
Reddit ఎంబెడ్స్ నిబంధనలు
- తెలుగు
- Bahasa Indonesia
- Bahasa Melayu - Malaysia
- Čeština – Česká republika
- Dansk - Danmark
- Deutsch – Deutschland
- English
- Español - España
- Español - México
- Farsi
- Français - France
- Hrvatski – Hrvatska
- Italiano - Italia
- Magyar – Magyarország
- Nederlands - Nederland
- Norwegian Bokmål
- Polski (Polska)
- Português - Brasil
- Português - Portugal
- Română - România
- Slovenčina - Slovensko
- Suomi – Suomi
- Svenska – Sverige
- Tagalog
- Tiếng Việt - Việt Nam
- Türkçe - Türkiye
- Ελληνικά - Ελλάδα
- Български – България
- Русский — Россия
- Српски – Србија
- Українська — Україна
- עברית
- اردو
- العربية
- मराठी
- हिंदी भारत
- বাংলা
- ગુજરાતી
- தமிழ்
- ಕನ್ನಡ
- ไทย
- 한국어 - 대한민국
- 中文 - 繁體
- 日本語 - 日本
- 简体中文
జూన్ 19, 2023 నుండి అమలులోకి వస్తుంది. చివరిగా ఏప్రిల్ 18, 2023న సవరించారు
మీరు Reddit ఎంబెడ్స్ సేవను (“Reddit ఎంబెడ్స్”) ఉపయోగించడానికి ఆసక్తి చూపినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము! ఈ Reddit ఎంబెడ్స్ నిబంధనలు (Reddit యొక్క డెవలపర్ నిబంధనలు, యూజర్ ఒప్పందం, Press & Broadcast Guidelines, బ్రాండ్ మార్గదర్శకాలు, “నిబంధనల”తో కలిపి) మీరు Reddit ఎంబెడ్స్ యాక్సెస్ చేయడానికి మరియు వినియోగానికి వర్తిస్తాయి. అలాగే, ఇందులో డెవలపర్ నిబంధనలు మరియు యూజర్ ఒప్పందంలో నిర్వచించిన కొన్ని నిబంధనలు కూడా ఉంటాయి. Reddit ఎంబెడ్స్ ద్వారా యూజర్ కంటెంట్‌ను లేదా Reddit లైసెన్స్ పొందిన ఏదైనా ఇతర మెటీరియల్స్‌ను పొందుపరచడం ద్వారా, మీరు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు. మీరు ఈ నిబంధనలకు అంగీకరించకపోతే, మీరు Reddit ఎంబెడ్స్ను యాక్సెస్ చేయలేకపోవచ్చు లేదా ఉపయోగించలేకపోవచ్చు. మీరు ఒక సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి అయితే, ఆ సంస్థ తరపున ఈ నిబంధనలను అంగీకరించడానికి మీకు తగిన అధికారం ఉందని మీరు అంగీకరిస్తున్నారు.
1. లైసెన్స్
1.1 మీకు సంబంధించిన మా లైసెన్స్
ఈ నిబంధనలకు అనుగుణంగా మీ యాప్‌లో యూజర్ కంటెంట్ కనిపించేలా చేయడానికి, మీరు మీ యాప్‌లో కాపీ చేసి, పేస్ట్ చేయగల URLను Reddit ఎంబెడ్స్ జెనరేట్ చేస్తుంది.
ఈ నిబంధనలకు (డెవలపర్ నిబంధనలు, యూజర్ ఒప్పందం మరియు Reddit ఎంబెడ్స్కు సంబంధించిన మొత్తం డెవలపర్ డాక్యుమెంటేషన్‌తో సహా) మీరు పూర్తిగా, నిరంతరం కట్టుబడి ఉండటానికి, డెవలపర్ నిబంధనల ప్రకారం (మరియు దాని పరిధికి లోబడి) Reddit లైసెన్స్‌కు అనుగుణంగా Reddit ఎంబెడ్స్ను ఉపయోగించడానికి Reddit మీకు నాన్-ఎక్స్‌క్లూజివ్ అయిన, బదిలీ చేయలేని, సబ్-లైసెన్స్ ఇవ్వలేని మరియు ఉపసంహరించుకోదగిన లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. మీకు స్పష్టంగా మంజూరు చేయని అన్ని హక్కులు Redditకు మాత్రమే ప్రత్యేకించబడ్డాయి.
1.2 Redditకి సంబంధించిన మీ లైసెన్స్
మీరు మీ యాప్‌లో యూజర్ కంటెంట్‌ను కనిపించేలా చేయడానికి Reddit ఎంబెడ్స్ను యాక్సెస్ చేసి, ఉపయోగిస్తున్నట్లయితే, ఈ నిబంధనలకు మీరు నిరంతరం కట్టుబడి ఉన్నారో లేదో నిర్ధారించుకోవడానికి మరియు వర్తించే చట్టాలకు అనుగుణంగా ఉండటానికి, మీ యాప్‌ను పర్యవేక్షించే ఉద్దేశ్యంతో, Reddit ఎంబెడ్స్ను ఉపయోగించి మీరు యూజర్ కంటెంట్‌ను లేదా ఏదైనా ఇతర Reddit లైసెన్స్ పొందిన మెటీరియల్స్‌ను ప్రదర్శించే మీ యాప్‌లోని ఏ భాగాన్నైనా ఇండెక్స్ చేయడానికి, కాష్ చేయడానికి, క్రాల్ చేయడానికి మరియు ఇతరత్రా యాక్సెస్ చేయడానికి, మీరు Redditకి, నాన్-ఎక్స్‌క్లూజివ్, రాయల్టీ రహిత, బదిలీ చేయలేని, సబ్-లైసెన్స్ ఇవ్వలేని, ఉపసంహరించుకోదగిన లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు.
2. వినియోగంపై పరిమితులు
Reddit ఎంబెడ్స్ అనేది Reddit ద్వారా కేవలం ఒక సౌకర్యంగా మాత్రమే అందించబడుతుంది మరియు ఈ నిబంధనలకు అనుగుణంగా మీ యాప్‌లో యూజర్ కంటెంట్‌ను ఎంబెడ్ చేయడానికి మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. Reddit ఎంబెడ్స్ వినియోగానికి సంబంధించి, Reddit ఎటువంటి బాధ్యత వహించదు మరియు ఎటువంటి హామీని ఇవ్వదు. ఈ నిబంధనలలో ఏదీ, యూజర్ కంటెంట్‌పై మీకు ఎటువంటి హక్కును గానీ, యాజమాన్యాన్ని గానీ లేదా ఆసక్తిని కల్పిస్తున్నట్లుగా పరిగణించబడదు. సంబంధిత హక్కుదారులు విధించిన ఏవైనా నిబంధనలకు లేదా పరిమితులకు అనుగుణంగా యూజర్ కంటెంట్‌ను ఉపయోగించడానికి మీరే పూర్తి బాధ్యత వహిస్తారు.
మీరు Reddit ఎంబెడ్స్ను ఉపయోగించేటప్పుడు లేదా యాక్సెస్ చేసేటప్పుడు, ఈ నిబంధనలను మరియు వర్తించే అన్ని చట్టాలను, రూల్స్‌ను మరియు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. Reddit ఎంబెడ్స్ వినియోగం, ఈ కింది పరిమితులు మరియు నిబంధనలకు కూడా లోబడి ఉంటుంది:
-
మీ యాప్‌లో యూజర్ కంటెంట్‌ను చూపడానికి తప్ప, మరే ఇతర ప్రయోజనం కోసం Reddit ఎంబెడ్స్ను ఉపయోగించవద్దు;
-
Reddit ముందస్తు లిఖితపూర్వక అనుమతి లేకుండా ఏవైనా Reddit సేవలను, డేటా యాక్సెస్‌ను విక్రయించడానికి, మీరు Reddit ఎంబెడ్స్ను ఉపయోగించరాదు;
-
Reddit ఎంబెడ్స్ ద్వారా మీ యాప్‌లో కనిపించే Reddit సేవలు మరియు డేటాకు సంబంధించిన ఏ అంశాలనైనా సవరించడం, మార్చడం, దాచడం లేదా డిజేబుల్ చేయడం లాంటివి చేయవద్దు;
-
Redditతో భాగస్వామ్యం, అనుబంధం, స్పాన్సర్షిప్ లేదా ఆమోదం ఉన్నట్లు సూచించే విధంగా Reddit సేవలను మరియు డేటాను ఎంబెడ్ చేయవద్దు; అలాగే
-
హక్కుదారుల స్పష్టమైన అనుమతి లేకుండా, ప్రకటనలలో యూజర్ కంటెంట్‌ను ప్రదర్శించడానికి లేదా ఏదైనా ప్రోడక్ట్ లేదా సేవకు మద్దతును సూచించడానికి Reddit ఎంబెడ్స్ను ఉపయోగించవద్దు.
Reddit నిబంధనల ప్రకారం కంటెంట్‌ను తొలగించమని మీకు నోటీసులు లేదా అభ్యర్థనలు వస్తే, మీరు ఈ సంప్రదింపు ఫారమ్ ద్వారా ఆ అభ్యర్థనలను Redditకి తెలియజేయాలి.
3. ఇతర అంశాలు
Reddit యొక్క డెవలపర్ నిబంధనలు, యూజర్ ఒప్పందం, Press & Broadcast Guidelines, మరియు బ్రాండ్ మార్గదర్శకాలు అన్నీ ఈ నిబంధనలలో భాగంగా చేర్చబడ్డాయి. ఈ నిబంధనలను ఎప్పుడైనా మార్చే హక్కు మాకు ఉంది. Reddit ఎంబెడ్స్ను మీరు నిరంతరాయంగా యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం అనేది, సవరించబడిన ఈ నిబంధనలకు మీరు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నట్లు పరిగణించబడుతుంది. మేము ఎప్పుడైనా Reddit ఎంబెడ్స్ లభ్యతను మార్చవచ్చు, సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు. అంతే కాకుండా, మా స్వంత నిర్ణయాధికారం మేరకు, Reddit ఎంబెడ్స్కు మీకు ఉన్న యాక్సెస్‌ను మరియు వాటి వినియోగాన్ని పరిమితం చేసే హక్కు Redditకి ఉంటుంది.