
డెేటా API నిబంధనలు
- తెలుగు
- Bahasa Indonesia
- Bahasa Melayu - Malaysia
- Čeština – Česká republika
- Dansk - Danmark
- Deutsch – Deutschland
- English
- Español - España
- Español - México
- Farsi
- Français - France
- Hrvatski – Hrvatska
- Italiano - Italia
- Magyar – Magyarország
- Nederlands - Nederland
- Norwegian Bokmål
- Polski (Polska)
- Português - Brasil
- Português - Portugal
- Română - România
- Slovenčina - Slovensko
- Suomi – Suomi
- Svenska – Sverige
- Tagalog
- Tiếng Việt - Việt Nam
- Türkçe - Türkiye
- Ελληνικά - Ελλάδα
- Български – България
- Русский — Россия
- Српски – Србија
- Українська — Україна
- עברית
- اردو
- العربية
- मराठी
- हिंदी भारत
- বাংলা
- ગુજરાતી
- தமிழ்
- ಕನ್ನಡ
- ไทย
- 한국어 - 대한민국
- 中文 - 繁體
- 日本語 - 日本
- 简体中文
జూన్ 19, 2023 నుండి అమలులోకి వస్తుంది. చివరిగా జూలై 20, 2026న సవరించారు
మా డేటా APIలు మరియు వాటితో పాటు Reddit అందించే సంబంధిత డేటా, కోడ్ మరియు ఇతర మెటీరియల్స్ ("డేటా APIలు") గురించి మీరు అడిగినందుకు ధన్యవాదాలు. సమిష్టిగా, మేము ఈ డేటా API నిబంధనలు, డెవలపర్ నిబంధనలు, మా యూజర్ ఒప్పందం, ఏవైనా అదనపు నిబంధనలు, డేటా APIలకు అనుబంధంగా ఉన్న డెవలపర్ డాక్యుమెంటేషన్‌లోని నిబంధనలు, వాటికి వర్తించే ఏవైనా విధానాలు మరియు మార్గదర్శకాలను "డేటా API నిబంధనలు"గా సూచిస్తాము, అలాగే డేటా API నిబంధనలలో డెవలపర్ నిబంధనలు ఇంకా మా యూజర్ ఒప్పందంలో నిర్వచించిన కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి.
డేటా APIలను ఉపయోగించడం ద్వారా, మీరు Redditతో ఉన్న డెవలపర్ నిబంధనలతో సహా డేటా API నిబంధనలకు అంగీకరిస్తున్నారు. మీరు డేటా APIలను ఉపయోగించినా లేదా ఉపయోగించకపోయినా, మా సేవల నుండి మీరు యాక్సెస్ చేసే డేటా APIలను, ఏవైనా ఇతర మెటీరియల్స్‌ను కేవలం డేటా API నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంటుంది.
1. నమోదు
1.1 అర్హత
కింది సందర్భాలలో మీరు డేటా APIలను ఉపయోగించకపోవచ్చు మరియు డేటా API నిబంధనలను అంగీకరించకపోవచ్చు: (a) Redditతో చట్టబద్ధంగా కట్టుబడి ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి మీకు చట్టపరమైన వయస్సు లేకపోతే; లేదా (b) మీరు నివసిస్తున్న దేశంతో సహా, లేదా మీరు డేటా APIలను ఉపయోగిస్తున్న దేశంతో సహా, యునైటెడ్ స్టేట్స్ లేదా ఇతర దేశాల వర్తించే చట్టాల ప్రకారం డేటా APIలను ఉపయోగించడానికి లేదా స్వీకరించడానికి అనర్హులైన వ్యక్తి.
1.2 కార్పొరేట్ వినియోగం
మీరు మీ యజమాని లేదా మరొక సంస్థ తరపున డేటా API నిబంధనలను అంగీకరిస్తున్నట్లయితే, ఈ కింది వాటిని ధృవీకరించి, హామీ ఇస్తున్నారు: (a) మీ యజమానిని లేదా సంబంధిత సంస్థను డేటా API నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి మీకు పూర్తి చట్టపరమైన అధికారం ఉంది; (b) మీరు డేటా API నిబంధనలను చదివి, అర్థం చేసుకున్నారు.; మరియు (c) మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న పక్షం తరపున, డేటా API నిబంధనలకు అంగీకరిస్తున్నారు. మీ యజమానిని లేదా వర్తించే సంస్థను నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి మీకు చట్టపరమైన అధికారం లేకుంటే, దయచేసి డేటా APIలను ఉపయోగించవద్దు.
1.3 సంప్రదింపు సమాచారం
డేటా APIలను యాక్సెస్ చేయడానికి, మీరు గుర్తింపు సమాచారాన్ని (e.g., సంప్రదింపు వివరాలు) అందించాల్సి ఉంటుంది. ఈ సమాచారం తప్పనిసరిగా ఎల్లప్పుడూ తాజాగా మరియు ఖచ్చితంగా ఉండాలి.
2. మీ డేటా APIల వినియోగం
2.1 లైసెన్స్
డెేటా API నిబంధనలకు మీరు పూర్తిగా, నిరంతరం కట్టుబడి ఉండటానికి లోబడి, Data API నిబంధనలలో స్పష్టంగా అనుమతించిన విధంగా మరియు దానికి అనుగుణంగా మాత్రమే Data APIలను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి Reddit మీకు నాన్-ఎక్స్‌క్లూజివ్, ఇంకా బదిలీ చేయలేని, సబ్-లైసెన్స్ ఇవ్వలేని మరియు ఉపసంహరించుకోదగిన లైసెన్స్‌ను మంజూరు చేస్తోంది. మీకు స్పష్టంగా మంజూరు చేయని అన్ని హక్కులు Redditకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి.
2.2 యాప్ యూజర్లు
మీ యాప్ యూజర్లు (ఎండ్ యూజర్లతో సహా) డేటా API నిబంధనలకు సంబంధించిన అన్ని నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండేలా చూస్తారని మీరు అంగీకరిస్తున్నారు.
2.3 Reddit నిబంధనలు మరియు నియమాలకు అనుగుణంగా ఉండటం
కాలక్రమేణా సవరించే అవకాశం ఉన్న Reddit యూజర్ ఒప్పందం మరియు గోప్యతా విధానంకు కట్టుబడి ఉండటానికి మీరు అంగీకరిస్తున్నారు. అంతేకాకుండా, మీరు డేటా API డెవలపర్ డాక్యుమెంటేషన్‌కు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.
2.4 యూజర్ కంటెంట్
యూజర్లు మా సర్వీస్‌ల ద్వారా సృష్టించిన లేదా వాటికి సమర్పించిన కంటెంట్ ("యూజర్ కంటెంట్") అనేది సదరు యూజర్లకే చెందుతుంది, Redditకు కాదు. డేటా API నిబంధనలకు మీరు పూర్తిగా మరియు నిరంతరం కట్టుబడి ఉన్నట్లయితే, డేటా APIని ఉపయోగించి యూజర్ కంటెంట్‌ను కాపీ చేయడానికి మరియు ప్రదర్శించడానికి Reddit మీకు ఒక లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. ఈ లైసెన్స్ నాన్ ఎక్స్‌క్లూజివ్, బదిలీ చేయలేనిది, సబ్-లైసెన్స్ ఇవ్వలేనిది మరియు రద్దు చేయగలిగేది. మీ యాప్ యూజర్ల కోసం, యాప్‌ను డెవలప్ చేయడానికి, అందుబాటులోకి తీసుకురావడానికి, పంపిణీ చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన మేరకు మాత్రమే ఈ లైసెన్స్ మంజూరు చేయబడుతుంది. అటువంటి ప్రదర్శన కోసం ఫార్మాట్ చేయడం తప్ప, మీరు యూజర్ కంటెంట్‌ను సవరించే అవకాశం ఉండదు. యూజర్ కంటెంట్ వినియోగంపై దాని సంబంధిత యజమానులు విధించిన ఏవైనా ప్రమాణాలు లేదా పరిమితులకు మీరు కట్టుబడి ఉంటారు. ఇందులో "అన్ని హక్కులు ఉన్నాయి" అనే ప్రకటనలు, క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌లు, లేదా మీకు మరియు యజమానులకు మధ్య నిర్దేశించిన ఇతర నిబంధనలు మరియు షరతులు ఉండవచ్చు. ఈ విభాగంలో స్పష్టంగా అనుమతి ఉన్నట్లు పేర్కొన్నవి తప్ప, ఇతర హక్కులు లేదా లైసెన్స్‌లు మంజూరు చేయబడవు లేదా సూచించబడవు. వర్తించే యూజర్ కంటెంట్‌లోని హక్కుదారుల స్పష్టమైన అనుమతి లేకుండా, మెషిన్ లెర్నింగ్ లేదా AI మోడల్‌కు శిక్షణ ఇవ్వడం వంటి ఇతర ప్రయోజనాల కోసం యూజర్ కంటెంట్‌ను ఉపయోగించే హక్కు కూడా ఇందులో ఉంటుంది.
2.5 తొలగింపులు
Reddit నిబంధనల ప్రకారం, యూజర్ కంటెంట్‌ను తొలగించమని మీకు నోటీసులు లేదా అభ్యర్థనలు అందవచ్చు. అవసరమైనప్పుడు, ఇక్కడ అభ్యర్థనను సమర్పించడం ద్వారా మీరు ఈ అభ్యర్థనలను Redditకి పంపుతారు.
2.6 గోప్యతా విధానం
మీరు మీ యాప్ యూజర్లు మరియు ఇతర సందర్శకుల నుండి పొందిన డేటాను ఎలా సేకరిస్తారో, ఉపయోగిస్తారో, స్టోర్ చేస్తారో మరియు బహిర్గతం చేస్తారో మీ యాప్‌లో ఒక గోప్యతా విధానం ద్వారా తెలియజేస్తారు. ఇందులో భాగంగా, వర్తించే చోట, థర్డ్ పార్టీలు (ఉదా., ప్రకటనదారులు) కంటెంట్‌ను లేదా ప్రకటనలను అందించవచ్చని మరియు కుక్కీల వినియోగంతో సహా, మీ యాప్ యూజర్లు మరియు ఇతర సందర్శకుల నుండి నేరుగా సమాచారాన్ని సేకరించే అవకాశం ఉందనే విషయం తప్పనిసరిగా చేర్చాలి. దీనికి అదనంగా, డేటా APIలను ఉపయోగించడం ద్వారా, సమర్పించిన సమాచారాన్ని Reddit మా గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు.
2.7 చట్టానికి అనుగుణంగా ఉండటం
వర్తించే అన్ని చట్టాలు లేదా నిబంధనలకు (డేటా దిగుమతి లేదా ఎగుమతి, లేదా సాఫ్ట్వేర్, గోప్యత మరియు స్థానిక చట్టాలకు సంబంధించిన వాటితో సహా) మీరు కట్టుబడి ఉంటారు.
2.8 అనుమతించబడిన యాక్సెస్
డేటా APIలకు సంబంధించి డెవలపర్ డాక్యుమెంటేషన్‌లో వివరించిన యాక్సెస్ సమాచారాన్ని ఉపయోగించి మాత్రమే, మీరు డేటా APIలను యాక్సెస్ చేస్తారు (లేదా యాక్సెస్ చేయడానికి ప్రయత్నిస్తారు). డేటా APIలను యాక్సెస్ చేసేటప్పుడు మేము మీకు అందించిన యాక్సెస్ సమాచారాన్ని (ఉదా., OAuth టోకెన్) మీరు తప్పనిసరిగా ఉపయోగించాలి. అలాగే, డేటా APIలను ఉపయోగించేటప్పుడు మీరు యూజర్ ఏజెంట్‌ను గానీ లేదా OAuth గుర్తింపును గానీ తప్పుగా చూపించకూడదు లేదా దాచిపెట్టకూడదు.
2.9 API పరిమితులు
Reddit తన స్వంత నిర్ణయాధికారం మేరకు, డేటా APIల వినియోగంపై (ఉదా., మీరు చేయగలిగే API అభ్యర్థనల సంఖ్యను లేదా మీరు సేవలు అందించగలిగే యాప్ యూజర్ల సంఖ్యను పరిమితం చేయడం) పరిమితులను విధించవచ్చు మరియు అమలు చేయవచ్చు.
2.10 లైబ్రరీలు, వ్రాపర్లు మరియు ఎక్స్టెన్షన్లు
Redditను మా యూజర్లకు అందించడంలో సహాయపడే కొన్ని అద్భుతమైన థర్డ్ పార్టీ లైబ్రరీలు, వ్రాపర్లు మరియు ఎక్స్టెన్షన్లు ఉన్నాయి. మీ యాప్ వాటిని ఉపయోగిస్తుంటే, సంబంధిత థర్డ్ పార్టీ మరియు Reddit విధించిన ఏవైనా పరిమితులకు లేదా నిబంధనలకు మీరు కట్టుబడి ఉండాలి.
3. ఫీజులు; వినియోగంపై పరిమితులు
3.1 ఫీజులు
డేటా APIల భవిష్యత్ వినియోగం లేదా వాటిని యాక్సెస్ చేయడం కోసం ఫీజులను వసూలు చేసే హక్కు Redditకిి ఉంది. ఈ రేట్లను Reddit తన పూర్తి విచక్షణ మేరకు నిర్ణయిస్తుంది. మీరు డేటా APIలను వాణిజ్య ప్రయోజనాల కోసం, రేట్ పరిమితులను మించి పరిశోధన కోసం, లేదా డేటా API నిబంధనల ప్రకారం స్పష్టంగా అనుమతించబడని ఏ ఇతర అవసరం కోసమైనా ఉపయోగించాలనుకుంటే, మీరు Redditతో ఒక ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మరింత సమాచారం కోసం, దయచేసి మా డెవలపర్ డాక్యుమెంటేషన్‌ను ఇక్కడ సమీక్షించండి.
3.2 పరిమితులు
మీరు స్వయంగా గానీ, లేదా మీ తరపున వ్యవహరించే వారు గానీ, కింది పనులు చేయకూడదు:
-
చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను లేదా థర్డ్ పార్టీ హక్కుల ఉల్లంఘనను ప్రమోట్ చేయడానికి డేటా APIలను ఉపయోగించడం (సంబంధిత యూజర్ కంటెంట్‌పై హక్కులు కలిగిన వారి స్పష్టమైన అనుమతి లేకుండా, ఆ కంటెంట్‌ను మెషిన్ లెర్నింగ్ లేదా AI మోడల్‌కు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించడంతో సహా);
-
వర్తించే చట్టం ఈ పరిమితిని స్పష్టంగా నిషేధించిన సందర్భంలో తప్ప, డేటా APIలను రివర్స్ ఇంజనీర్ చేయడం, డీ-కంపైల్ చేయడం, డిస్అసెంబుల్ చేయడం లేదా అనువదించడం, లేదా ఏదైనా డేటా APIలు లేదా వాటిలోని ఏదైనా భాగం నుండి సోర్స్ కోడ్‌ను పొందడం;
-
డెవలపర్ డాక్యుమెంటేషన్‌లో వివరించిన విధంగా డేటా APIల కాల్స్ మరియు వినియోగంపై ఉన్న పరిమితులను దాటవేయడం లేదా అతిక్రమించడం చేయరాదు; అలాగే Data APIలను మితిమీరిన లేదా దుర్వినియోగం చేసే విధంగా ఉపయోగించరాదు లేదా Data APIలను గానీ, వాటిని అందించే సర్వర్స్ లేదా నెట్‌వర్క్‌లను గానీ అంతరాయం కలిగించేలా లేదా సహేతుకం కాని విధంగా జోక్యం చేసుకునేలా ఉపయోగించరాదు (స్పష్టత కోసం: మీరు ఈ సెక్షన్‌ను ఉల్లంఘించారని Reddit భావిస్తే, Data APIలకు మీ యాక్సెస్‌ను శాశ్వతంగా బ్లాక్ చేసే హక్కు Redditకు ఉంటుంది);
-
డేటా APIల యొక్క ఫీచర్లు లేదా ఫంక్షనాలిటీకి ఆటంకం కలిగించడం, సవరించడం, అంతరాయం కలిగించడం లేదా డిజేబుల్ చేయడం, ఫంక్షనాలిటీని పరిమితం చేయడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించే ఏదైనా మెకానిజంతో సహా, లేదా డేటా APIల యొక్క ఏదైనా సాఫ్ట్వేర్ రక్షణ లేదా పర్యవేక్షణ మెకానిజంను నిర్వీర్యం చేయడం, తప్పించుకోవడం, దాటవేయడం, తొలగించడం, నిష్క్రియం చేయడం లేదా మరే విధంగానైనా అధిగమించడం;
-
వైరస్లు, వార్మ్‌లు, లోపాలు, ట్రోజన్ హార్స్‌లు, మాల్వేర్ లేదా విధ్వంసక స్వభావం కలిగిన ఇతర అంశాలను ప్రవేశపెట్టే ఉద్దేశంతో డేటా APIలను ఉపయోగించడం;
-
Reddit నుండి స్పష్టమైన రాతపూర్వక అనుమతి ఉంటే తప్ప మీరు ఏ రకంగానైనా Data APIలను లేదా వాటి యాక్సెస్‌ను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లేదా సబ్-లైసెన్స్ ఇవ్వడం చేయరాదు; అలాగే ప్రత్యక్ష వాణిజ్య లేదా ద్రవ్య ప్రయోజనాల కోసం Data APIల వినియోగం లేదా ప్రొవిజన్ నుండి ఆదాయాన్ని పొందరాదు;
- మీ ఆమోదిత వినియోగ సందర్భానికి మించి, డేటా APIల ద్వారా యాక్సెస్ చేసిన ఏదైనా యూజర్ కంటెంట్‌ను, మెటీరియల్స్‌ను లేదా డేటాను ఉపయోగించడం లేదా స్టోర్ చేయడం, మరియు దానికి అవసరం లేని ఏదైనా డేటాను వెంటనే తొలగించడం; లేదా
-
యూజర్లను స్పామ్ చేయడానికి, ప్రలోభపెట్టడానికి లేదా వేధించడానికి డేటా APIలను ఉపయోగించడం.
4. ట్రేడ్‌మార్క్‌లు; ఆపాదన; ప్రచారం
4.1 Reddit ట్రేడ్‌మార్క్‌ల వినియోగం
Reddit నుండి లిఖితపూర్వక అనుమతి లేదా డేటా API నిబంధనలలో స్పష్టంగా పేర్కొంటే తప్ప, మీ యాప్ పేరులో గానీ లేదా దానిలో భాగంగా గానీ, అలాగే మీ యాప్‌ను ప్రమోట్ చేయడానికి లేదా గుర్తించడానికి ఉపయోగించే ఏవైనా లోగోలలో Reddit ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగించడానికి మీకు అనుమతి లేదు. అంతేకాకుండా, మీరు కింది పనులు చేయకూడదని అంగీకరిస్తున్నారు: (a) మీ అప్లికేషన్‌కు Reddit యొక్క మద్దతు, అనుబంధం లేదా స్పాన్సర్షిప్ ఉన్నట్లు సూచించే లేదా సహేతుకంగా భ్రమ కలిగించేలా Reddit ట్రేడ్‌మార్క్‌లకు సంబంధించిన ఎటువంటి డెరివేటివ్ వర్క్‌లను సృష్టించరాదు; (b) యూజర్లను తప్పుదోవ పట్టించేలా, మోసగించేలా లేదా అయోమయానికి గురిచేసేలా Reddit ట్రేడ్‌మార్క్‌లను ఉపయోగించరాదు, ఇందులో ఏవైనా Reddit ట్రేడ్‌మార్క్‌లను పోలి ఉండి కన్ఫ్యూజ్ చేసే మార్కులను ఉపయోగించడం లేదా రిజిస్టర్ చేయడం కూడా నిషిద్ధం; మరియు (c) Reddit ట్రేడ్‌మార్క్‌లపై Redditకు ఉన్న యాజమాన్యాన్ని సవాలు చేయరాదు, సదరు యాజమాన్యానికి విరుద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదు; అలాగే Reddit ట్రేడ్‌మార్క్‌లపై తనకున్న ప్రత్యేక హక్కులను స్థాపించడానికి లేదా రక్షించుకోవడానికి Reddit అవసరమని భావించే ఏవైనా చర్యలలో (న్యాయపరమైన చర్యలతో సహా), Reddit అభ్యర్థన మరియు ఖర్చుల మేరకు మీరు పూర్తిగా సహకరించాలి. Reddit ట్రేడ్‌మార్క్‌ల మొత్తం వినియోగం మరియు అటువంటి వినియోగం ద్వారా సమకూరే సద్భావన అంతా పూర్తిగా Redditకే చెందుతుంది.
4.2 ఆపాదన
డేటా APIలకు సంబంధించిన డెవలపర్ డాక్యుమెంటేషన్‌లో వివరించిన విధంగా, Reddit కోరే ఏవైనా ఆపాదిత వివరాలను ప్రదర్శించడానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు డేటా APIలను ఉపయోగిస్తున్నప్పుడు, డేటా API నిబంధనలు అమలులో ఉన్నంత వరకు, “Reddit” అనే వర్డ్మార్క్కు ముందు “కొరకు“ అనే పదాన్ని ఉపయోగించే షరతుపై, ఆ వర్డ్‌మార్క్‌ను ఉపయోగించడానికి లేదా ప్రదర్శించడానికి Reddit మీకు బదిలీ చేయలేని, సబ్-లైసెన్స్ ఇవ్వలేని మరియు నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్స్‌ను మంజూరు చేస్తోంది (ఉదా., “Reddit కోసం [పేరును చేర్చండి]”).
4.3 పబ్లిసిటీ
Reddit నుండి ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా, Data APIల వినియోగానికి సంబంధించి Redditతో భాగస్వామ్యం, వారి స్పాన్సర్షిప్ లేదా వారి ఆమోదం ఉన్నట్లు సూచించే ఎటువంటి ప్రకటనను మీరు చేయకూడదు.
5. మద్ధతు; మార్పులు; ఫీడ్‌బ్యాక్
5.1 మద్దతు
Reddit తన స్వంత నిర్ణయాధికారం మేరకు, డేటా APIల విషయంలో మద్దతును లేదా సవరణలను మీకు అందించవచ్చు మరియు మీకు ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండా ఎప్పుడైనా అటువంటి మద్దతును నిలిపివేసే అవకాశం ఉండవచ్చు.
5.2 డేటా APIలకు మార్పులు
Reddit తన Data APIలకు సంబంధించిన ఏ భాగాన్నయినా ఎప్పుడైనా మార్చవచ్చు, సస్పెండ్ చేయవచ్చు లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు; ఇందులో Data APIs యొక్క మొత్తం లేదా ఏదైనా భాగం అందుబాటులో ఉండే అంశం కూడా ఉండవచ్చు.
5.3 ఫీడ్‌బ్యాక్
డేటా APIలకు సంబంధించి మీరు అందించే ఏదైనా ఫీడ్‌బ్యాక్‌ను, మీకు ఎలాంటి పరిమితి, బాధ్యత లేదా పరిహారం లేకుండా, ఏవైనా Reddit ప్రోడక్ట్‌లు, సేవల్లో ఉపయోగించవచ్చని, సవరించవచ్చని, పొందుపరచవచ్చని మీరు అంగీకరించి, ధృవీకరిస్తున్నారు.
6. రద్దు
Redditకు ముందస్తు నోటీసు ఇవ్వకుండా లేదా ఇచ్చి, మీరు ఎప్పుడైనా డేటా APIల వినియోగాన్ని నిలిపివేయవచ్చు. ఏ కారణం వల్ల అయినా లేదా ఎంత కాలం వరకైనా, మీకు ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే డేటా APIలకు మీకు ఉన్న యాక్సెస్‌ను రద్దు చేసే హక్కు Redditకి ఉంది. డేటా API నిబంధనలను రద్దు చేసిన తర్వాత లేదా డేటా APIలకు మీ యాక్సెస్ నిలిపివేసిన తర్వాత, మీరు వెంటనే డేటా APIలను ఉపయోగించడం ఆపివేస్తారు, డేటా APIల ద్వారా అనుమతించిన లేదా బదిలీ చేసిన ఏదైనా కాష్ చేసిన లేదా స్టోర్ చేసిన యూజర్ కంటెంట్ మరియు మెటీరియల్స్‌ను తొలగిస్తారు మరియు ఏవైనా మొబైల్ అప్లికేషన్ల తదుపరి పంపిణీని లేదా అప్డేట్లను ఆపివేస్తారు (వర్తించే మేరకు). ఇందులో, డేటా APIలు లేదా మా ఇతర సేవల నుండి యాక్సెస్ చేసిన యూజర్ కంటెంట్ మరియు మెటీరియల్స్ నుండి పొందిన ఏదైనా డేటా లేదా మోడల్స్ ఉంటాయి.
7. డిస్‌క్లెయిమర్; బాధ్యత పరిమితి; నష్టపరిహారం
7.1 డిస్‌క్లెయిమర్
Data APIలు అనేవి తప్పులు, లోపాలు, బగ్‌లు లేదా అంతరాయాలు లేనివని లేదా అవి విశ్వసనీయమైనవి, ఖచ్చితమైనవి, సంపూర్ణమైనవి లేదా చెల్లుబాటు అయ్యేవి అని Reddit ఎటువంటి హామీ ఇవ్వడం లేదు, ధృవీకరించడం లేదు. Reddit తన డేటా APIలను ఎలాంటి హామీలు లేదా చట్టపరమైన వాగ్దానాలు లేకుండా పూర్తిగా "ఉన్నది ఉన్నట్లుగా" అందిస్తుంది. అంతేకాకుండా, డేటా యొక్క ఖచ్చితత్వానికి, అది మీ అవసరాలకు సరిపోతుందా లేదా అనేదానికి, లేదా ఆ సేవ సురక్షితంగా, అందుబాటులో మరియు దోషరహితంగా ఉంటుందా లేదా అనేదానికి తాము బాధ్యత వహించబోమని Reddit ప్రత్యేకంగా పేర్కొంటుంది. డేటా APIలను ఉపయోగించేటప్పుడు మీరు తీసుకునే ఏవైనా రిస్క్‌లకు లేదా నిర్ణయాలకు మీరే పూర్తి బాధ్యులు. వాటిని ఉపయోగించడం వల్ల మీ కంప్యూటర్ సిస్టమ్ దెబ్బతినడం లేదా మీ డేటాను కోల్పోవడం వంటి ఏదైనా హాని జరిగితే, దానికి మీరే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.
7.2 బాధ్యత పరిమితి
డేటా APIల వినియోగం వల్ల లేదా వాటికి సంబంధించి కలిగే ఎటువంటి ప్రత్యక్ష, పరోక్ష, యాదృచ్ఛిక, పర్యవసాన, ప్రత్యేక లేదా ఉదాహరణాత్మక నష్టాలకు సంబంధించి, Reddit మీకు చట్టపరంగా బాధ్యత వహించదు. ఈ నిబంధన, అపరాధం (నిర్లక్ష్యంతో సహా లేదా ఇతరత్రా), ఒప్పంద ఉల్లంఘన, వారంటీ ఉల్లంఘన లేదా మరేదైనా ఆర్థిక నష్టానికి సంబంధించిన దావా అయినప్పటికీ వర్తిస్తుంది. అటువంటి నష్టాలు సంభవించే అవకాశం ఉందని Redditకి ముందే తెలియజేసినా లేదా తెలియజేయకపోయినా ఈ నిబంధన వర్తిస్తుంది. ఏ పరిస్థితుల్లోనైనా, $100కు మించిన ఏ మొత్తానికైనా Reddit మీకు చట్టపరంగా ఎలాంటి బాధ్యత వహించదు.
7.3 నష్టపరిహారం
చట్టం అనుమతించే గరిష్ట పరిధి వరకు, Data APIలను మీరు ఉపయోగించడం వల్ల లేదా దానికి సంబంధించిన ఏ రకమైన థర్డ్-పార్టీ క్లెయిమ్ నుండి అయినా—అన్ని రకాల క్లెయిమ్‌లు, నష్టాలు, నష్టపరిహారాలు (వాస్తవ మరియు/లేదా పర్యవసానంగా జరిగేవి), దావాలు, తీర్పులు, వ్యాజ్యాల ఖర్చులు, న్యాయవాదుల ఫీజుల వల్ల ఉత్పన్నమయ్యే ఎలాంటి బాధ్యత లేదా వ్యయాన్నయినా—Reddit మరియు దాని సబ్సిడియరీలు, అనుబంధ సంస్థలు, అధికారులు, ఏజెంట్లు, లైసెన్సర్లు మరియు ఉద్యోగులకు నష్టపరిహారం చెల్లించడానికి, మరియు వారికి ఎటువంటి హాని కలగకుండా రక్షించడానికి మీరు అంగీకరిస్తున్నారు. అటువంటి దావా, వ్యాజ్యం లేదా చర్యకు సంబంధించి మీకు లిఖితపూర్వక నోటీసును అందించడానికి Reddit చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది.
8. ఇతర నిబంధనలు
8.1 గోప్యత
మీకు మేము పంపే సమాచారంలో అలాగే మా డేటా APIలలో Redditకి సంబంధించిన గోప్యమైన సమాచారం ఉండే అవకాశం ఉంది. Reddit గోప్య సమాచారంలో గోప్యమైనవిగా గుర్తించబడిన లేదా ఆయా పరిస్థితుల ప్రకారం సాధారణంగా గోప్యమైనవిగా పరిగణించబడే ఏవైనా మెటీరియల్స్, కమ్యూనికేషన్లు మరియు సమాచారం ఉంటాయి. డేటా API నిబంధనల ప్రకారం మీకు మంజూరు చేసిన హక్కులను వినియోగించుకోవడంలో అవసరమైన మేరకు మాత్రమే మీరు ఈ గోప్యమైన సమాచారాన్ని ఉపయోగించవచ్చు మరియు Reddit యొక్క ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీరు దానిని ఏ థర్డ్ పార్టీకి వెల్లడించకూడదు. ఇలాంటి స్వభావం కలిగిన మీ స్వంత గోప్యమైన మరియు యాజమాన్య సమాచారాన్ని సురక్షితం చేయడానికి, మీరు ఎలాంటి పద్ధతులను ఉపయోగిస్తారో అదే విధంగా ఈ గోప్య సమాచారాన్ని కూడా అనధికారిక వినియోగం, యాక్సెస్ లేదా వెల్లడి నుండి రక్షించడానికి మీరు అంగీకరిస్తున్నారు; అలాగే ఏ సందర్భంలోనైనా కనీసం సహేతుకమైన జాగ్రత్తను తప్పనిసరిగా తీసుకోవాలి. Reddit యొక్క గోప్యతా సమాచారంలో, మీరు స్వతంత్రంగా అభివృద్ధి చేసిన సమాచారం, ఎటువంటి రహస్య నిబంధనల బాధ్యత లేకుండా ఒక థర్డ్ పార్టీ ద్వారా మీకు న్యాయబద్ధంగా అందించిన సమాచారం, లేదా మీ ప్రమేయం లేకుండానే బహిర్గతమైన సమాచారం భాగం కావు. మాకు సమాచారం అందకూడదని కోర్టు ప్రత్యేకంగా ఆదేశిస్తే తప్ప, చట్టప్రకారం మీరు Reddit గోప్యతా సమాచారాన్ని వెల్లడించాల్సి వచ్చినప్పుడు, ఆ విషయమై మాకు సహేతుకమైన ముందస్తు నోటీసు ఇస్తే, మీరు దానిని వెల్లడించవచ్చు.
8.2 డేటా API నిబంధనలకు సవరణ
Reddit ఎప్పుడైనా డేటా API నిబంధనలను సవరించవచ్చు. మీరు డేటా API నిబంధనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. మేము డేటా API నిబంధనలను సవరిస్తే, సవరించిన డేటా API నిబంధనలను పోస్ట్ చేస్తాము. Data API నిబంధనలకు చేసిన సవరణలు లేదా మార్పులు అమల్లోకి వచ్చిన తర్వాత కూడా Data APIలను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, మీరు ఆ సవరించిన లేదా మార్చిన Data API నిబంధనలకు కట్టుబడి ఉండటానికి అంగీకరిస్తున్నారు.
8.3 సాధారణం
డేటా API నిబంధనలు, పార్టీల మధ్య ఎటువంటి ఏజెన్సీని, భాగస్వామ్యాన్ని లేదా ఉమ్మడి వెంచర్‌ను సృష్టించవు. డేటా API నిబంధనలలోని ఏదీ కూడా తాత్కాలిక నిషేధాజ్ఞల ద్వారా ఉపశమనం పొందేందుకు ఇరు పక్షాలకు ఉన్న హక్కును పరిమితం చేయదు. మా సహేతుకమైన నియంత్రణకు మించిన పరిస్థితుల వల్ల పనుల నిర్వహణలో వైఫల్యం లేదా ఆలస్యం జరిగితే, ఆ మేరకు Reddit ఎటువంటి బాధ్యత వహించదు. డేటా API నిబంధనలలోని దేన్నైనా అమలు చేయడంలో వైఫల్యం చెందితే, అది సదరు నిబంధనను లేదా ఇతర ఏ నిబంధననైనా వదులుకున్నట్లుగా భావించబడదు. Data API నిబంధనలలోని ఏదైనా విభాగం (లేదా విభాగంలోని ఏదైనా భాగం) చెల్లనిదిగా, చట్టవిరుద్ధంగా లేదా అమలు చేయలేనిదిగా ఉన్నప్పటికీ, Data API నిబంధనలలోని మిగిలిన భాగాలు అమలులో ఉంటాయి. డేటా API నిబంధనలు, చట్టాల వైరుధ్య సూత్రాలను మినహాయించి, కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాల ద్వారా నియంత్రించబడతాయి. డేటా API నిబంధనలకు సంబంధించిన ఎలాంటి వివాదానికైనా, కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో కౌంటీ యొక్క యొక్క వ్యక్తిగత అధికార పరిధికి మరియు ప్రత్యేక విచారణ స్థలానికి ఇరు పక్షాలు సమ్మతిస్తాయి. డేటా API నిబంధనలు (అలాగే ఈ నిబంధనలలో భాగంగా చేర్చిన డెవలపర్ నిబంధనలు మరియు మా యూజర్ ఒప్పందం) ఆ అంశానికి సంబంధించి, మీకు మరియు Redditకి మధ్య కుదిరిన పూర్తి ఒప్పందాన్ని తెలియజేస్తాయి. ఇవి ఆ అంశంపై అంతకుముందు లేదా అదే సమయంలో కుదిరిన ఏవైనా ఇతర ఒప్పందాల స్థానాన్ని భర్తీ చేస్తాయి.
8.4 ప్రశ్నలు
డేటా API నిబంధనలు లేదా డేటా APIల గురించిన ప్రశ్నలు లేదా కామెంట్లను ఇక్కడ తెలియజేయవచ్చు.