
Reddit సంపాదనల పాలసీ
- తెలుగు
- Bahasa Indonesia
- Bahasa Melayu - Malaysia
- Deutsch – Deutschland
- English
- Español - España
- Español - México
- Farsi
- Français - France
- Hrvatski – Hrvatska
- Italiano - Italia
- Magyar – Magyarország
- Nederlands - Nederland
- Norwegian Bokmål
- Polski (Polska)
- Português - Brasil
- Português - Portugal
- Română - România
- Slovenčina - Slovensko
- Suomi – Suomi
- Svenska – Sverige
- Tagalog
- Tiếng Việt - Việt Nam
- Türkçe - Türkiye
- Ελληνικά - Ελλάδα
- Български – България
- Русский — Россия
- עברית
- اردو
- العربية
- मराठी
- हिंदी भारत
- বাংলা
- ગુજરાતી
- தமிழ்
- ಕನ್ನಡ
- ไทย
- 中文 - 繁體
- 简体中文
సెప్టెంబర్ 24, 2024 నుండి అమలులోకి వస్తుంది. చివరిగా సెప్టెంబర్ 24, 2024న సవరించారు
Reddit యొక్క సంపాదనల ప్రోగ్రామ్‌లు, అర్హత కలిగిన సంపాదించే వ్యక్తులకు Redditలోని అర్హత కలిగిన యాక్టివిటీలకు నగదును అందుకోవడానికి వీలు కల్పిస్తాయి. డబ్బు సంపాదించడానికి, మీరు తప్పనిసరిగా సంపాదనల నిబంధనలకు మరియు ఈ సంపాదనల పాలసీలో వివరించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.
Redditలోని అన్ని రకాల కంటెంట్ల మాదిరిగానే, ఆదాయాన్ని సంపాదించగల కంటెంట్ కూడా Reddit యొక్క యూజర్ ఒప్పందం మరియు Reddit నిబంధనలకు లోబడి ఉంటుందని దయచేసి గమనించండి. Reddit నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్‌పై మేము తగిన చర్యలు తీసుకుంటాము, అలాగే Reddit నిబంధనలను, ఈ సంపాదనల పాలసీని లేదా సంపాదనల నిబంధనలను ఉల్లంఘించే కంటెంట్ ద్వారా పొందే ఏవైనా సంపాదనలను నిలిపివేస్తాము.
అర్హతగల సంపాదించే వ్యక్తులు
సంపాదనల ప్రోగ్రామ్‌లో సంపాదించే వ్యక్తిగా మీ ఖాతాకు అర్హత పొందాలంటే, Reddit ఈ కింద పేర్కొన్న వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది:
-
మీరు నివసించే దేశంలో సంపాదనల ప్రోగ్రామ్ అందుబాటులో ఉండాలి
-
మీ Reddit ఖాతా కనీసం 30 రోజులుగా యాక్టివ్‌గా ఉండి, ధృవీకరించిన ఇమెయిల్ అడ్రస్‌తో రిజిస్టర్ అయి ఉండాలి
-
మీరు Personaతో విజయవంతంగా మీ గుర్తింపును ధృవీకరించి ఉండాలి
-
మీరు ధృవీకరించిన Stripe ఖాతాకు కనెక్ట్ అయి ఉండాలి
-
Reddit యొక్క యూజర్ ఒప్పందం, Reddit నియమాలు, సంపాదనల నిబంధనలకు అనుగుణంగా మీ Reddit ఖాతాను సరైన స్థితిలో ఉంచాలి
-
మా ప్రకటనల పాలసీని ఉల్లంఘించినందుకు సస్పెండ్ చేసిన అడ్వర్టైజర్ ఖాతాతో మీ ఖాతా అనుసంధానమై ఉండకూడదు
అర్హత లేని కంటెంట్
Redditలో అద్భుతమైన కృషి చేస్తున్న కమ్యూనిటీ సభ్యులను ప్రోత్సహించేందుకు, అర్హత కలిగిన Devvit యాప్‌లతో సహా, చాలా రకాల కంటెంట్ ద్వారా, అర్హత కలిగిన వారు డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తున్నాము.
Redditలోని కంటెంట్ అంతా Reddit యొక్క Reddit నిబంధనలకు , యూజర్ ఒప్పందానికి (అంటే మా నియమాలు) తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి. అర్హత కలిగిన సంపాదకుడి కంటెంట్‌కు గుర్తింపు లభించి, అది మా నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లయితే, వారు సంపాదనల ప్రోగ్రామ్‌లో భాగంగా చెల్లింపులను పొందేందుకు అర్హత సాధించే అవకాశం ఉంది.
ఈ కంటెంట్, ప్లాట్ఫామ్లో అనుమతించబడినప్పటికీ, కొన్ని రకాల టాపిక్‌లకు సంపాదన పొందడానికి అర్హత ఉండదు. సదరు సంపాదన ప్రోగ్రామ్ నిబంధనలలో ప్రత్యేకంగా పేర్కొనకపోతే తప్ప, పోస్ట్ చేసిన సమయంలో లేదా పేఅవుట్కు ముందు ఎప్పుడైనా, కింది విధంగా ఉండే ఏ కంటెంట్‌కు కూడా Reddit పరిహారం అందించదు:
-
క్వారంటైన్ చేయబడిన కమ్యూనిటీలో పోస్ట్ చేసినా
- NSFW ("వర్క్‌ప్లేస్‌కు సురక్షితం కానిది")గా ట్యాగ్ చేసినా లేదా NSFWగా ట్యాగ్ చేసిన కమ్యూనిటీలో పోస్ట్ చేసినా
-
గమనిక: ఈ సంపాదనల పాలసీ మరియు సంపాదనల నిబంధనల ప్రకారం, Devvit యాప్ (మరియు దాని కంటెంట్ మరియు Devvit వస్తువులు) సంపాదనకు అర్హత కలిగి ఉంటే, NSFW కమ్యూనిటీలో ఇన్స్టాల్ చేసిన Devvit యాప్ కూడా సంపాదించడానికి అర్హత పొందే అవకాశం ఉంది.
-
- నగ్నత్వం, ప్రత్యక్ష లేదా పరోక్ష లైంగిక చర్యలు, లైంగిక వస్తువులు, లైంగిక వినోదం లేదా లైంగిక సేవలతో సహా, లైంగికంగా స్పష్టంగా లేదా లైంగిక భావనను రేకెత్తించే విధంగా ఉండటం. లైంగిక లేదా అశ్లీలమైన డిజిటల్ లేదా యానిమేటెడ్ కంటెంట్‌కు, అలాగే లైంగిక కంటెంట్‌కు దారి తీసే లింక్‌లకు కూడా ఇది వర్తిస్తుంది.
-
లైంగికేతర నగ్నత్వానికి సంబంధించిన కంటెంట్ (ఉదాహరణకు: తల్లి పాలివ్వడం, లైంగిక ఆరోగ్య విద్య లేదా విద్యాపరమైన పరిశోధన) విషయంలో మేము మినహాయింపులను పరిగణించే అవకాశం ఉంది.
-
- హింస, మరణం, తీవ్రమైన శారీరక గాయం లేదా రక్తపాతాన్ని (యుద్ధం లేదా సైనిక ఘర్షణలకు సంబంధించిన స్పష్టమైన దృశ్యాలతో సహా) వర్ణించడం లేదా ప్రమోట్ చేయడం.
-
మినహాయింపులు: ఈ నిషేధం వృత్తిపరమైన పోరాట క్రీడలను వర్ణించే కంటెంట్, కల్పిత వినోదం, యానిమేటెడ్ లేదా డిజిటల్ కంటెంట్ (ఉదా., వీడియో గేమ్‌లు), లేదా కొన్ని సందర్భాల్లో, వార్తలకు సంబంధించిన కంటెంట్‌కు వర్తించదు.
-
- ఈ కింది వర్గాలకు చెందిన వస్తువులు లేదా సేవల వినియోగాన్ని ప్రమోట్ చేయడం:
-
మాదకద్రవ్యాలు (వినోదం కోసం వాడేవి, వైద్యుల సూచనతో వాడేవి లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా లభించేవి), మద్యం, పొగాకు లేదా ఇతర నియంత్రిత పదార్థాలు.
-
తుపాకులు, తుపాకీ భాగాలు, ఉపకరణాలు, మందుగుండు సామగ్రి మరియు పేలుడు పదార్థాలు
-
కాంటెస్ట్, స్వీప్‌స్టేక్స్ లేదా రాఫిల్‌లో పాల్గొనడానికి ఇచ్చే ఆఫర్లతో సహా జూదం లేదా లాటరీ సేవలు.
-
- కింద పేర్కొన్నవి అభ్యర్థించడం, ప్రోత్సహించడం లేదా సమర్పించడం:
-
డబ్బు లేదా క్రిప్టో సంపాదించే మోసపూరిత సేవలు, ప్రోగ్రామ్‌లు లేదా సభ్యత్వాలు (ఉదా., "త్వరగా ధనవంతులు అయ్యే" పథకాలు)
-
స్వచ్ఛంద లేదా రాజకీయ ప్రయోజనం కోసం, ప్రచారం లేదా సంస్థకు చెల్లింపులు లేదా విరాళాలు
-
చట్టవిరుద్ధమైన లేదా హానికరమైన/ప్రమాదకరమైన ప్రవర్తనల్లో పాల్గొనడం.
-
ఎన్ఫోర్స్మెంట్
సంపాదనల ప్రోగ్రామ్‌లో నగదు పొందడానికి, పైన అలాగే సంపాదనల నిబంధనలలో పేర్కొన్న వర్తించే ప్రమాణాలకు మీరు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి.
ఆదాయం పొందేందుకు అవసరమైన అర్హత ప్రమాణాలకు మీరు ఇకపై కట్టుబడి లేరని Reddit గుర్తిస్తే, మీరు సంపాదనల ప్రోగ్రామ్‌లో పాల్గొనలేరు. అలాగే, Redditలో నగదు సంపాదించే మీ అవకాశాన్ని మేము తాత్కాలికంగా నిలిపివేస్తాము లేదా శాశ్వతంగా తొలగిస్తాము. మీరు అర్హత నిబంధనలను ఎప్పుడు ఆపేశారు అనేదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. దీని వలన భవిష్యత్తులో సంపాదనపై ఇంకా గతంలో చెల్లించని సంపాదనపై ప్రభావం పడవచ్చు.
ఏదైనా కంటెంట్ కాంట్రిబ్యూషన్, Devvit యాప్ లేదా ఇతర యాక్టివిటీలు, సదరు ప్రోగ్రామ్ యొక్క సంపాదన అర్హత నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, మేము ఆ సంపాదన చెల్లింపులను నిలిపివేస్తాము మరియు దానికి తగిన విధంగా మరిన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంటాము. అంతేకాకుండా, మీరు ఏవైనా ప్రోగ్రామ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘిస్తే, ఏవైనా సంపాదన ప్రోగ్రామ్‌లలో మీ భాగస్వామ్యాన్ని మేము తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ముగించవచ్చు. ప్రోగ్రామ్ నిబంధనలలో దేనినైనా తీవ్రంగా ఉల్లంఘించినట్లయితే (ఉదాహరణకు, మీకు మీరే అనుమానాస్పద రీతిలో నగదు బహుమతులు లేదా గోల్డ్ ఇచ్చుకోవడం), మేము ప్రోగ్రామ్‌లో మీ భాగస్వామ్యాన్ని తక్షణమే ముగించాల్సి ఉంటుంది.