిటల్ వస్తువుల కార్యాచరణ మరియు లక్షణాల గురించి మరింత తెలుసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారు; మేము పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లను (వాటిపై స్టోర్ చేయబడిన రికార్డులతో సహా) నియంత్రించము మరియు పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లు మీ వాల్ట్‌కు (దానిలోని ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులతో సహా) నిరంతరాయంగా పనిచేస్తాయని లేదా మద్దతు ఇస్తాయని మేము హామీ ఇవ్వలేము, మరియు హ్యాకర్లు లేదా మూడవ పక్షాల ద్వారా జరిగే ఏవైనా లోపాలు, వైఫల్యాలు, మైనింగ్, మాల్‌వేర్, సేవా నిరాకరణ, లేదా ఇతర దాడులకు లేదా వాల్ట్ లేదా ఏవైనా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులకు పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లతో ఉన్న ఏవైనా హార్డ్ ఫోర్క్‌లు, అప్‌డేట్‌లు, అప్‌గ్రేడ్‌లు లేదా అనుకూలత లేకపోవడానికి మేము బాధ్యత వహించము;
  • బదిలీలతో సమస్యలు (మరింత తెలుసుకోండి) – Reddit Econ ఫీచర్‌ల నిషేధిత బదిలీ ప్రయత్నాలు ఏవైనా చెల్లకుండా పోయినప్పటికీ, ప్రివ్యూల నిబంధనల ప్రకారం మీరు నిర్దిష్ట Reddit Econ ఫీచర్‌లను బదిలీ చేయడానికి అనుమతించబడవచ్చు. అయితే మీరు చేసే Reddit Econ ఫీచర్‌ల బదిలీ ఏదైనా సరే అది అంతిమమైనది, వెనక్కి తీసుకోలేనిది. మీరు దానిని బదిలీ చేసిన తర్వాత మీ Reddit Econ ఫీచర్‌ను తిరిగి పొందడంలో Reddit మీకు సహాయం చేయదు, అలాగే ఆ నష్టానికి ఎటువంటి రీఫండ్ లేదా పరిహారం అందించదు. అంతే కాకుండా, మీరు చేసే ఎలాంటి Reddit Econ ఫీచర్ బదిలీకైనా, బదిలీని అందుకునే వ్యక్తి గుర్తింపునకైనా, బదిలీ కారణానికైనా, లేదా ఆ Reddit Econ ఫీచర్ పట్ల బదిలీని అందుకునే వ్యక్తికి కలిగే సంతృప్తికైనా Reddit ఎలాంటి వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వదు మరియు దానికి బాధ్యత వహించదు;
  • డెవలపర్‌లతో సమస్యలు – ఒక డెవలపర్ Devvit వస్తువులను అందించినప్పుడు, మీరు ఆ Devvit వస్తువులను నేరుగా ఆ డెవలపర్ నుండే పొందుతున్నారు. మీకు మరియు డెవలపర్‌కు మధ్య జరిగే ఎలాంటి లావాదేవీలకైనా (Devvit వస్తువుల లావాదేవీలకు సంబంధించిన వివాదాలతో సహా), మీ లావాదేవీ కారణానికైనా, లేదా ఏదైనా Devvit వస్తువు, Devvit యాప్ లేదా డెవలపర్ పట్ల మీకు కలిగే సంతృప్తికైనా Reddit ఎలాంటి వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వదు మరియు దానికి బాధ్యత వహించదు; (మీరు ఈ Devvit యాప్‌లతో ఇంటరాక్ట్ అవ్వడం మరియు Devvit వస్తువుల లావాదేవీలలో పాల్గొనడం అనేది పూర్తిగా మీ స్వంత రిస్క్‌పై మాత్రమే జరుగుతుంది);
  • రెడ్డిట్ ప్రోగ్రామ్‌లకు అర్హత – Reddit ఎకాన్ గూడ్స్ మరియు Reddit ఎకాన్ ఫీచర్స్ నుండి వచ్చే ఆదాయంలో అర్హతగల రెడిటర్లు మరియు మూడవ పక్షాలు వాటా పొందేందుకు Reddit అనుమతించవచ్చు, కానీ ఏ రెడిటర్ లేదా మూడవ పక్షం అయినా Reddit నుండి పరిహారం లేదా ఆర్థిక సహాయం పొందుతారని Reddit హామీ ఇవ్వదు, మరియు Reddit ప్రోగ్రామ్‌ల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవసరమైన Reddit ఎకాన్ గూడ్స్ లేదా Reddit ఎకాన్ ఫీచర్స్ సంఖ్యను Reddit పెంచవచ్చు లేదా కొన్ని Reddit ప్రోగ్రామ్‌ల నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు; మరియు
  • పన్ను నిబంధనలకు లోబడి ఉండటం, చట్టపరమైన చర్యలు మరియు మారుతున్న చట్టాలు – మీరు Reddit నుండి Reddit Econ ఫీచర్‌లను కొనుగోలు చేసిన తర్వాత లేదా క్లెయిమ్ చేసిన తర్వాత, ఆ Reddit Econ ఫీచర్‌లలో మీరు చేసే తదుపరి లావాదేవీల ఫలితంగా చెల్లించాల్సిన పన్నులకు లేదా వాటికి సంబంధించిన పన్ను పరిణామాలకు Reddit బాధ్యత వహించదు. అలాగే, Reddit Econ ఫీచర్‌లు, Vault, పబ్లిక్ బ్లాక్‌చెయిన్‌లు మరియు సంబంధిత సాంకేతికతలపై, అలాగే అవి నిరంతరం అందుబాటులో ఉండటంపై ప్రతికూల ప్రభావం చూపే ఎటువంటి చట్టపరమైన లేదా నియంత్రణ చర్యలకు (Reddit Econ ఫీచర్‌ల ఉపయోగం గురించి నియంత్రణ సంస్థల ద్వారా మీపై జరిగే ఏవైనా విచారణలతో సహా) మరియు చట్టాలలో (పన్ను చట్టాలతో సహా) వచ్చే మార్పులకు కూడా Reddit బాధ్యత వహించదు.

పైన పేర్కొన్న రిస్క్‌లను మీరు అంగీకరించి మీపై వేసుకోవడం అనేది,Reddit Econ ఫీచర్‌లను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి, ఒక తప్పనిసరి నిబంధన అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ రిస్క్‌లను అంగీకరించడానికి మీరు సమ్మతించకుంటే, Reddit Econ ఫీచర్‌లను ఉపయోగించడానికి మా నుండి మీకు అనుమతి ఉండదు.

10. నిరాకరణలు మరియు బాధ్యతా పరిమితి

చట్టం అనుమతించిన గరిష్ట పరిమితి మేరకు, అన్ని Reddit Econ ఫీచర్‌లు (ఏవైనా డిజిటల్ వస్తువు ఆర్ట్ మరియు మీ వాల్ట్ వినియోగం అలాగే ఏవైనా వాల్ట్ ఫీచర్‌లతో సహా) “ఉన్నది ఉన్నట్లుగా,” “అందుబాటులో ఉన్నట్లుగా,” మరియు “అన్ని లోపాలతో” సహా అందించబడతాయి, మరియు Reddit సంస్థలు వాటి గురించి లేదా సర్వీస్‌ల గురించి (వాల్ట్ మరియు వాల్ట్ ఫీచర్‌లు మరియు వాటి పనితీరు, లభ్యత మరియు భద్రతతో సహా) ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి ప్రాతినిధ్యాలు, హామీలు లేదా ఎండార్స్‌మెంట్‌లు (ఏదైనా ఒక నిర్దిష్ట ప్రయోజనానికి తగినట్లుగా ఉండటం, హక్కుల ఉల్లంఘన జరగకుండా ఉండటం, విక్రయ యోగ్యత లేదా యాజమాన్య హక్కులకు సంబంధించిన ఎలాంటి హామీలు లేకపోవడంతో సహా) ఇవ్వడం లేదు.

11. సవరణ లేదా నిలిపివేత

ఏదైనా Reddit Econ ఫీచర్‌ను ఉపయోగించడం ద్వారా, ఈ ఫీచర్‌లు ఎలాంటి ముందస్తు నోటిఫికేషన్ లేదా Redditకు ఎటువంటి బాధ్యత లేకుండా, మా స్వంత విచక్షణ మేరకు, ఏ కారణం చేతనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానే, ఇంకా ఏ సమయంలోనైనా రద్దు చేయబడవచ్చని మీరు అర్థం చేసుకున్నారు. మీకు తెలియజేసినా లేదా తెలియజేయకున్నా, ఏ సమయంలోనైనా ఏదైనా Reddit Econ ఫీచర్‌ను (పూర్తిగా లేదా పాక్షికంగా) సవరించే, సస్పెండ్ చేసే లేదా నిలిపివేసే హక్కు మాకు ఉంది. ఏదైనా Reddit Econ ఫీచర్ యొక్క ఫంక్షనాలిటీకి సంబంధించిన ఎలాంటి భవిష్యత్తు రిలీజ్ అయినా , అప్‌డేట్‌లు లేదా ఇతర చేర్పులైనా ప్రివ్యూల నిబంధనలకు లోబడి ఉంటాయి, ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయబడవచ్చు. ఏదైనా Reddit Econ ఫీచర్ యొక్క (పూర్తిగా లేదా పాక్షికంగా) సవరణ, సస్పెన్షన్ లేదా నిలిపివేతకు సంబంధించి, మేము మీకు లేదా ఏ ఇతర థర్డ్-పార్టీకి బాధ్యత వహించబోమని మీరు అంగీకరిస్తున్నారు. సర్వీసెస్ పైన లేదా వాటి ద్వారా ఎలాంటి Reddit Econ ఫీచర్ అయినా ఇకపై ఉపయోగించడానికి వీల్లేకుండా పోతే, ఎటువంటి రీఫండ్‌లు ఇవ్వబడవు.

12. రీఫండ్ విధానం

సర్వీసెస్ ద్వారా మీరు కొనుగోలు చేసే పెయిడ్ సర్వీస్‌లు అయిన Reddit Econ ఫీచర్‌లకు మీకు తక్షణ యాక్సెస్ అలాగే వాటిని ఉపయోగించుకునే సదుపాయం ఉంటుంది. దీని ఫలితంగా, చట్టం అనుమతించిన గరిష్ట పరిమితి మేరకు, అన్ని కొనుగోళ్లు అంతిమమైనవి. అలాగే, వీటికి ఎలాంటి రీఫండ్ గానీ లేదా తిప్పి పంపే సదుపాయం గానీ ఉండదు. పాక్షికంగా ఉపయోగించిన బిల్లింగ్ కాల వ్యవధికి సంబంధించి రీఫండ్ లేదా క్రెడిట్ ఇవ్వవలసిన బాధ్యత మాకు లేదు.

మీరు EEA, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే, ఎటువంటి కారణాలు చెప్పకుండా 14 క్యాలెండర్ రోజులలోపు ప్రివ్యూల నిబంధనల నుండి వైదొలిగే హక్కు మీకు ఉంది. ఉపసంహరణ గడువు అనేది ప్రివ్యూల నిబంధనలు ముగిసిన తేదీ నుండి 14 క్యాలెండర్ దినాలు ఉంటుంది. మీ ఉపసంహరణ హక్కును వినియోగించుకోవడానికి, మీరు తప్పనిసరిగా Redditకు ఒక  అభ్యర్థన‌ను సమర్పించాలి .

మీరు కింది వాటిని కలిగి ఉన్న పెయిడ్ సర్వీస్‌లు లేదా థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌లు అయిన Reddit Econ ఫీచర్‌లను కొనుగోలు చేసినప్పుడు మీ ఉపసంహరణ హక్కును కోల్పోతారని దయచేసి గమనించండి: (a) డిజిటల్ వస్తువులను, లేదా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువులను, లేదా Devvit వస్తువులను ఉపయోగించడానికి లైసెన్స్; లేదా (b) సబ్‌స్క్రిప్షన్. సదరు డిజిటల్ వస్తువు, లేదా ధృవీకరించబడిన డిజిటల్ వస్తువు, లేదా Devvit వస్తువు మీ ఖాతాకు లేదా వాల్ట్‌కు జమ అయిన వెంటనే లేదా సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన వెంటనే ఈ పెయిడ్ సర్వీస్‌లు మరియు థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌లు మీకు అందించబడతాయి. అలాగే, కొనుగోలు చేసిన వెంటనే ఈ పెయిడ్ సర్వీస్‌లను మరియు థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌ను ఈ విధంగా మీకు అందించబడటానికి మీరు రిక్వెస్ట్ చేసి, సమ్మతిస్తున్నారు, దీనితో మీ ఉపసంహరణ హక్కు రద్దవుతుంది.

13. ఇతర అంశాలు

Reddit నిబంధనలు (మా  యూజర్ ఒప్పందం మరియు Econ నిబంధనలతో సహా) ఈ సూచన ద్వారా ఈ ప్రివ్యూల నిబంధనలలో చేర్చబడ్డాయి మరియు వాటిలో భాగంగా చేయబడ్డాయి. ఒకవేళ ఏవైనా Reddit నిబంధనలు, ఈ ప్రివ్యూల నిబంధనలతో విభేదిస్తే, Reddit Econ ఫీచర్‌ల యొక్క మీ యాక్సెస్, కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించి ఈ ప్రివ్యూల నిబంధనలు మాత్రమే వర్తిస్తాయి.

⌂ 换网址