Reddit Premium మరియు వర్చువల్ వస్తువుల ఒప్పందం

Reddit Econ నిబంధనలు

తేదీ: 24 సెప్టెంబర్ 2024. నుండి అమల్లోకి వచ్చింది 24 మే, 2024 తేదీ నాడు చివరిగా సవరించబడింది

స్వాగతం! Reddit Econ నిబంధనలు (ఈ "Econ నిబంధనలు"), మీరు సర్వీసెస్ ద్వారా అందుబాటులో ఉంచిన పెయిడ్ సర్వీస్‌లు మరియు Reddit వర్చువల్ ఎకానమీ యొక్క ఇతర ఫీచర్‌లను ఎలా యాక్సెస్ చేయవచ్చు, కొనుగోలు చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు అనే దానిని నియంత్రిస్తాయి. ఈ Econ నిబంధనలు, మీరు ఇప్పటికే అంగీకరించిన   Reddit యూజర్ ఒప్పందం (దీనిని " యూజర్ ఒప్పందం " అంటారు)కు అదనంగా వర్తిస్తాయి మరియు ఇందులో  యూజర్ ఒప్పందంలో నిర్వచించబడిన కొన్ని నిబంధనలు కూడా చేర్చబడ్డాయి.

Reddit Premium లేదా డిజిటల్ వస్తువులతో సహా, (వీటిలో ప్రతి ఒక్కటి కింద నిర్వచించబడ్డాయి) పెయిడ్ సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, కొనుగోలు చేయడం లేదా ఇతరత్రా ఉపయోగించడం ద్వారా, ఈ Econ నిబంధనలకు కట్టుబడి ఉండటానికి మీరు అంగీకరిస్తున్నారు. మీరు ఈ Econ నిబంధనలకు అంగీకరించకపోతే, పెయిడ్ సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం చేయలేరు.

1. పెయిడ్ సర్వీస్‌లు, పేమెంట్ సమాచారం

1.1 అవలోకనం

సర్వీస్‌లలోని అనేక అంశాల ఉపయోగానికి ఎటువంటి రుసుములు లేనప్పటికీ, పెయిడ్ సర్వీస్‌ల విషయానికి వస్తే Reddit రుసుములను వసూలు చేస్తుంది. వీటిలో నిర్దిష్ట సబ్‌స్క్రిప్షన్ మెంబర్‌షిప్‌లు (“సబ్‌స్క్రిప్షన్‌లు”) మరియు ఈ Econ నిబంధనలు అలాగే (వర్తించేటట్లయితే) మా ప్రివ్యూల నిబంధనల కింద సర్వీసెస్ ద్వారా అందుబాటులో ఉంచిన నిర్దిష్ట డిజిటల్ అవతార్‌లు, వస్తువులు, కరెన్సీలు లేదా ఐటెమ్‌లు (మొత్తంగా, “డిజిటల్ వస్తువులు”)     ఉన్నాయి.

1.2 పేమెంట్ సమాచారం

పెయిడ్ సర్వీస్‌లను కొనుగోలు చేయడానికి మీరు మా సర్వీసెస్ ద్వారా మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా ఇతర చెల్లింపు సమాచారాన్ని (మీ “పేమెంట్ సమాచారం”) సమర్పించవచ్చు. Reddit నిర్దిష్ట పేమెంట్ విధానాలను ఆమోదిస్తుంది, ఇవి దేశాన్ని బట్టి లేదా పెయిడ్ సర్వీస్‌లను బట్టి మారవచ్చు. మీ పేమెంట్ సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి మేము థర్డ్-పార్టీ పేమెంట్ ప్రాసెసర్‌లను (ఉదాహరణకు Apple, Google, Stripe, PayPal మొదలైనవి) ఉపయోగిస్తాము, (మా “పేమెంట్ పార్ట్‌నర్‌లు”).

మీరు మీ పేమెంట్ సమాచారాన్ని సమర్పిస్తే, కింది వాటికి మీరు అంగీకరిస్తున్నారు అని అర్థం:

  • మీ పేమెంట్ సమాచారం నిజమైనది మరియు సరైనది;

  • మీ పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించడానికి మీకు అధికారం ఉంది;

  • పేమెంట్ గడువు తేదీ నాటికి మీరు పెయిడ్ సర్వీస్‌ల కోసం (వర్తింప చేయు విధంగా ఏవైనా పన్నులు, ఫీజులు మరియు ఖర్చులతో సహా) చెల్లిస్తారు;

  • పెయిడ్ సర్వీస్‌ల కోసం చెల్లింపు గడువు వచ్చినప్పుడు, కొనుగోలుకు సంబంధించిన పూర్తి మొత్తాన్ని (పన్నులు, ఫీజులు మరియు ఖర్చులతో సహా ఏవైనా వర్తిస్తే) మీ పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించి వసూలు చేయడానికి మాకు మరియు మా పేమెంట్ భాగస్వాములకు మీరు అనుమతి ఇస్తున్నారు;

  • పెయిడ్ సర్వీస్‌ల కొనుగోలును ప్రాసెస్ చేయడం కోసం మీ పేమెంట్ సమాచారాన్ని మా వద్ద ఉంచుకోవడానికి మరియు మా పేమెంట్ పార్ట్‌నర్‌లతో పంచుకోవడానికి మాకు మీరు అనుమతి ఇస్తున్నారు; మరియు

  • రెన్యూవల్స్, రికరింగ్ ఛార్జీలు, మరియు మీ కొనుగోలును ప్రభావితం చేసే మార్పులకు సంబంధించిన నోటీసులు అలాగే డిస్‌క్లోజర్‌లను మీకు అందించడానికి, మీ పేమెంట్ సమాచారాన్ని (మా పేమెంట్ పార్ట్‌నర్‌లు మాకు అందించిన మీ చెల్లింపు సమాచారంతో సహా) మా వద్ద ఉంచుకోవడాని, దాన్ని ఉపయోగించడానికి మీరు అనుమతి ఇస్తున్నారు.

మా పేమెంట్ పార్ట్‌నర్‌ల ద్వారా మీరు ఏదైనా పెయిడ్ సర్వీస్‌ను కొనుగోలు చేస్తే, ఆ కొనుగోలు వర్తించే పేమెంట్ పార్ట్‌నర్‌ల చట్టపరమైన నిబంధనలు మరియు గోప్యతా విధానాలకు కూడా అదనంగా లోబడి ఉండవచ్చు. మా పేమెంట్ పార్ట్‌నర్‌ల ద్వారా చేసే కొనుగోళ్ల కోసం, మీ బిల్లింగ్ సంబంధం నేరుగా వర్తించే పేమెంట్ పార్ట్‌నర్‌తోనే ఉంటుంది. పెయిడ్ సర్వీస్‌ల కోసం వసూలు చేసే ఏవైనా రుసుములు, ఆ పేమెంట్ భాగస్వామికి మీరు అందించిన పేమెంట్ విధానాన్ని ఉపయోగించి, సదరు పేమెంట్ పార్ట్‌నర్ ద్వారానే బిల్లు విధించబడుతుంది.

1.3 ఫీజులలో మార్పులు

ముఖ్యమైన మార్పులకు సంబంధించిన సరసమైన ముందస్తు నోటీసుతో, పెయిడ్ సర్వీస్‌లకు సంబంధించిన రుసుములు లేదా ప్రయోజనాలను Reddit ఎప్పటికప్పుడు మార్చుతుండవచ్చు. అయితే, పెయిడ్ సర్వీస్‌లకు సంబంధించిన రుసుములలో తాత్కాలిక తగ్గింపులతో సహా, తాత్కాలిక ప్రమోషన్‌ల కోసం ఎటువంటి ముందస్తు నోటీసు అవసరం లేదు.

1.4 థర్డ్ పార్టీ సర్వీస్‌లు

మీరు సర్వీసెస్ (“థర్డ్ పార్టీ పెయిడ్ సర్వీస్‌లు”) ద్వారా థర్డ్-పార్టీ విక్రేతల నుండి సబ్‌స్క్రిప్షన్‌లు లేదా ఇతర డిజిటల్ వస్తువులను కొనుగోలు చేయడానికి అనుమతించబడవచ్చు (దీనిని "థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌లు" అని అంటారు). విక్రేత తరపున మీ నుండి పేమెంట్‌లను స్వీకరించేటప్పుడు, థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌ల ప్రతి విక్రేత కోసం, Reddit చెల్లింపుల సేకరణ ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది. అయితే, సంబంధిత థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌లను వివరించడానికి మరియు వాటిని అందించడానికి ఆయా థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌ల విక్రేతలే బాధ్యత వహిస్తారు. Reddit థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌ల నాణ్యతను నియంత్రించదు; అలాగే వాటిని అందించే విక్రేత గుర్తింపునకు లేదా వారు చేసే ఎలాంటి క్లెయిమ్‌ల ప్రామాణికతకు హామీ ఇవ్వలేదు.

1.5 డిస్కౌంట్లు మరియు కానుకలు

Reddit పెయిడ్ సర్వీస్‌లపై డిస్కౌంట్‌లను అందించవచ్చు, మరియు ప్రతి డిస్కౌంట్‌కు సంబంధించిన నిర్దిష్ట నిబంధనలు ఆ డిస్కౌంట్‌ను అందించే సమయంలోనే పేర్కొనబడతాయి. ఉదాహరణకు, ఎటువంటి రుసుము లేకుండా సబ్‌స్క్రిప్షన్‌ను ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతించే ఏదైనా ట్రయల్ పీరియడ్ ఆఫర్‌లో మీరు పాల్గొంటుంటే, అలాగే ఆ ట్రయల్ పీరియడ్ గడువు ముగిసిన తర్వాత అది పెయిడ్ సబ్‌స్క్రిప్షన్‌గా మారే అవకాశం ఉంటే, పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ కోసం అయ్యే ఛార్జీలను నివారించడానికి మీరు ట్రయల్ పీరియడ్ ముగిసేలోపు ఆ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలి.

రెడ్డిటర్‌ల సర్వీస్‌ల ద్వారా ఇతర రెడ్డిటర్‌లకు నిర్దిష్ట డిజిటల్ వస్తువులను కొనుగోలు చేయడానికి మరియు బహుమతిగా ఇవ్వడానికి అనుమతించబడవచ్చు. ఒక బహుమతిని యాక్సెస్ చేయడానికి లేదా ఉపయోగించడానికి మీ నుండి ఎటువంటి రుసుములు వసూలు చేయబడవు, అయితే కొన్ని నిర్దిష్ట కానుకలను పొందడానికి లేదా ఉపయోగించడానికి మీరు మీ పేమెంట్ సమాచారాన్ని అందించవలసి రావచ్చు.

1.6 రీఫండ్ పాలసీ

సర్వీసెస్ ద్వారా మీరు కొనుగోలు చేసే పెయిడ్ సర్వీస్‌లను వెంటనే యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మీకు అవకాశం ఉంటుంది. దీని ఫలితంగా, చట్టం అనుమతించిన గరిష్ట పరిమితి మేరకు, అన్ని కొనుగోళ్లు అంతిమమైనవి. అలాగే, వీటికి ఎలాంటి రీఫండ్ గానీ లేదా తిప్పి పంపే సదుపాయం గానీ ఉండదు. పాక్షికంగా ఉపయోగించిన బిల్లింగ్ కాల వ్యవధికి సంబంధించి రీఫండ్ లేదా క్రెడిట్ ఇవ్వవలసిన బాధ్యత మాకు లేదు.

మీరు EEA, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే, ఎటువంటి కారణాలు చెప్పకుండా 14 క్యాలెండర్ రోజులలోపు Econ నిబంధనల నుండి వైదొలిగే హక్కు మీకు ఉంది. ఈ Econ నిబంధనలు ముగిసిన తేదీ నుండి ఉపసంహరణ గడువు 14 క్యాలెండర్ రోజులు. మీ ఉపసంహరణ హక్కును వినియోగించుకోవడానికి, మీరు తప్పనిసరిగా Redditకు ఒక  అభ్యర్థన‌ను సమర్పించాలి .

అయితే, కింది వాటిని కలిగి ఉన్న పెయిడ్ సర్వీస్‌లను మీరు కొనుగోలు చేసినప్పుడు మీ ఉపసంహరణ హక్కు కోల్పోతారని దయచేసి గమనించండి: (a) డిజిటల్ వస్తువులను ఉపయోగించడానికి లైసెన్స్; లేదా (b) సబ్‌స్క్రిప్షన్. డిజిటల్ వస్తువు మీ ఖాతాలో జమ అయిన తర్వాత లేదా సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన వెంటనే ఈ పెయిడ్ సర్వీస్‌లు మీకు అందించబడతాయి. మీరు వీటిని కొనుగోలు చేసిన వెంటనే, ఈ పెయిడ్ సర్వీస్‌లు ఈ విధంగా మీకు తక్షణమే అందించబడటానికి మీరు అభ్యర్థిస్తున్నారు మరియు అందుకు సమ్మతిస్తున్నారు.

1.7 పన్నులు మరియు ఫీజులు

అవసరమైనప్పుడు వర్తించే పన్నులను, ఫీజులను Reddit వసూలు చేస్తుంది, అయితే సర్వీసెస్‌ యొక్క మీ వినియోగానికి అలాగే పెయిడ్ సర్వీసెస్ యొక్క మీ యాక్సెస్, కొనుగోలు మరియు వినియోగానికి సంబంధించిన అన్ని రకాల పన్నులను మరియు ఫీజులను చెల్లించాల్సిన బాధ్యత మీదే. ఇందులో లావాదేవీ పన్నులు, డేటా ప్లాన్ ఫీజులు, ఇంటర్నెట్ ఫీజులు మరియు ఇతర ఖర్చులు చేర్చబడ్డాయి

2. సబ్‌స్క్రిప్షన్‌లు

2.1 Reddit Premium

Reddit Premium అనేది ఒక సబ్‌స్క్రిప్షన్ (“Premium”), ఇది మీకు సర్వీస్‌లపై ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు Premiumను కొనుగోలు చేసినప్పుడు, మీరు రికరింగ్ పేమెంట్‌లను అనుమతిస్తున్నారని మరియు ఆ పేమెంట్‌లు, పేమెంట్ సమాచారం ద్వారా అలాగే మీరు అంగీకరించిన పేమెంట్ వ్యవధులలో (ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం), సదరు సబ్‌స్క్రిప్షన్ మీ ద్వారా లేదా Reddit ద్వారా రద్దు చేయబడే వరకు, Redditకు పేమెంట్‌లు చేయబడతాయని మీరు స్పష్టంగా అంగీకరిస్తున్నారు.

మీరు మీ ఖాతా యొక్క  యూజర్ సెట్టింగ్‌లను  యాక్సెస్ చేయడం ద్వారా లేదా మీ మొబైల్ యాప్ ద్వారా (థర్డ్-పార్టీ ద్వారా పొందిన Premium సబ్‌స్క్రిప్షన్‌ల కోసం) మీ Premium సబ్‌స్క్రిప్షన్ మరియు పేమెంట్ సమాచారాన్ని మేనేజ్ చేయవచ్చు. మేము మీ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభమైన తేదీకి అనుగుణంగా ఉండే క్యాలెండర్ రోజున మీ పేమెంట్ సమాచారాన్ని ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేస్తాము. ఒకవేళ మీ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీ, తదుపరి నెలలో లేకుంటే, సదరు నెలలోని చివరి రోజున మీకు బిల్లింగ్ చేయబడుతుంది. మొబైల్ రెన్యూవల్ ప్రాసెస్ చేయబడే తేదీలు ఏవైనా అదనపు థర్డ్-పార్టీ నిబంధనలకు అనుగుణంగా మారవచ్చు.

ఒకవేళ మీ పేమెంట్ సమాచారం తిరస్కరించబడితే, మీరు తప్పనిసరిగా కొత్త పేమెంట్ సమాచారాన్ని అందించాలి, లేనిపక్షంలో మీ Premium సబ్‌స్క్రిప్షన్ రద్దు అవుతుంది. ఒకవేళ మీరు కొత్త పేమెంట్ సమాచారాన్ని అందించి, దాని ద్వారా విజయవంతంగా ఛార్జీ విధించబడితే, మీ కొత్త సబ్‌స్క్రిప్షన్ కాల వ్యవధి అనేది ఒరిజినల్ రెన్యూవల్ తేదీపై ఆధారపడి ఉంటుంది కానీ, విజయవంతంగా ఛార్జీ విధించిన తేదీ ప్రకారం కాదు.

మేము Premium ధరను (ఆటో-రెన్యూవల్‌లో భాగంగా) మార్చవచ్చు, అయితే ఎలాంటి ధర మార్పు మరియు అది అమలులోకి వచ్చే తేదీ గురించి అయినా మీకు ముందస్తు నోటిఫికేషన్‌ను ఇస్తాము. ధర మార్పు అమలులోకి వచ్చిన తేదీ తర్వాత కూడా మీరు Premiumను నిరంతరం ఉపయోగించడం మరియు దానికి సంబంధించిన ప్రయోజనాలను పొందడం అనేది, చట్టం అనుమతించిన గరిష్ట పరిమితి మేరకు మీరు కొత్త ధరను అంగీకరించినట్లుగా పరిగణించబడుతుంది. మీరు తదుపరి సబ్‌స్క్రిప్షన్ కాల వ్యవధి ప్రారంభానికి కనీసం 24 గంటల ముందే మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవడం ద్వారా కూడా ఈ ధర మార్పును నిరాకరించవచ్చు.

మీరు Premiumను ఎప్పుడైనా రద్దు చేసుకోవచ్చు. మీ సబ్‌స్క్రిప్షన్ కాల వ్యవధి ముగియడానికి కనీసం 24 గంటల ముందే మీరు రద్దు చేయకపోతే, మీ సబ్‌స్క్రిప్షన్ (ప్రతి నెలా లేదా సంవత్సరం) ఆటోమేటిక్‌గా రెన్యూ చేయబడుతుంది. మీరు మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవాలనుకుంటే, కింద వివరించిన సూచనలను అనుసరించడం ద్వారా మాకు తెలియజేయాలి; లేనిపక్షంలో మీ సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రెన్యూ అవుతుంది. మీరు రద్దు చేయకపోతే, సబ్‌స్క్రిప్షన్ రెన్యూవల్ తేదీ నాటికి అమల్లో ఉన్న సబ్‌స్క్రిప్షన్ ఫీజు మరియు వర్తించే పన్నులతో సహా, రెన్యూ చేయబడే సబ్‌స్క్రిప్షన్ కోసం మీకు ఛార్జీ విధించడానికి మీ పేమెంట్ సమాచారాన్ని ఉపయోగించే అధికారాన్ని మాకు ఇస్తున్నారు అని అర్థం.

మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయడానికి, మీ ఖాతాలో  యూజర్ సెట్టింగ్‌లలోని సూచనలను అనుసరించండి. మీరు మీ Apple IDని ఉపయోగించి Premiumను కొనుగోలు చేసి ఉంటే, మీ డివైజ్ ఖాతా సెట్టింగ్‌ల ద్వారా లేదా Apple యాప్ స్టోర్‌లోని 'సబ్‌స్క్రిప్షన్‌లను మేనేజ్ చేయండి' విభాగం వెళ్లి మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు. మీరు Google Playను ఉపయోగించి Premiumను కొనుగోలు చేసి ఉంటే, Google Playలోని సబ్‌స్క్రిప్షన్‌ల విభాగాన్ని సందర్శించడం ద్వారా మీ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకోవచ్చు.

మీరు సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసిన సమయం నుండి మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసే వరకు మీ సబ్‌స్క్రిప్షన్ యాక్టివ్‌గానే ఉంటుంది. అయితే, మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధిలో మిగిలి ఉన్న రోజులకు సంబంధించి మీకు ఎలాంటి రీఫండ్ లేదా క్రెడిట్ లభించదు. మీ సబ్‌స్క్రిప్షన్ ముగిసిన తర్వాత, Premiumకు సంబంధించిన అన్ని ఫీచర్‌లకు మీరు యాక్సెస్‌ను కోల్పోతారని మీరు అంగీకరిస్తున్నారు. ఇందులో Premium సభ్యులకు మాత్రమే ప్రత్యేకంగా లభించే పరిమిత కాలానికి లభించే డిజిటల్ వస్తువులను సేవ్ చేయడానికి లేదా స్టోర్ చేయడానికి మీకు వీలు కల్పించే ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

2.2 ప్రివ్యూ ఫీచర్‌లు

Reddit ప్రివ్యూల నిబంధనల కింద ఇతర సబ్‌స్క్రిప్షన్‌లను కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉన్నాయో (ఏవైనా ఉంటే) చూడటానికి, దయచేసి ప్రివ్యూల నిబంధనలు  సమీక్షించండి.

3. డిజిటల్ వస్తువులు

3.1 Reddit అవతార్‌లు

Reddit అవతార్‌లు అనేవి మీరు సర్వీస్‌ల ద్వారా కస్టమైజ్ చేసుకోగల, క్లెయిమ్ చేసుకోగల లేదంటే ఇతరత్రా ఉపయోగించగల డిజిటల్ అవతార్‌లు. ఇవి ఒక రకమైన డిజిటల్ వస్తువు (“అవతార్‌లు”). మీ అవతార్ అనేది మీ ఖాతా యొక్క ప్రొఫైల్ పేజీలో అలాగే సర్వీస్‌ల అంతటా (ఉదాహరణకు: పోస్ట్‌లు, కామెంట్‌లు మరియు చాట్‌లలో) మీ అవతార్ లాగా ప్రదర్శించబడుతుంది.

ప్రతి అవతార్‌కు, దానికి సంబంధించిన నిర్దిష్టమైన మరియు ప్రత్యేకమైన గేర్, యాక్సెసరీలు, అవుట్‌ఫిట్‌లు, హెయిర్‌స్టైల్‌లు, బ్యాక్‌గ్రౌండ్ కార్డ్‌లు మరియు/లేదా ఇతర ఆర్ట్ (“అవతార్ ఆర్ట్”) అనుబంధించబడి ఉంటాయి. అవతార్ ఆర్ట్ లైసెన్స్ ఇవ్వబడినది మాత్రమే, విక్రయించబడినది కాదు. ఈ Econ నిబంధనలలో స్పష్టంగా పేర్కొనని అవతార్ ఆర్ట్ గురించిన అన్ని హక్కులను Reddit మరియు మా లైసెన్సర్లు తమ వద్దే ఉంచుకుంటారు.

ఈ Econ నిబంధనలు మరియు కింది వాటికి మీరు నిరంతరం కట్టుబడి ఉండటానికి లోబడి యూజర్ ఒప్పందం  (సెక్షన్ 3తో సహా), మీ అవతార్‌కు సంబంధించిన అవతార్ ఆర్ట్ మొత్తాన్ని లేదా కొంత భాగాన్ని ఉపయోగించడానికి మరియు ప్రదర్శించడానికి, అలాగే మీ స్వంత వ్యక్తిగత, వాణిజ్యేతర ఉపయోగం కోసం, కేవలం సర్వీస్‌లలో మాత్రమే మరియు మీరు మీ అవతార్‌ను సెట్ చేసిన మీ ఖాతాకు సంబంధించి (దీనిని పరిమిత లైసెన్స్ హక్కులు అంటారు), ఆ అవతార్ ఆర్ట్‌ను Reddit మరియు దాని లైసెన్సర్‌లు సర్వీస్‌ల ద్వారా అందుబాటులో ఉంచిన ఇతర అవతార్ ఆర్ట్‌తో మిక్స్-అండ్-మ్యాచ్ చేయడానికి Reddit మీకు బదిలీ చేయలేని, ప్రత్యేకత లేని, ఉపసంహరించుకోదగిన, పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. మీరు ఈ Econ నిబంధనలను ఉల్లంఘిస్తే, మీరు పరిమిత లైసెన్స్ హక్కులను కోల్పోతారు.

3.2 Reddit గోల్డ్

Reddit గోల్డ్ అనేది మీరు ఈ Econ నిబంధనలకు అనుగుణంగా సర్వీస్‌లలో కొనుగోలు చేయగల, స్వీకరించగల మరియు ఉపయోగించగల ఒక రకమైన డిజిటల్ వస్తువు (“గోల్డ్”). మీరు సర్వీసెస్ ద్వారా గోల్డ్‌ను కొనుగోలు చేసినప్పుడు, ఈ Econ నిబంధనలు మరియు  యూజర్ ఒప్పందానికి  (సెక్షన్ 3తో సహా), మీరు నిరంతరం కట్టుబడి ఉండటానికి లోబడి, కేవలం సర్వీస్‌లలో మాత్రమే మరియు మీరు ఏ ఖాతా ద్వారా గోల్డ్‌ను కొనుగోలు చేశారో ఆ ఖాతాకు సంబంధించి మాత్రమే, దానిని ఉపయోగించడానికి Reddit మీకు బదిలీ చేయలేని, ప్రత్యేకత లేని, ఉపసంహరించుకోదగిన, పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది. మీరు కొన్ని డిజిటల్ వస్తువుల (కింద నిర్వచించిన అవార్డ్‌లతో సహా) లేదా థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీస్‌ల కోసం గోల్డ్‌ను రీడీమ్ చేసుకోవచ్చు. ఈ Econ నిబంధనలు మరియు (వర్తించే విధంగా)  ప్రివ్యూల నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్న వాటి కోసం తప్ప, మరే ఇతర ప్రయోజనం కోసమైనా గోల్డ్‌ను ఉపయోగించడానికి మీరు ప్రయత్నించకూడదు.

3.3 Reddit అవార్డ్‌లు

Reddit అవార్డ్‌లు అనేవి మీరు సర్వీస్‌ల ద్వారా (ఉదా.., గోల్డ్ ఖర్చు చేయడం ద్వారా లేదా ప్రమోషన్ సమయంలో) పొందగల ఒక రకమైన డిజిటల్ వస్తువు, ఇంకా సర్వీస్‌లలో ఇతర రెడ్డిటర్‌లు అందించిన సహకారాలను (ఉదా.. , పోస్ట్‌లు, కామెంట్లు) గుర్తించడానికి మరియు వాటికి స్పందించడానికి మీరు వారికి వీటిని ఇవ్వవచ్చు (“అవార్డ్‌లు”). మీరు సర్వీసెస్ ద్వారా ఒక అవార్డ్‌ను ఇచ్చినప్పుడు, ఈ Econ నిబంధనలు మరియు  యూజర్ ఒప్పందా నికి  (సెక్షన్ 3తో సహా) మీరు నిరంతరం కట్టుబడి ఉండటానికి లోబడి, కేవలం సర్వీస్‌లలో మాత్రమే, ఇంక మీరు ఏ ఖాతా ద్వారా ఆ అవార్డ్‌ను కొనుగోలు చేశారో ఆ ఖాతాకు సంబంధించి మాత్రమే, ఆ అవార్డ్‌ను ఉపయోగించడానికి అలాగే ఇతర రెడ్డిటర్‌లకు బహుమతిగా ఇవ్వడానికి Reddit మీకు బదిలీ చేయలేని, ప్రత్యేకత లేని, ఉపసంహరించుకోదగిన, పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది.

అవార్డ్‌లను (ఇతర రెడ్డిటర్‌ల నుండి) అందుకునేవారు నిర్దిష్ట Reddit ప్రోగ్రామ్‌లలో ( ప్రివ్యూల నిబంధనలలో నిర్వచించిన విధంగా) పాల్గొనడానికి అర్హులు కావచ్చు మరియు వర్తించే Reddit ప్రోగ్రామ్ నిబంధనల ప్రకారం ( ప్రివ్యూల నిబంధనలలో నిర్వచించిన విధంగా) సర్వీస్‌లలో వారి సహకారం ఆధారంగా గోల్డ్‌ను మరియు/లేదా డబ్బును సంపాదించవచ్చు. అయితే, అవార్డ్‌లను అందుకునే వారందరూ Reddit ప్రోగ్రామ్‌లలో పాల్గొనడానికి మరియు ఆర్థిక ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు కాకపోవచ్చు. ఫలితంగా, అవార్డ్‌లు కానీ లేదా గోల్డ్ కానీ అందుకునే వారికి పరిహారం లేదా ఆర్థిక సహాయం అందించడానికి ఒక హామీ ఇవ్వబడిన మార్గంగా ఉపయోగించడానికి ఉద్దేశించినవి కావు.

3.4 బహుమతులు చివరివి మరియు మార్చబడవు

ఇతర యూజర్‌లకు అందించిన డిజిటల్ వస్తువులు తిరిగి ఇవ్వబడవు (ఉదాహరణకు, మీరు మరొక యూజర్‌కు అవార్డ్‌లను కానుకగా ఇవ్వడానికి గోల్డ్‌ను ఉపయోగించినట్లయితే, మీరు ఆ అవార్డ్‌లను తిరిగి తీసుకోలేరు లేదా ఖర్చు చేసిన గోల్డ్‌ను తిరిగి పొందలేరు).

3.5 ప్రివ్యూ ఫీచర్‌లు

 ప్రివ్యూల నిబంధనల కింద Reddit ఇతర డిజిటల్ వస్తువులను అందుబాటులోకి తీసుకురావచ్చు. ప్రస్తుతం అందుబాటులో (ఏవైనా) ఇతర డిజిటల్ వస్తువులు ఉన్నాయో లేదో చూడటానికి ప్రివ్యూల నిబంధనలు  సమీక్షించండి.

4. థర్డ్-పార్టీ హక్కులు

ఈ Econ నిబంధనలు లేదా (వర్తిస్తే)ప్రివ్యూల నిబంధనలలో స్పష్టంగా పేర్కొనబడినవి మినహా, డిజిటల్ వస్తువులపై (వాటికి సంబంధించిన ఏదైనా అవతార్ ఆర్ట్, మెటీరియల్స్ లేదా ఇతర కళాఖండాలతో (వీటన్నింటినీ కలిపి “డిజిటల్ వస్తువు ఆర్ట్” అంటారు) సహా)  యూజర్‌లకు ఎటువంటి ఆస్తి, యాజమాన్య, మేధో సంపత్తి, హక్కు లేదా ద్రవ్యపరమైన ప్రయోజనాలు ఉండవు.

కొన్ని డిజిటల్ వస్తువులు Reddit మరియు థర్డ్-పార్టీ లైసెన్సర్‌ల మధ్య కుదిరిన భాగస్వామ్యాలు కావచ్చు. మీ డిజిటల్ వస్తువుకు సంబంధించిన ఏదైనా డిజిటల్ వస్తువు ఆర్ట్‌లో థర్డ్-పార్టీ మేధో సంపత్తి హక్కులు (ఉదాహరణకు, ఒక క్రియేటర్ లేదా భాగస్వామి నుండి లైసెన్స్ పొందిన మేధో సంపత్తి హక్కులు) (“థర్డ్-పార్టీ హక్కులు ”) ఉన్నట్లయితే, కింది వాటికి మీరు అంగీకరిస్తున్నారని మరియు అర్థం చేసుకుంటున్నారు:

  • డిజిటల్ వస్తువు ఆర్ట్‌లో చేర్చబడిన విధంగా, మరియు ఈ Econ నిబంధనలు లేదా (వర్తించేటట్లయితే) మా ప్రివ్యూల నిబంధనలలో పేర్కొన్న లైసెన్స్ మరియు పరిమితులకు లోబడి తప్ప, మరే ఇతర రూపంలోనూ ఎటువంటి థర్డ్-పార్టీ హక్కులను ఉపయోగించడానికి వీలు లేదు;

  • థర్డ్-పార్టీ హక్కుల యజమాని మంజూరు చేసిన లైసెన్స్ స్వభావాన్ని బట్టి, డిజిటల్ వస్తువు ఆర్ట్‌ను మీరు ఉపయోగించే సామర్థ్యంపై అదనపు పరిమితులను వర్తింపజేయాల్సిన అవసరం Redditకు రావచ్చు; మరియు

  • థర్డ్-పార్టీ హక్కుల కారణంగా డిజిటల్ వస్తువు ఆర్ట్ వినియోగానికి అదనపు పరిమితులు వర్తిస్తాయని Reddit మీకు నోటిఫై చేస్తే, మీరు ఆ తప్పనిసరిగా ఆ పరిమితులను పాటించాలి.

ఒకవేళ డిజిటల్ వస్తువు ఆర్ట్ ఉల్లంఘన క్లెయిమ్‌గా మారితే (లేదా మారే అవకాశం ఉందని Reddit నిర్ధారిస్తే), సదరు డిజిటల్ వస్తువు ఆర్ట్‌ను భర్తీ చేయడానికి, దానిని ఉపయోగించడం కొనసాగించే హక్కును పొందడానికి, లేదా డిజిటల్ వస్తువు ఆర్ట్‌కు సంబంధించిన మీ లైసెన్స్ హక్కులను (వర్తించే పక్షంలో, అవతార్ ఆర్ట్‌కు సంబంధించిన మీ లైసెన్స్ హక్కులతో సహా) రద్దు చేయడానికి Redditకు పూర్తి హక్కు ఉంటుంది.

5. ఖాతా తాత్కాలిక నిలిపివేత లేదా రద్దు

 యూజర్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా  మరియు మా Reddit నిబంధనల ప్రకారం, మీరు మా సర్వీస్‌ల నిబంధనలను అలాగే మీరు పాల్గొనే వ్యక్తిగత కమ్యూనిటీల నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అలా చేయడంలో విఫలమైతే ఈ Econ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది మరియు సర్వీస్‌ల నుండి లేదా కొన్ని కమ్యూనిటీల నుండి తాత్కాలిక లేదా శాశ్వత నిషేధానికి దారితీయవచ్చు లేదా పెయిడ్ సర్వీస్‌లలోని కొన్ని అంశాలకు లేదా ప్రయోజనాలకు మీకు యాక్సెస్ ఉండే కమ్యూనిటీలతో సహా మీ పోస్ట్‌లు మరియు వ్యాఖ్యలను తొలగించడం జరుగుతుంది. అటువంటి సందర్భాలలో, మీరు పెయిడ్ సర్వీస్‌ల ప్రయోజనాలను కోల్పోవచ్చు మరియు ఈ నష్టానికి మేము మీకు పరిహారం చెల్లించబోము.

6. మీ అంగీకారాలు

సర్వీసెస్ ద్వారా అందుబాటులో ఉంచబడిన ఏదైనా సబ్‌స్క్రిప్షన్, డిజిటల్ వస్తువు లేదా ఇతర పెయిడ్ సర్వీస్‌ల (వీటన్నింటినీ కలిపి ఉమ్మడిగా" Reddit Econ వస్తువులు" అంటారు)కు మీ యాక్సెస్, కొనుగోలు లేదా వినియోగానికి సంబంధించి — మీరు కింది వాటిని తెలియజేస్తూ, హామీ ఇస్తూ, అంగీకరిస్తూ ఒప్పుకుంటున్నారు:

  • మీరు Reddit మరియు కమ్యూనిటీ నియమాలకు కట్టుబడి ఉంటారు – మా  యూజర్ ఒప్పందం,Reddit నియమాలు, మరియు ఈ Econ నిబంధనలలో పేర్కొన్న సర్వీసెస్ కోసం మా నియమాలను అలాగే మీరు పాల్గొనే వ్యక్తిగత కమ్యూనిటీల నియమాలను మీరు అనుసరిస్తారు మరియు వాటికి కట్టుబడి ఉంటారు;

  • Reddit Econ వస్తువులు అనేవి డబ్బు లేదా చట్టబద్ధమైన కరెన్సీ కాదు – ఏ Reddit Econ వస్తువు కూడా డబ్బు లేదా చట్టబద్ధమైన కరెన్సీ కాదు, దానికి ఎటువంటి ద్రవ్య విలువ లేదా నగదు సమానత్వం ఉండదు, అలాగే అది నగదు లేదా డిపాజిట్ ఖాతా కాదు. Reddit అనుమతి లేకుండా సర్వీసెస్‌కు వెలుపల ఎలాంటి రియల్ వరల్డ్ మనీకి, ద్రవ్య విలువకు లేదా ఇతర వస్తువులు లేదా సర్వీస్‌లకు దానిని మార్చుకునే సదుపాయం ఉండదు, మరియు అది ఏ రకమైన కరెన్సీ లేదా ఆస్తి కిందకు రాదు;

  • మీరు చాలా వరకు Reddit Econ వస్తువులను బదిలీ చేయడం లేదా విక్రయించడం కుదరదు – ఈ Econ నిబంధనలు లేదా (వర్తిస్తే)  ప్రివ్యూల నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్న పరిమిత మినహాయింపులతో తప్ప, మీ Reddit Econ వస్తువులు (మీ పరిమితమైన లైసెన్స్ పొందిన హక్కులతో సహా) మా అనుమతి లేకుండా సర్వీసెస్‌కు లేదా మీ ఖాతాకు వెలుపల విక్రయించడం, ట్రేడ్ చేయడం, బార్టర్ చేయడం, బదిలీ చేయడం, మార్పిడి చేయడం, విక్రయానికి ఉంచడం లేదా మరే ఇతర రూపంలోనైనా ఉపయోగించడం సాధ్యపడదు;

  • Reddit Econ వస్తువులపై మీ హక్కులు పరిమితమైనవి – ఈ Econ నిబంధనలలో స్పష్టంగా పేర్కొన్న పరిమిత మినహాయింపులతో తప్ప, Reddit Econ వస్తువుల మార్పిడి కోసం మీరు అందించిన లేదా చెల్లించిన ఎటువంటి ప్రతిఫలంతో సంబంధం లేకుండా, వాటిపై మీకు ఎలాంటి యాజమాన్య, ప్రొప్రైటరీ, మేధో సంపత్తి హక్కు, టైటిల్ లేదా ఇతర ద్రవ్య రూప హక్కులు ఉండవు కానీ బదులుగా, ఈ Econ నిబంధనల ప్రకారం Reddit Econ వస్తువులను యాక్సెస్ చేయడానికి మరియు ఉపయోగించడానికి మీకు ఒక లైసెన్స్ మాత్రమే అందించబడుతుంది;

  • మీరు ఏ Reddit Econ Goodను వాణిజ్యపరంగా ఉపయోగించకూడదు  – మా అనుమతి లేకుండా మరియు వర్తించే విధంగా ఏ ఇతర థర్డ్-పార్టీ హక్కుల హోల్డర్ అనుమతి లేకుండా, మీరు ఏ Reddit Econ వస్తువుకు (ఏదైనా డిజిటల్ వస్తువు ఆర్ట్‌తో సహా) లైసెన్స్ ఇవ్వడం, సబ్‌లైసెన్స్ ఇవ్వడం, విక్రయించడం, తిరిగి విక్రయించడం, బదిలీ చేయడం, కేటాయించడం, పంపిణీ చేయడం లేదా మరే ఇతర రూపంలోనైనా వాణిజ్యపరంగా ఉపయోగించడం లేదా ఏ థర్డ్-పార్టీకైనా అందుబాటులో ఉంచడం (ట్రేడ్‌మార్క్ లేదా బ్రాండ్‌గా లేదా ఉత్పన్నమైన రచన లేదా సృష్టి‌గా) చేయకూడదు; ఏ Reddit Econ వస్తువులోనూ ఎలాంటి ట్రేడ్‌మార్క్, కాపీరైట్ లేదా ఇతర మేధో సంపత్తి హక్కులను నమోదు చేయడానికి లేదా అలాంటి ప్రయత్నానికి వీల్లేదు; ఏ Reddit Econ వస్తువును మార్కెటింగ్ చేయడం లేదా విక్రయించడం చేయకూడదు, అలాగే మీ వస్తువులు లేదా సర్వీస్‌లను లేదా ఏ ఇతర థర్డ్-పార్టీ వస్తువులు లేదా సర్వీస్‌లను మార్కెటింగ్ చేయడానికి లేదా విక్రయించడానికి ఏ Reddit Econ వస్తువును ఉపయోగించకూడదు; Reddit లేదా ఏ ఇతర థర్డ్-పార్టీ హక్కుల హోల్డర్ల నుండి ఎలాంటి ట్రేడ్‌మార్క్‌లు, స్పెసిఫికేషన్‌లు, వారెంటీలు, లేదా డిస్‌క్లెయిమర్‌లను లేదా ఏదైనా మేధో సంపత్తి లేదా ప్రొప్రైటరీ నోటీసులను తొలగించడం, తీసివేయడం, మార్చడం లేదా దాచడం చేయకూడదు; మరియు Reddit పేరు, ట్రేడ్‌మార్క్‌లు లేదా లోగోలను ఉపయోగించడంతో సహా, మీరు ఏ విధంగానైనా Reddit ద్వారా ఆమోదించబడ్డారని లేదా దానితో అనుబంధించబడ్డారని పేర్కొనరు లేదా సూచించరు;

  • మీరు Reddit విధించిన ఎలాంటి పరిమితులు లేదా భద్రతా చర్యలను దాటవేయకూడదు – మీరు Reddit Econ వస్తువులు లేదా పెయిడ్ సర్వీస్‌ల యొక్క మరే ఇతర అంశానికైనా అంతరాయం కలిగించడం, జోక్యం చేసుకోవడం, భద్రతను ఉల్లంఘించడం లేదా అనధికారిక యాక్సెస్ పొందడానికి ప్రయత్నించడం (ఏదైనా పరికరం, సాఫ్ట్‌వేర్ లేదా రోటీన్‌ను ఉపయోగించడంతో సహా) చేయకూడదు; అలాగే మా అనుమతి లేకుండా మా ద్వారా నిర్దేశించబడిన ఏదైనా క్లెయిమ్‌ను, కొనుగోలును, అర్హతను, బదిలీని, రేటును, మార్పిడిని, భద్రత లేదా ఇతర పరిమితులను ఉల్లంఘిస్తూ లేదా ఈ Econ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏ Reddit Econ వస్తువును పొందడం లేదా విక్రయించడం చేయకూడదు (మా సర్వీసెస్‌ను ఏ రకంగానైనా దెబ్బతీసే, నాశనం చేసే, అంతరాయం కలిగించే, నిలిపివేసే, బలహీనపరిచే, అధిక భారం లేదా మరేదైనా పద్ధతిలో హాని కలిగించేలా చేయడంతో సహా); అలాగే సర్వీసెస్ మరియు Reddit Econ వస్తువులను రక్షించడానికి అమలు చేయబడిన ఎలాంటి భద్రతా పరికరాన్ని, రక్షణను లేదా సాంకేతిక చర్యను బైపాస్ చేయడం, ఉల్లంఘించడం, నివారించడం, తొలగించడం, డీయాక్టివేట్ చేయడం, బలహీనపరచడం, డీస్క్రాంబుల్ చేయడం లేదా మరే ఇతర రూపంలోనైనా దాటవేయడం చేయకూడదు. రెడ్డిటర్లకు సర్వీసెస్ ఆనందదాయకంగా ఉండేలా చేయడానికి మరియు బోట్‌లు, రోబోట్‌లు, పార్సర్‌లు, స్పైడర్‌లు, స్క్రిప్ట్‌లు, ప్రోగ్రామ్‌లు, రొటీన్‌లు, స్పామ్ మరియు ఇతర ఆటోమేషన్ రూపాలతో పాటు మోసాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు మరియు మా యూజర్ ఒప్పందం,Reddit నియమాలు  మరియు ఈ Econ నిబంధనల యొక్క ఇతర ఉల్లంఘనలను నిరోధించడానికి Reddit ఈ పరిమితులను, నిబంధనలను నిర్దేశిస్తుందని మీరు అర్థం చేసుకున్నారు;

  • మీరు Reddit Econ వస్తువులు లేదా సర్వీస్‌ల నుండి డేటాను సేకరించకూడదు – మా ముందస్తు అనుమతి లేకుండా, మీరు Reddit Econ వస్తువులు లేదా సర్వీస్‌లకు సంబంధించిన ఏ విధమైన డేటా, టెక్స్ట్, రిపోర్ట్‌లు లేదా ఇతర మెటీరియల్స్‌ను (వెబ్ స్క్రాపింగ్, వెబ్ హార్వెస్టింగ్ లేదా ఇతర డేటా వెలికితీత పద్ధతుల ద్వారా కావచ్చు) (పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ) సేకరించడం, కాపీ చేయడం, నకలు చేయడం, డౌన్‌లోడ్ చేయడం, క్యాష్ చేయడం, ప్రచురించడం, ప్రసారం చేయడం, పునరుత్పత్తి చేయడం, బదిలీ చేయడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం, వ్యాప్తి చేయడం, సమగ్రపరచడం లేదా ఇతర రూపాల్లో ఉపయోగించకూడదు;

  • మీరు చట్టానికి కట్టుబడి ఉంటారు మరియు విచక్షణను ఉపయోగిస్తారు – మోసపూరితంగా పొందిన, దొంగిలించబడిన, అనుమతి లేకుండా తీసుకోబడిన లేదా చట్టవిరుద్ధంగా పొందిన ఏ Reddit Econ వస్తువులనైనా పొందడానికి లేదా విక్రయించడానికి మీరు సర్వీసెస్‌ను ఉపయోగించకూడదు లేదా ఉపయోగించడానికి ప్రయత్నించకూడదు; ఏ రకమైన చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం (మార్కెట్ తారుమారు చేయడం, మనీలాండరింగ్, మోసం లేదా మరేదైనా నేరంతో సహా) సర్వీసెస్‌కు లోపల గానీ లేదా వెలుపల గానీ ఏ Reddit Econ వస్తువును ఉపయోగించకూడదు;  నిషేధించబడిన వస్తువులు లేదా సర్వీస్‌లకు వ్యతిరేకంగా నిర్దేశించిన Reddit యొక్క పాలసీలకు విరుద్ధంగా ఉండే వస్తువులు లేదా సర్వీస్‌లకు సంబంధించిన ఎలాంటి లావాదేవీలలోనూ పాల్గొనకూడదు, జూదం లేదా బెట్టింగ్‌లకు ఉపయోగించకూడదు; మరియు మీ Reddit Econ వస్తువు కొనుగోలు, బదిలీ లేదా విక్రయం నుండి ఉత్పన్నమయ్యే పన్ను బాధ్యతలతో సహా వర్తించే అన్ని చట్టాలకు మీరు కట్టుబడి ఉంటారు; అలాగే

  • మీరు ఈ Econ నిబంధనలను, ఉల్లంఘించేలా  మరెవరినీ ప్రోత్సహించకూడదు – పైన పేర్కొన్న లేదా ఈ Econ నిబంధనలలోని ఇతర ప్రాతినిధ్యాలను, వారెంటీలను, అంగీకారాలు మరియు ఒప్పందాలను ఉల్లంఘించేలా ఏ థర్డ్ పార్టీని అయినా మీరు ప్రేరేపించకూడదు లేదా ప్రేరేపించడానికి ప్రయత్నించకూడదు.

పైన పేర్కొన్న నిబంధనలను అనుసరించడంలో మరియు వాటికి కట్టుబడి ఉండటంలో విఫలమైతే, అది ఈ Econ నిబంధనల ఉల్లంఘనగా పరిగణించబడవచ్చు. దీని ఫలితంగా Reddit లేదా కొన్ని నిర్దిష్ట కమ్యూనిటీల నుండి తాత్కాలిక లేదా శాశ్వత నిషేధానికి దారితీయవచ్చు లేదా Reddit Econ వస్తువులకు సంబంధించి, మీకున్న యాక్సెస్ తొలగించబడవచ్చు. అటువంటి సందర్భాలలో, మీరు Reddit Econ వస్తువుల ప్రయోజనాలను కోల్పోవచ్చు మరియు ఈ నష్టానికి మేము మీకు ఎలాంటి పరిహారం చెల్లించబోము.

7. మీరు ఈ రిస్కులను స్వీకరిస్తున్నారు

ఏదైనా Reddit Econ వస్తువును మీరు యాక్సెస్ చేయడం, కొనుగోలు చేయడం మరియు ఉపయోగించడంతో సంబంధించి, కింది రిస్క్‌లను మీరు అంగీకరిస్తున్నారని, వాటికి బాధ్యత వహిస్తారని, అలాగే వీటి ఫలితంగా లేదా వీటి నుండి ఉత్పన్నమయ్యే సమస్య నుండి Redditకు రక్షణ కల్పిస్తారని అంగీకరిస్తున్నారు:

  • మీ ఖాతా యాక్సెస్‌ను కోల్పోవడం – మీరు ఈ Econ నిబంధనలను ఉల్లంఘిస్తారని లేదా ఉల్లంఘించారని మేము అనుమానిస్తే (ఉదాహరణకు, ఏదైనా చట్టవిరుద్ధమైన ప్రయోజనం కోసం, సర్వీస్‌ల లోపల లేదా వెలుపల ఏదైనా Reddit Econ వస్తువును ఉపయోగించడం వంటివి), Reddit మీకు ఎలాంటి రీఫండ్ చేయకుండా లేదా మీ నష్టానికి ఎలాంటి పరిహారం అందించకుండానే సర్వీస్‌లను పరిమితం చేయవచ్చు, నిలిపివేయవచ్చు లేదా మార్చవచ్చు, అలాగే మీ ఖాతాను సస్పెండ్ చేయవచ్చు మరియు/లేదా పూర్తిగా రద్దు చేయవచ్చు మీ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడినా లేదా రద్దు చేయబడినా, మీరు సర్వీసెస్‌లో మీ Reddit Econ వస్తువులను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోవచ్చు లేదా వాటిని ఉపయోగించలేకపోవచ్చు;

  • రెడ్డిటర్‌లతో సమస్యలు – Reddit కేవలం థర్డ్-పార్టీ పెయిడ్ సర్వీసెస్ విక్రయాలను మాత్రమే సులభతరం చేస్తుంది. ఇది ఎలాంటి మార్కెట్‌ప్లేస్‌ను నిర్వహించదు; అలాగే Reddit Econ వస్తువులు లేదా ఇతర వస్తువులు లేదా సర్వీస్‌ల కోసం మీకు, ఇతర రెడ్డిటర్‌లకు లేదా థర్డ్-పార్టీలకు మధ్య జరిగే ఎలాంటి లావాదేవీలను ప్రోత్సహించదు. మీకు, ఇంకా రెడ్డిటర్‌లకు లేదా థర్డ్-పార్టీలకు మధ్య జరిగే ఎలాంటి లావాదేవీలకైనా (ఆవాదేవీలకు సంబంధించిన వివాదాలతో సహా), మీ అవతలి వ్యక్తి గుర్తింపును ధృవీకరించడానికైనా, మీ లావాదేవీ కారణానికైనా, లేదా ఆ లావాదేవీ పట్ల మీకు లేదా అవతలి వ్యక్తికి కలిగే సంతృప్తికైనా Reddit ఎలాంటి వాగ్దానాలు లేదా హామీలు ఇవ్వదు మరియు దానికి బాధ్యత వహించదు. (మీరు పూర్తిగా మీ స్వంత రిస్క్‌పైనే ఈ లావాదేవీలలో పాల్గొంటారు).

  • మార్కెట్‌ప్లేస్‌లతో సమస్యలు – Reddit Econ వస్తువులను విక్రయించడానికి, బదిలీ చేయడానికి లేదా ఇతరత్రా ఉపయోగించడానికి థర్డ్-పార్టీలను అనుమతించే ఎలాంటి థర్డ్-పార్టీ మార్కెట్‌ప్లేస్‌లను లేదా సర్వీస్‌లను Reddit గుర్తించదు, మరియు వాటికి బాధ్యత వహించదు అలాంటి మార్కెట్‌ప్లేస్‌లను లేదా సర్వీస్‌లను మీరు అనధికారికంగా ఉపయోగించడం ఈ Econ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది

  • Reddit Econ వస్తువులలో మార్పులు – మీకు ఎలాంటి రీఫండ్ చేయకుండా లేదా మీ నష్టానికి ఎలాంటి పరిహారం అందించకుండానే, Reddit తన స్వంత విచక్షణతో Reddit Econ వస్తువులలో మార్పులు చేయవచ్చు. ఈ మార్పులు Reddit Econ వస్తువుల విలువ లేదా ప్రయోజనాన్ని, లేదా కొన్ని నిర్దిష్ట Reddit Econ వస్తువులను పొందే సామర్థ్యాన్ని ప్రభావితం చేసినప్పటికీ, అవి కొన్ని లేదా అన్ని Reddit Econ వస్తువులను ఎక్కువ లేదా తక్కువ సాధారణమైనవిగా, ఆకర్షణీయమైనవిగా, ప్రభావవంతమైనవిగా లేదా పనిచేసేవిగా మార్చవచ్చు. (ఉదాహరణకు, కొన్ని వస్తువులను ఉపయోగించడానికి అవసరమైన ఇతర Reddit Econ వస్తువుల సంఖ్యను పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు, అలాగే ఏదైనా Reddit Econ వస్తువును రీడీమ్ చేసుకోవడంపై ఎప్పుడైనా పరిమితులను విధించవచ్చు). Reddit Econ వస్తువులు ఏదైనా నిర్దిష్ట కాలం పాటు నిరంతరం అందుబాటులో ఉంటాయని Reddit హామీ ఇవ్వదు. చట్టం అనుమతించిన గరిష్ఠ పరిమితి వరకు, ముందస్తు నోటీసు లేదా మీ పట్ల ఎలాంటి బాధ్యత లేకుండా, తన స్వంత విచక్షణతో, ఏ కారణం చేతనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానే ఏవైనా Reddit Econ వస్తువుల నియంత్రణ, మార్పు, సస్పెండ్, తొలగింపు, రద్దు లేదా వాటి సపోర్ట్‌ను నిలిపివేసే హక్కును Reddit కలిగి ఉంటుంది. కాబట్టి, ఏవైనా Reddit Econ వస్తువులను కూడబెట్టుకోవడంలో, సర్వీస్‌లలో వాటి నిరంతర లభ్యతపై లేదా వాటి నాణ్యత లేదా విలువ భవిష్యత్తులో పెరుగుతుందని లేదా అలాగే ఉంటుందని మీరు ఆధారపడలేరని అర్థం చేసుకున్నారు.

Reddit Econ వస్తువులను మీరు యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి మరియు కొనుగోలు చేయడానికి పైన పేర్కొన్న రిస్క్‌లను మీరు అంగీకరించడం ఒక నిబంధన అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ రిస్క్‌లను భరించడానికి మీరు అంగీకరించకపోతే, ఏదైనా Reddit Econ వస్తువును యాక్సెస్ చేయడానికి, కొనుగోలు చేయడానికి లేదా ఉపయోగించడానికి మీకు మా అనుమతి ఉండదు.

8. ఇతర నిబంధనలు

మా యూజర్ ఒప్పందం  ఈ రెఫరెన్స్ ద్వారా ఈ Econ నిబంధనలలో చేర్చబడింది మరియు అందులో భాగం చేయబడింది, అలాగే యూజర్ ఒప్పందం యొక్క ఏవైనా నిబంధనలు ఈ Econ నిబంధనలతో విభేదిస్తే, Reddit Econ వస్తువులను మీరు యాక్సెస్ చేయడం, కొనుగోలు చేయడం మరియు ఉపయోగించడంతో సంబంధించి ఈ Econ నిబంధనలే వర్తిస్తాయి.

⌂ 换网址