Reddit యూజర్ ఒప్పందం

Reddit యూజర్ ఒప్పందం

జూలై 1, 2026 నుండి అమల్లోకి వస్తుంది. చివరిగా సవరించిన తేదీ మే 26, 2026

 

Reddit లక్షలాది విభిన్న ఆన్‌లైన్ కమ్యూనిటీలు పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ యూజర్ ఒప్పందం, మీరు ప్రవర్తించే తీరు వల్లే ఇది సాధ్యమవుతోంది.

  • మీరు యునైటెడ్ స్టేట్స్‌లో లేదా యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (“EEA”), యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్ వెలుపల నివసిస్తుంటే, మీకు వర్తించే నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.

  • మీరు EEA, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే, మీకు వర్తించే నిబంధనలు ఇక్కడ ఉన్నాయి.


 

మీరు యునైటెడ్ స్టేట్స్‌లో లేదా EEA, యునైటెడ్ కింగ్‌డమ్, స్విట్జర్లాండ్ వెలుపల నివసిస్తుంటే వర్తించే Reddit యూజర్ ఒప్పందం

రెడ్డిటర్‌లకు, ఇంటర్నెట్ లోకానికి నమస్కారం! ఈ Reddit యూజర్ ఒప్పందం ("నిబంధనలు"), Reddit, Inc. ("Reddit," "మేము," "మమ్మల్ని," లేదా "మా") అందించే వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, విడ్జెట్‌లు, APIలు, ఇమెయిల్‌లు, అలాగే ఇతర ఆన్‌లైన్ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను (సమిష్టిగా, "సర్వీస్‌లు") మీరు యాక్సెస్ చేసేటప్పుడు, ఉపయోగించేటప్పుడు వర్తిస్తుంది.

Reddit మీరు సరదాగా గడపాలని, అలాగే మీకు వినోదం అందించాలనే ఉద్దేశంతో డెవలప్ చేసిన ప్లాట్‌ఫామ్ అని గుర్తుంచుకోండి, అయినా కానీ ఇక్కడ కొన్ని ప్రాథమిక నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. మా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం ద్వారా లేదా ఉపయోగించడం ద్వారా, మీరు ఈ నిబంధనలకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు. మీరు ఈ నిబంధనలకు అంగీకరించకపోతే, మా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం కానీ, ఉపయోగించడం కానీ మీరు చేయలేరు

1. సర్వీస్‌లకు మీ యాక్సెస్

13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారందరికీ సర్వీస్‌లను ఉపయోగించడానికి లేదా యాక్సెస్ చేయడానికి అనుమతి ఉండదు. మా సర్వీస్‌లలోని కొన్నింటిని ఉపయోగించడానికి మీరు అంతకన్నా పెద్దవారై ఉండాలి. ఉదాహరణకు, Redditలో పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్‌ను వీక్షించడానికి మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు సర్వీస్‌లను యాక్సెస్ చేసేటప్పుడు దయచేసి అన్ని నోటీసులను, ఏవైనా అదనపు నిబంధనలను శ్రద్ధగా చదవండి.

సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా మీరు వీటిని ధృవీకరిస్తున్నారు:

  • మా సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి మీకు కనీసం 13 ఏళ్ల వయస్సు ఉందని, అలాగే మీరు ఉంటున్న దేశ చట్టాల ప్రకారం ఎంత వయస్సు కావాలో అంతకంటే ఎక్కువ వయస్సు ఉందని;
  • Redditతో చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అర్హత మీకు ఉందని, లేదా ఒకవేళ మీకు వయస్సు 13 ఏళ్లు నిండి ఉండి, మీరు ఉంటున్న ప్రాంతంలోని చట్టాల ప్రకారం ఇంకా మేజర్ కాకపోతే, మీ లీగల్ గార్డియన్ ఈ నిబంధనలను సమీక్షించి అంగీకరించారని;
  • వర్తించే చట్టాలన్నింటి ప్రకారం మా సర్వీస్‌లను ఉపయోగించకుండా మీపై ఎలాంటి నిషేధమూ లేదని; ఇంకా
  • మా సర్వీస్‌లను ఉపయోగించకుండా మిమ్మల్ని ఎప్పుడూ శాశ్వతంగా సస్పెండ్ చేయడం కానీ, తొలగించడం గానీ జరగలేదు అని.

ఒక బిజినెస్ లేదా ప్రభుత్వరంగ సంస్థతో సహా మరొక చట్టపరమైన సంస్థ తరఫున మీరు ఈ నిబంధనలను అంగీకరిస్తున్నట్లయితే, అటువంటి సంస్థను ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి మీకు చట్టపరంగా పూర్తి అధికారం ఉందని మీరు హామీ ఇస్తున్నారు.

2. గోప్యత

మీరు మా సర్వీస్‌లను యాక్సెస్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, మేము మీ గురించిన సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం, షేర్ చేయడం వంటివి ఎలా చేస్తాము, ఎందుకు చేస్తామో Reddit గోప్యతా విధానం వివరిస్తుంది. మీరు ఈ సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా ఈ సమాచారాన్ని సేకరించడానికి, ఉపయోగించడానికి సమ్మతిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారు.

3. సర్వీస్‌లకు సంబంధించి మీ వినియోగం

ఈ నిబంధనలకు మీరు పూర్తిగా, అలాగే నిరంతరం కట్టుబడి ఉన్నంత వరకు, Reddit వీటికి మీకు వ్యక్తిగత, బదిలీ చేయలేని, ప్రత్యేకమైనది కానీ, రద్దు చేయగల, పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది: (ఎ) మీకు చెందిన లేదా మీ నియంత్రణలో ఉన్న మొబైల్ పరికరంలో, ఒక అధికారిక మార్కెట్‌ప్లేస్ నుండి పొందిన మా మొబైల్ అప్లికేషన్ కాపీని (సర్వీస్‌లకు సంబంధించినది) ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి; ఇంకా (బి) సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి. ఈ నిబంధనల ద్వారా మీకు స్పష్టంగా ఇవ్వని హక్కులన్నీ మా దగ్గరే ఉంటాయి.

వర్తించే చట్టం అనుమతించే సందర్భాల్లో తప్ప, మా రాతపూర్వక ఒప్పందం లేకుండా మీరు ఈ కింది పనులు చేయకూడదు:

  • సర్వీస్‌లను కానీ, కంటెంట్‌ను కానీ లైసెన్స్‌కు ఇవ్వడం, అమ్మడం, బదిలీ చేయడం, కేటాయించడం, పంపిణీ చేయడం, హోస్ట్ చేయడం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం;
  • సర్వీస్‌లు లేదా కంటెంట్‌లోని ఏ భాగాన్నైనా మార్చడం, వాటి ఆధారంగా కొత్తవి రూపొందించడం, డిస్‌అసెంబుల్ చేయడం, డికంపైల్ చేయడం లేదా రివర్స్ ఇంజినీరింగ్ చేయడం; లేదా
  • ఏవైనా అదనపు నిబంధనల (కింద నిర్వచించిన విధంగా) ప్రకారం అనుమతి ఉంటే తప్ప, మా సర్వీస్‌లను పోలిన లేదా మాకు పోటీగా ఉండే వేరే వెబ్‌సైట్, ప్రాడక్ట్ లేదా సర్వీస్‌ను తయారు చేయడానికి మా సర్వీస్‌లను లేదా కంటెంట్‌ను యాక్సెస్ చేయడం.

మేము మా సర్వీస్‌ను నిరంతరం మెరుగుపరుస్తూనే ఉంటాము. అంటే మేము కొత్త ఫీచర్లను, ప్రోడక్ట్‌లను లేదా ఫంక్షనాలిటీలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు; మేము మీకు ముందుగానే తెలియజేయడానికి ప్రయత్నిస్తాము, కానీ అది ఎల్లప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. మీకు ముందస్తు నోటీసు ఇచ్చినా లేదా ఇవ్వకపోయినా, ఏ సమయంలోనైనా సర్వీస్‌లను (పూర్తిగా లేదా పాక్షికంగా) మార్చే, సస్పెండ్ చేసే లేదా నిలిపివేసే హక్కు మాకు ఉంది. సర్వీస్‌ల ఫంక్షనాలిటీకి సంబంధించి భవిష్యత్తులో అయ్యే రిలీజ్‌లు, అప్‌డేట్‌లు లేదా ఇతర చేర్పులు అన్నీ ఈ నిబంధనలకు లోబడే ఉంటాయి, ఇవి ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ ఉండవచ్చు. సర్వీస్‌లను లేదా వాటిలోని ఏ భాగాన్నైనా మార్చడం, సస్పెండ్ చేయడం లేదా నిలిపివేయడం వల్ల మీకు లేదా ఏ థర్డ్ పార్టీకి అయినా ఏదైనా నష్టం కలిగితే, దానికి మేము బాధ్యులం కామని మీరు అంగీకరిస్తున్నారు.

సర్వీస్‌లలో మీరు జరిపే యాక్టివిటీ, మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కమ్యూనిటీలు, మీ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకున్న ప్రాధాన్యతలతో సహా అనేక అంశాల ఆధారంగా మేము సర్వీస్‌లలో మీ అనుభవాన్ని వ్యక్తిగతీకరిస్తాము. వీటితో పాటు ఇతర అంశాల ఆధారంగా, Redditలో మీ అనుభవాన్ని మరింత సందర్భోచితంగా చేయడానికి మేము మీకు తగిన సిఫార్సులను అందించవచ్చు. కంటెంట్ విషయంలో మీకు అందే సిఫార్సుల గురించి మరింత సమాచారం కోసం, అలాగే కొన్ని వ్యక్తిగతీకరణ ఆప్షన్లను మీరు ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రంలోని కంటెంట్‌ను రెఫర్ చేయండి.

4. మీ Reddit ఖాతా, ఖాతా భద్రత

మా సర్వీస్‌లలో కొన్ని ఫీచర్‌లను ఉపయోగించడానికి, మీరు ఒక Reddit ఖాతాను (ఒక “ఖాతా”) క్రియేట్ చేసి, మీ యూజర్‌నేమ్‌ను, పాస్‌వర్డ్‌ను, అలాగే కొంత ఇతర సమాచారాన్ని అందించాల్సి రావచ్చు, ఈ వివరాలన్నీ గోప్యతా విధానంలో అందించడం జరిగింది.

మీ ఖాతాకు సంబంధించిన సమాచారానికి, అలాగే మీ ఖాతాకు సంబంధించి జరిగే దేనికైనా మీదే పూర్తి బాధ్యత. మీ ఖాతా భద్రతను మీరు చూసుకుంటూ ఉండాలి, మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఖాతాను యాక్సెస్ చేశారని మీకు తెలిసినా, లేదా అనుమానంగా ఉన్నా, వెంటనే Redditకు తెలియజేయాలి. మీరు శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను (ఇది మీ ఖాతాకే వాడుతున్నది అయి ఉండాలి) వాడాలని, అలాగే రెండు దశల ప్రామాణీకరణను ఎనేబుల్ చేయాలని గట్టిగా సిఫార్సు చేస్తున్నాము. మీరు మీ ఖాతాకు మీ ఫోన్ నంబర్‌ను జోడించి, ఆ తర్వాత దాన్ని మార్చినా లేదా డీయాక్టివేట్ చేసినా, మీ ఖాతా సమాచారాన్ని తప్పకుండా అప్‌డేట్ చేయండి.

రాతపూర్వక అనుమతి లేకుండా మీరు మీ ఖాతాను లైసెన్స్‌కు ఇవ్వడం, అమ్మడం లేదా బదిలీ చేయడం వంటివి చేయకూడదు.

5. మీ కంటెంట్

సర్వీస్‌లలో సమాచారం, టెక్స్ట్, లింక్స్, గ్రాఫిక్స్, ఫోటోలు, వీడియోలు, ఆడియో, స్ట్రీమ్‌లు, సాఫ్ట్‌వేర్, టూల్స్ లేదా ఇతర మెటీరియల్స్‌తో సహా (“కంటెంట్”), మీ ద్వారా లేదా మీ ఖాతా ద్వారా, సర్వీస్‌ల సాయంతో క్రియేట్ అయిన లేదా సర్వీస్‌లకు సమర్పించిన కంటెంట్ (“మీ కంటెంట్”) ఉండవచ్చు. మీ కంటెంట్ ఎంతవరకు సంపూర్ణమైనది, నిజమైనది, ఖచ్చితమైనది లేదా నమ్మదగినది అనే దానికి మేము ఎలాంటి బాధ్యతా తీసుకోము. అలాగే ఈ అంశాలను మేము ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ధృవీకరించడం, మద్దతు ఇవ్వడం లేదా గ్యారెంటీ ఇవ్వడం జరగదు.

సర్వీస్‌లకు మీ కంటెంట్‌ను సమర్పించడం ద్వారా, ఈ నిబంధనలకు లోబడి మీ కంటెంట్‌కు హక్కులు ఇవ్వడానికి అవసరమైన అన్ని హక్కులు, అధికారాలు, అర్హతలు మీకు ఉన్నాయని మీరు స్పష్టం చేస్తున్నారు, హామీ ఇస్తున్నారు. మీ కంటెంట్‌కు మీదే పూర్తి బాధ్యత కాబట్టి, అవసరమైన హక్కులు లేని కంటెంట్‌ను పోస్ట్ లేదా షేర్ చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు ఏమైనా తలెత్తితే, వాటికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

మీ కంటెంట్‌పై యాజమాన్య హక్కులు మీ వద్దనే ఉంటాయి, అయితే ఆ కంటెంట్‌ను ఉపయోగించుకోవడానికి Redditకు మీరు ఈ లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు:

మీ కంటెంట్, సర్వీస్‌ల సాయంతో క్రియేట్ అయినప్పుడు లేదా మా సర్వీస్‌లకు సమర్పించబడినప్పుడు, మీరు మీ కంటెంట్‌ను, అలాగే దానితో పాటు ఇచ్చిన పేరు, యూజర్‌నేమ్, స్వరం లేదా లైక్‌నెస్‌ను ఉపయోగించడానికి, కాపీ చేయడానికి, మార్చడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి, వాటి ఆధారంగా కొత్తవి క్రియేట్ చేయడానికి, పంపిణీ చేయడానికి, స్టోర్ చేయడానికి, పర్‌ఫామ్ చేయడానికి, ప్రదర్శించడానికి ప్రపంచవ్యాప్త, రాయల్టీ-రహిత, శాశ్వత, రద్దు చేయలేని, ప్రత్యేకమైనది కాని, బదిలీ చేయగల, సబ్‌లైసెన్స్ ఇవ్వగల లైసెన్స్‌ను మాకు మంజూరు చేస్తున్నారు. ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న లేదా భవిష్యత్తులో డెవలప్ చేసే అన్ని రకాల మీడియా ఫార్మాట్‌లు, చానెళ్లలో ఈ లైసెన్స్ వర్తిస్తుంది. Redditతో చేతులు కలిపిన ఇతర కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తుల ద్వారా మీ కంటెంట్‌ను సిండికేషన్, ప్రసారం, పంపిణీ లేదా ప్రచురణ కోసం అందుబాటులో ఉంచే హక్కు కూడా ఈ లైసెన్స్ ద్వారా మాకు లభిస్తుంది. ఉదాహరణకు, AI లేదా మెషిన్ లెర్నింగ్ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి మీ కంటెంట్‌ను ఉపయోగించే హక్కు కూడా ఈ లైసెన్స్‌లో ఉంటుంది. దీని గురించి మరింత సమాచారం మా పబ్లిక్ కంటెంట్ పాలసీలో ఉంది. మీ కంటెంట్‌కు సంబంధించిన మెటాడేటాను మేము తొలగించవచ్చని కూడా మీరు అంగీకరిస్తున్నారు, అలాగే మీ కంటెంట్ విషయంలోని నైతిక హక్కులకు లేదా అట్రిబ్యూషన్‌కు సంబంధించిన క్లెయిమ్‌లు, ప్రకటలన్నింటినీ మీరు ఎప్పటికీ రద్దు చేసుకోలేని విధంగా వదులుకుంటున్నారు.

మా సర్వీస్‌లు లేదా Redditకు సంబంధించి మీరు ఇచ్చే ఐడియాలు, సూచనలు, ఫీడ్‌బ్యాక్ పూర్తిగా మీ ఇష్టపూర్వకంగానే ఇస్తారు. ఆ ఐడియాలు, సూచనలు, ఫీడ్‌బ్యాక్‌ను Reddit మీకు ఎలాంటి పరిహారం లేకుండా ఉపయోగించుకోవచ్చని, అలా ఉపయోగించుకున్నందుకు అది మీకు జవాబుదారీ కాదని కూడా మీరు అంగీకరిస్తున్నారు.

మీ కంటెంట్‌ను పరిశీలించడం, ఎడిట్ చేయడం లేదా మానిటర్ చేయడం వంటివి చేయాల్సిన బాధ్యత మాకు లేకపోయినప్పటికీ, మా స్వంత విచక్షణ మేరకు, ఏ సమయంలోనైనా, ఏ కారణంతోనైనా మీ కంటెంట్‌ను తొలగించడానికి, దాని మానిటైజేషన్ అర్హతను రద్దు చేయడానికి లేదా దాన్ని తీసివేయడానికి మాకు అధికారం ఉంది, ఈ నిబంధనలను కానీ, Reddit నియమాలను కానీ, లేదా మా ఇతర నిబంధనలు, పాలసీలను కానీ ఉల్లంఘించినా, లేదా మీ చర్యల వల్ల మాకు నష్టం కలిగినా లేదా నష్టం కలిగే అవకాశం ఉన్నా కూడా మేము ఈ చర్యలు తీసుకోవచ్చు.

కంటెంట్ మోడరేషన్ విషయంలో Reddit అనుసరించే విధానం గురించి మరింత సమాచారంతో పాటు, మా Reddit నిబంధనలను మేము ఎలా అమలు చేస్తాము, కంటెంట్ మోడరేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఎలా అప్పీల్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రానికి వెళ్లండి.

6. థర్డ్-పార్టీ కంటెంట్, యాడ్స్, ప్రమోషన్‌లు

ఈ సర్వీస్‌లలో థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లు, ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు సంబంధించిన లింక్‌లు ఉండవచ్చు ఈ లింక్‌లను అడ్వర్టైజర్‌లు, మా అనుబంధ సంస్థలు, మా భాగస్వాములు లేదా ఇతర యూజర్‌లు పోస్ట్ చేసి ఉండవచ్చు (“థర్డ్-పార్టీ కంటెంట్”). థర్డ్-పార్టీ కంటెంట్‌పై మాకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ఏ థర్డ్-పార్టీకి చెందిన వెబ్‌సైట్‌లు, ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు మేము బాధ్యత వహించము. థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడం పూర్తిగా మీ సొంత రిస్క్‌పైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి థర్డ్-పార్టీ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా లావాదేవీని కొనసాగించే ముందు, అవసరమని మీరు భావించే అన్ని విషయాలను పరిశీలించుకోవాలి.

సర్వీస్‌లలో స్పాన్సర్ చేసిన థర్డ్-పార్టీ కంటెంట్ లేదా అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా ఉండవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్‌ల రకం, స్థాయి, టార్గెటింగ్ మారవచ్చు, అలాగే మీ కంటెంట్‌తో సహా సర్వీస్‌లలో ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని ప్రదర్శించే సందర్భంలో మేము అడ్వర్టైజ్‌మెంట్‌లను ఉంచవచ్చనే విషయాన్ని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.

మీరు కాంటెస్ట్ లేదా స్వీప్‌స్టేక్స్ (“ప్రమోషన్”)తో సహా ఏదైనా ప్రమోషన్‌ను నిర్వహించడానికి సర్వీస్‌లను ఉపయోగించాలని ఎంచుకుంటే, ఆ ప్రమోషన్‌కు సంబంధించిన అధికారిక నియమాలు, ఆఫర్ నిబంధనలు, అర్హత అవసరాలను రూపొందించడం, అలాగే ఆ ప్రమోషన్‌ను నియంత్రించే వర్తించే చట్టాలు, నియమాలు, నిబంధనలకు (లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు, బాండ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం వంటివి) అనుగుణంగా వ్యవహరించడం సహా వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రమోషన్‌ను నిర్వహించే పూర్తి బాధ్యత మీదే. మీ ప్రమోషన్‌ను Reddit స్పాన్సర్ చేయడం లేదని, దానికి మద్దతు ఇవ్వడం లేదని లేదా Redditతో దానికి ఎలాంటి సంబంధం లేదని మీ ప్రమోషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి, అలాగే ప్రమోషన్‌కు సంబంధించిన ఏదైనా బాధ్యత నుండి Redditను మినహాయించేందుకు పోటీలో పాల్గొనడానికి నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి లేదా పాల్గొనే ప్రతి వ్యక్తి అంగీకరించడం తప్పనిసరి అని మీ ప్రమోషన్ నియమాలలో పేర్కొనాలి. మీ ప్రమోషన్ నిర్వహణలో మేము మీకు ఏ విధంగానూ సహాయం చేయమనే విషయాన్ని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు, అలాగే మీ సొంత రిస్క్‌తో ప్రమోషన్‌ను నిర్వహించడానికి అంగీకరిస్తున్నారు.

7. మీరు చేయకూడని పనులు

సర్వీస్‌లను ఉపయోగించేటప్పుడు లేదా యాక్సెస్ చేసేటప్పుడు మీరు ఈ నిబంధనలతో పాటు వర్తించే అన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దయచేసి Reddit నిబంధనలను సమీక్షించండి, ఈ సూచన ద్వారా అవి ఈ నిబంధనలలో చేర్చబడి వాటిలో భాగంగా పరిగణించబడతాయి, అలాగే నిషేధించబడిన కంటెంట్, ప్రవర్తనకు సంబంధించిన మా నియమాలు వాటిలో ఉంటాయి. Reddit నిబంధనలలో నిషేధించిన వాటితో పాటు మీరు కింది వాటిలో దేనినీ చేయకూడదు:

  • సర్వీస్‌ల పనితీరుకు అంతరాయం కలిగించే, వాటిని నిలిపివేసే, వాటి నిర్వహణకు ఆటంకం కలిగించే, వాటిపై అధిక భారం మోపే లేదా ఇతరత్రా వాటి పనితీరును దెబ్బతీసే విధంగా సర్వీస్‌లను ఏ పద్ధతిలోనైనా (ఆటోమేటెడ్ పద్ధతిలో, బాట్‌ల ద్వారా సహా, లేదా ఇతరత్రా) ఉపయోగించడం;
  • మరొక యూజర్ ఖాతాను లేదా సర్వీస్‌లలో పబ్లిక్‌కు అందుబాటులో లేని ఏవైనా భాగాలను యాక్సెస్ చేయడం (లేదా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం), వీటిలో సర్వీస్‌లకు కనెక్ట్ అయిన లేదా సర్వీస్‌లతో కలిసి ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్‌లు లేదా నెట్‌వర్క్‌లు కూడా ఉంటాయి;
  • సర్వీస్‌ల భద్రతకు సంబంధించిన ఫీచర్‌లతో సహా వాటి పనితీరుకు అంతరాయం కలిగించే ఉద్దేశంతో రూపొందించిన వైరస్‌లు, వార్మ్‌లు, హానికరమైన కోడ్ లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌ను సర్వీస్‌లకు లేదా వాటి ద్వారా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడం;
  • వర్తించే చట్టాలను ఉల్లంఘించడానికి లేదా ఏ వ్యక్తి లేదా సంస్థకు చెందిన మేధో సంపత్తి హక్కులను లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించడానికి సర్వీస్‌లను ఉపయోగించడం;
  • ఈ నిబంధనలలో లేదా Redditతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందంలో అనుమతించిన సందర్భాలలో మినహా, సర్వీస్‌ల నుండి డేటాను ఏ పద్ధతిలోనైనా (ఆటోమేటెడ్ పద్ధతిలో లేదా ఇతరత్రా) యాక్సెస్ చేయడం, శోధించడం లేదా సేకరించడం (మా robots.txt ఫైల్‌లో పేర్కొన్న పారామీటర్‌లకు అనుగుణంగా సర్వీస్‌లను క్రాల్ చేయడానికి మేము షరతులతో కూడిన అనుమతిని ఇస్తాము, అయితే Reddit ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా సర్వీస్‌ల నుండి డేటాను స్క్రాప్ చేయడం నిషేధం); లేదా
  • Reddit లేదా ఏదైనా చెల్లింపు వ్యవస్థను దుర్వినియోగం చేయడం లేదా మోసానికి పాల్పడటంగా మేము సహేతుకంగా భావించే విధంగా సర్వీస్‌లను ఉపయోగించడం.

ఈ నిబంధనలను లేదా మా Reddit నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని మీరు భావించే కంటెంట్ లేదా ప్రవర్తన గురించి రిపోర్ట్ చేయాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. భద్రతా లోపాల గురించి బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయడానికి కూడా మేము మద్దతు ఇస్తాము. భద్రతకు సంబంధించిన సమస్యను రిపోర్ట్ చేయడానికి, దయచేసి security@reddit.comకు ఇమెయిల్ పంపండి.

8. మోడరేటర్లు

సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయడం అనేది సర్వీస్‌ల యూజర్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్న అనధికారిక, స్వచ్ఛంద బాధ్యత. మోడరేటర్‌లు తీసుకునే చర్యలకు మేము బాధ్యత వహించము. ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో సహా ఏ కారణంతోనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానైనా, ఎప్పుడైనా సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేసే యూజర్ సామర్థ్యాన్ని రద్దు చేసే లేదా పరిమితం చేసే హక్కు మాకు ఉంది.

మీరు సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయాలని ఎంచుకుంటే:

  • మీరు మోడరేటర్ ప్రవర్తనా నియమావళిని పాటించడానికి అంగీకరిస్తున్నారు;
  • మీరు మోడరేట్ చేసే సబ్‌రెడిట్‌కు సంబంధించిన రిపోర్ట్‌లు అందినప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి అంగీకరిస్తున్నారు, వీటిలో పాలసీని ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించడం మరియు/లేదా సమీక్ష కోసం వెంటనే Redditకు పంపించడం వంటివి ఉండవచ్చు;
  • Reddit తరఫున వ్యవహరించడానికి మీకు అధికారం లేదు, అలాగే మీకు అలాంటి అధికారం ఉన్నట్లు చెప్పుకోకూడదు;
  • మా రాతపూర్వక ఆమోదం లేకుండా Reddit తరఫున లేదా మీరు మోడరేట్ చేసే ఏ సబ్‌రెడిట్ తరఫునైనా థర్డ్ పార్టీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకూడదు;
  • థర్డ్ పార్టీల నుండి ఏ రూపంలోనైనా పారితోషికం, ప్రతిఫలం, గిఫ్ట్ లేదా ఉపకారం పొందడానికి బదులుగా మీరు మోడరేషన్ చర్యలు చేపట్టకూడదు;
  • సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయడం వల్ల పబ్లిక్‌కు అందుబాటులో లేని సమాచారం మీకు లభిస్తే, ఆ సమాచారాన్ని మోడరేటర్‌గా మీ బాధ్యతలను నిర్వర్తించడానికి మాత్రమే ఉపయోగించాలి; అలాగే
  • మీరు మోడరేట్ చేసే సబ్‌రెడిట్‌ల కోసం నియమాలను క్రియేట్ చేసి, అమలు చేయవచ్చు, అయితే, ఆ నియమాలు ఈ నిబంధనలకు, Reddit నిబంధనలకు, లేదా మోడరేటర్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండకూడదు.

మోడరేటర్ తీసుకున్న ఏదైనా చర్య లేదా నిర్ణయం Reddit లేదా Reddit కమ్యూనిటీ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని Reddit తన స్వంత విచక్షణ మేరకు భావిస్తే, ఆ చర్యను లేదా నిర్ణయాన్ని రద్దు చేసే హక్కు Redditకు ఉంటుంది, అయితే అలా చేయాల్సిన బాధ్యత Redditకు లేదు.

9. కాపీరైట్, ట్రేడ్‌మార్క్, DMCA, ఇంకా తొలగింపులు

Reddit ఇతరుల మేధో సంపత్తిని గౌరవిస్తుంది, అలాగే మా సర్వీస్‌ల యూజర్‌లు కూడా ఇతరుల మేధో సంపత్తిని గౌరవించాలని కోరుతుంది. హక్కులను ఉల్లంఘించే ఏ కంటెంట్‌నైనా సర్వీస్‌ల నుండి తొలగించడం అలాగే పదేపదే హక్కులను ఉల్లంఘించే మా సర్వీస్‌ల యూజర్‌లకు తగిన పరిస్థితుల్లో సర్వీస్‌ల యాక్సెస్‌ను రద్దు చేయడం వంటి నిబంధనలతో కూడిన పాలసీ మాకు ఉంది. మా సర్వీస్‌లలోని ఏదైనా కంటెంట్ మీకు చెందిన లేదా మీ నియంత్రణలో ఉన్న కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘిస్తోందని మీరు భావిస్తే, మా కాపీరైట్ రిపోర్ట్ ఫామ్ లేదా ట్రేడ్‌మార్క్ రిపోర్ట్ ఫారమ్‌ను పూరించడం ద్వారా లేదా కింది అడ్రస్‌లో సంప్రదించడం ద్వారా Reddit నియమించిన ఏజెంట్‌కు తెలియజేయవచ్చు:

కాపీరైట్ ఏజెంట్
Reddit, Inc.
303 2nd Street, Suite 500S
San Francisco, CA 94107
copyright@reddit.com

సరైన నోటిఫికేషన్‌కు సంబంధించిన అవసరాల కోసం 17 U.S.C. § 512(c)(3)ను చూడండి. అలాగే, మా సర్వీస్‌లలోని ఏదైనా యాక్టివిటీ లేదా కంటెంట్ హక్కులను ఉల్లంఘిస్తోందని తెలిసి కూడా తప్పుడు సమాచారం అందిస్తే, కొన్ని ఖర్చులు, ఇంకా నష్టాలకు సంబంధించి మీరు Redditకు పరిహారం చెల్లించాల్సి రావచ్చని దయచేసి గమనించండి.

కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ నోటీసుకు ప్రతిస్పందనగా మేము మీ కంటెంట్‌ను తొలగిస్తే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాము. కాపీరైట్ నోటీసులో పొరపాటు లేదా తప్పుగా గుర్తించడం వల్ల మీ కంటెంట్‌ను తొలగించారని మీరు భావిస్తే, మా కాపీరైట్ కౌంటర్ నోటీస్ ఫామ్ ద్వారా లేదా మా కాపీరైట్ ఏజెంట్‌కు (సంప్రదింపు వివరాలు పైన అందించాము) కౌంటర్ నోటిఫికేషన్‌ను పంపవచ్చు. సరైన కౌంటర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆవశ్యకతల కోసం 17 U.S.C. § 512(g)(3)ను చూడండి.

10. చెల్లింపు సర్వీస్‌లు

సర్వీస్‌లలోని అనేక సౌకర్యాలను ఉపయోగించడానికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, కొన్ని సర్వీస్‌లు, ఫీచర్‌లు, ప్రోడక్ట్‌లు కొనుగోలు చేయడానికి (“చెల్లింపు సర్వీస్‌లు”) అందుబాటులో ఉండవచ్చు. ఈ నిబంధనలతో పాటు, Reddit Econ నిబంధనలు కూడా చెల్లింపు సర్వీస్‌లకు వర్తిస్తాయి. చెల్లింపు సర్వీస్‌లను కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు Econ నిబంధనలకు, అలాగే వర్తించే సందర్భాల్లో, ప్రివ్యూల నిబంధనలకు కూడా అంగీకరిస్తున్నారు.

11. మేధో సంపత్తి

సర్వీస్‌ల యాజమాన్యం, నిర్వహణ Redditకు చెందినవి. Reddit అందించే విజువల్ ఇంటర్‌ఫేస్‌లు, గ్రాఫిక్స్, డిజైన్, కంపైలేషన్, సమాచారం, డేటా, కంప్యూటర్ కోడ్, ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, అలాగే సర్వీస్‌లలోని ఇతర అన్ని అంశాలు (“మెటీరియల్స్”) మేధో సంపత్తి చట్టాలు, ఇతర చట్టాల ద్వారా రక్షణ పొందుతాయి. సర్వీస్‌లలోని అన్ని మెటీరియల్స్ Reddit లేదా దాని థర్డ్-పార్టీ లైసెన్స్‌దారుల యాజమాన్యానికి చెందినవి. మెటీరియల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా లేదా చెల్లింపు సర్వీస్‌లను కొనుగోలు చేయడం ద్వారా మీకు ఎలాంటి యాజమాన్య హక్కులూ లభించవని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. Reddit స్పష్టంగా అనుమతించిన సందర్భాల్లో మినహా, Reddit బ్రాండ్ మార్గదర్శకాలకుకు లోబడి మీరు మెటీరియల్స్‌ను ఉపయోగించకూడదు. ఈ నిబంధనలలో స్పష్టంగా మంజూరు చేయని మెటీరియల్స్‌కు సంబంధించిన అన్ని హక్కులను Reddit తన వద్ద ఉంచుకుంటుంది.

12. నష్టపరిహారం

చట్టం నిషేధించిన మేరకు మినహా, ఏదైనా థర్డ్ పార్టీ చేసే క్లెయిమ్ లేదా డిమాండ్ నుండి అలాగే వాటికి సంబంధించిన ఏవైనా బాధ్యతలు, హాని, నష్టాలు, ఖర్చులు (వ్యయాలు, న్యాయవాదుల ఫీజులతో సహా) నుండి Reddit, దాని అనుబంధ సంస్థలు అలాగే వాటి సంబంధిత డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, ఏజెంట్‌లు, కాంట్రాక్టర్‌లు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లు, లైసెన్స్‌దారులను (“Reddit సంస్థలు”) రక్షించడానికి, వారికి పరిహారం చెల్లించడానికి అలాగే వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారు. కింది కారణాల వల్ల లేదా వాటి నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన క్లెయిమ్‌లు, డిమాండ్‌లకు ఇది వర్తిస్తుంది: (a) మీరు సర్వీస్‌లను ఉపయోగించడం; (b) మీరు ఈ నిబంధనలను ఉల్లంఘించడం; (c) మీరు వర్తించే చట్టాలు లేదా నిబంధనలను ఉల్లంఘించడం; లేదా (d) మీ కంటెంట్. మీరు మాకు పరిహారం చెల్లించాల్సిన ఏదైనా అంశానికి సంబంధించిన క్లెయిమ్‌లపై రక్షణ చర్యలను నియంత్రించే హక్కు మాకు ఉంది అలాగే ఈ క్లెయిమ్‌లను ఎదుర్కోవడంలో మాకు సహకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

13. బాధ్యత నిరాకరణలు, బాధ్యత పరిమితి

సర్వీస్‌ల యూజర్‌గా మీకు ఉండే చట్టబద్ధమైన హక్కులకు ఈ నిబంధనలలోని ఏ అంశమూ భంగం కలిగించదు. కొన్ని దేశాలు, రాష్ట్రాలు, ప్రావిన్స్‌లు లేదా ఇతర అధికార పరిధుల్లో ఈ విభాగంలో పేర్కొన్న విధంగా కొన్ని వారంటీలను మినహాయించడానికి లేదా బాధ్యతను పరిమితం చేయడానికి అనుమతి ఉండదు, కాబట్టి దిగువ నిబంధనలు మీకు పూర్తిగా వర్తించకపోవచ్చు. బదులుగా, అటువంటి అధికార పరిధుల్లో దిగువ పేర్కొన్న మినహాయింపులు, పరిమితులు ఆయా అధికార పరిధుల చట్టాలు అనుమతించిన మేరకు మాత్రమే వర్తిస్తాయి.

సర్వీస్‌లు ఎలాంటి స్పష్టమైన, పరోక్ష, చట్టపరమైన లేదా చట్టబద్ధమైన హామీలు, వారంటీలు లేదా షరతులు లేకుండా “ఉన్నట్లుగానే”, ఇంకా “అందుబాటులో ఉన్నట్లుగానే” అందిస్తారు. వీటిలో విక్రయయోగ్యత, యాజమాన్య హక్కు, నిర్దిష్ట ప్రయోజనానికి అనుకూలత మరియు హక్కుల ఉల్లంఘన లేకపోవడానికి సంబంధించిన పరోక్ష వారంటీలు కూడా ఉంటాయి. సర్వీస్‌లు ఖచ్చితమైనవి, సంపూర్ణమైనవి, విశ్వసనీయమైనవి, తాజా సమాచారంతో కూడినవి లేదా లోపాలు లేనివని Reddit సంస్థలు ఎలాంటి వారంటీ ఇవ్వవు. సర్వీస్‌లలో అందుబాటులో ఉన్న లేదా వాటికి లింక్ చేసిన ఏ కంటెంట్‌నైనా లేదా మోడరేటర్‌లతో సహా ఏ థర్డ్ పార్టీ లేదా యూజర్ చర్యలనైనా Reddit నియంత్రించదు, ఆమోదించదు లేదా వాటికి బాధ్యత వహించదు. మీరు మా సర్వీస్‌లను సురక్షితంగా యాక్సెస్ చేసి ఉపయోగించుకునేలా Reddit ప్రయత్నిస్తున్నప్పటికీ, మా సర్వీస్‌లు లేదా సర్వర్‌లలో వైరస్‌లు లేదా ఇతర హానికరమైన అంశాలు లేవని మేము ఎలాంటి హామీ లేదా వారంటీ ఇవ్వము.

ఈ నిబంధనలు లేదా సర్వీస్‌ల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన ఏవైనా పరోక్ష, పర్యవసాన, ఆదర్శప్రాయ, యాదృచ్ఛిక, ప్రత్యేక లేదా శిక్షాత్మక నష్టాలకు లేదా కోల్పోయిన లాభాలకు Reddit సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు బాధ్యత వహించవు. పరువు నష్టం కలిగించేవిగా, అభ్యంతరకరమైనవిగా లేదా చట్టవిరుద్ధమైనవిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్వీస్‌లలో అందుబాటులో ఉంచిన కంటెంట్ నుండి ఉత్పన్నమయ్యే లేదా దానికి సంబంధించిన నష్టాలు కూడా ఇందులో ఉంటాయి. సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం పూర్తిగా మీ స్వంత నిర్ణయం, రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది అలాగే మీ డివైజ్ లేదా కంప్యూటర్ సిస్టమ్‌కు కలిగే ఏదైనా నష్టానికి లేదా దాని ఫలితంగా డేటా కోల్పోవడానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ Reddit సంస్థల మొత్తం బాధ్యత వంద U.S. డాలర్లు ($100) లేదా క్లెయిమ్‌కు కారణమైన సర్వీస్‌ల కోసం గత ఆరు నెలల్లో మీరు Redditకు చెల్లించిన మొత్తం వీటిలో ఏది ఎక్కువైతే దాన్ని మించదు. ఈ విభాగంలోని పరిమితులు వారంటీ, ఒప్పందం, చట్టం, చట్టపరమైన తప్పిదం, నిర్లక్ష్యం, కఠిన బాధ్యత లేదా ఇతర కారణాల ఆధారంగా ఏర్పడే ఏ రకమైన బాధ్యతకైనా వర్తిస్తాయి. అటువంటి నష్టం జరిగే అవకాశం గురించి Reddit సంస్థలకు ముందుగానే తెలియజేసినప్పటికీ అలాగే ఈ నిబంధనలలో పేర్కొన్న ఏదైనా పరిష్కారం దాని ప్రాథమిక ఉద్దేశాన్ని నెరవేర్చడంలో విఫలమైందని తేలినప్పటికీ ఈ పరిమితులు వర్తిస్తాయి.

14. వర్తించే చట్టం, విచారణ వేదిక

మీరు Redditను ఆస్వాదించాలని మేము కోరుకుంటున్నాము, కాబట్టి మీకు ఏదైనా సమస్య లేదా వివాదం ఉంటే, దాన్ని మా దృష్టికి తీసుకువచ్చి, మాతో అనధికారికంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించేందుకు మీరు అంగీకరిస్తున్నారు. మీ ఫీడ్‌బ్యాక్, ఆందోళనల గురించి ఇక్కడ మమ్మల్ని సంప్రదించవచ్చు.

వర్తించే చట్టం అనుమతించే గరిష్ఠ మేరకు, ఈ నిబంధనలు లేదా సర్వీస్‌ల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన మీరు చేసే ఏవైనా క్లెయిమ్‌లకు, చట్టాల మధ్య వైరుధ్యాలకు సంబంధించిన నియమాలను పరిగణనలోకి తీసుకోకుండా, కాలిఫోర్నియా రాష్ట్ర చట్టాలు వర్తిస్తాయి; ఈ నిబంధనలు లేదా సర్వీస్‌లకు సంబంధించిన అన్ని వివాదాలను కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫెడరల్ లేదా రాష్ట్ర న్యాయస్థానాల్లో మాత్రమే దాఖలు చేయాలి అలాగే మీరు, Reddit ఈ న్యాయస్థానాల వ్యక్తిగత అధికార పరిధికి సమ్మతిస్తున్నారు.

మీరు U.S. నగర, కౌంటీ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయితే, ఈ సెక్షన్ 14 మీకు వర్తించదు. మీరు U.S. ఫెడరల్ ప్రభుత్వ సంస్థ అయితే, ఈ నిబంధనలు లేదా సర్వీస్‌ల నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన ఏవైనా క్లెయిమ్‌లకు, చట్టాల మధ్య వైరుధ్యాలకు సంబంధించిన నియమాలను పరిగణనలోకి తీసుకోకుండా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చట్టాలు వర్తిస్తాయి. వర్తించే ఫెడరల్ చట్టం లేని సందర్భంలో, ఫెడరల్ చట్టం అనుమతించే మేరకు కాలిఫోర్నియా చట్టాలు (చట్టాల మధ్య వైరుధ్యాలకు సంబంధించిన నియమాలు మినహా) వర్తిస్తాయి. ఈ నిబంధనలు లేదా సర్వీస్‌లకు సంబంధించిన అన్ని వివాదాలను కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఫెడరల్ లేదా రాష్ట్ర న్యాయస్థానాల్లో మాత్రమే దాఖలు చేయాలి.

15. ఈ నిబంధనలకు మార్పులు

మేము ఎప్పటికప్పుడు ఈ నిబంధనలకు మార్పులు చేయవచ్చు. మేము ఏవైనా మార్పులు చేస్తే, సవరించిన నిబంధనలను పోస్ట్ చేసి, పైన పేర్కొన్న అమల్లోకి వచ్చే తేదీని అప్‌డేట్ చేస్తాము. మా స్వంత నిర్ణయం ప్రకారం, ఆ మార్పులు ముఖ్యమైనవిగా భావిస్తే, మీ ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రస్‌కు (మీరు ధృవీకరించిన ఇమెయిల్ అడ్రస్‌ను అందించాలని ఎంచుకుని ఉంటే) ఇమెయిల్ పంపడం ద్వారా లేదా మా సర్వీస్‌ల ద్వారా ఇతర మార్గాల్లో నోటీసు అందించడం ద్వారా కూడా మేము మీకు తెలియజేయవచ్చు. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీన లేదా ఆ తర్వాత కూడా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, సవరించిన నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు. సవరించిన నిబంధనలకు మీరు అంగీకరించకపోతే, మార్పులు అమల్లోకి రాకముందే మా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం ఆపివేయాలి.

16. అదనపు నిబంధనలు

మేము వివిధ రకాల సర్వీస్‌లను అందిస్తున్నందున, Reddit అందించే నిర్దిష్ట ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను ఉపయోగించే ముందు అదనపు నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు లేదా నియమాలకు (వీటన్నింటినీ కలిపి, “అదనపు నిబంధనలు” అంటారు) అంగీకరించాల్సిందిగా మిమ్మల్ని కోరవచ్చు. ఈ సూచన ద్వారా అన్ని అదనపు నిబంధనలు ఈ నిబంధనల్లో చేర్చబడి, వీటిలో భాగంగా పరిగణించబడతాయి, ఏవైనా అదనపు నిబంధనలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మేరకు, సంబంధిత సర్వీస్‌లను మీరు ఉపయోగించే విషయంలో అదనపు నిబంధనలే వర్తిస్తాయి.

  • మీరు ఏవైనా చెల్లింపు సర్వీస్‌లు లేదా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తే, Reddit Econ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు ఏవైనా ప్రివ్యూ ఫీచర్‌లను ఉపయోగిస్తే Reddit ప్రివ్యూల నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు సర్వీస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తే, Reddit అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు మా డెవలపర్ సర్వీస్‌లలో దేనినైనా (మా APIలతో సహా) ఉపయోగిస్తే, Reddit డెవలపర్ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు అదనపు నిబంధనలు వర్తించే ఏదైనా Reddit ప్రోగ్రామ్‌లో (ఉదా., ఏదైనా ఎర్నింగ్స్ ప్రోగ్రామ్ కోసం, సంపాదనల నిబంధనలు) పాల్గొంటే, ఆ అదనపు నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
17. రద్దు

మీరు మీ ఖాతాను తొలగించి, అన్ని సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేయడం ద్వారా ఏ సమయంలోనైనా, ఏ కారణంతోనైనా ఈ నిబంధనలను రద్దు చేసుకోవచ్చు. మీరు మీ ఖాతాను తొలగించకుండా సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేస్తే, ఎక్కువ కాలం పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మీ ఖాతా డీయాక్టివేట్ కావచ్చు.

వర్తించే చట్టం అనుమతించే గరిష్ఠ మేరకు, ఈ నిబంధనలు లేదా మా Reddit నిబంధనలను ఉల్లంఘించడంతో సహా ఏ కారణంతోనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానైనా, ఏ సమయంలోనైనా మీ ఖాతాను, మోడరేటర్ హోదాను లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేసే లేదా ఉపయోగించే మీ సామర్థ్యాన్ని మేము సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

ఈ నిబంధనలు లేదా మీ ఖాతా రద్దయిన తర్వాత కూడా కింది సెక్షన్‌లు అమల్లో కొనసాగుతాయి: 5 (మీ కంటెంట్), 7 (మీరు చేయకూడని పనులు), 12 (నష్టపరిహారం), 13 (బాధ్యత నిరాకరణలు, బాధ్యత పరిమితి), 14 (వర్తించే చట్టం, విచారణ వేదిక), 17 (రద్దు), అలాగే 18 (ఇతర అంశాలు).

18. ఇతర అంశాలు

ఈ నిబంధనలు గోప్యతా విధానం అలాగే ఈ నిబంధనల్లో సూచన ద్వారా స్పష్టంగా చేర్చిన ఇతర ఒప్పందాలతో కలిపి, మీరు సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం గురించి మీకు, మాకు మధ్య ఉన్న పూర్తి ఒప్పందంగా పరిగణించబడతాయి. ఈ నిబంధనల్లోని ఏదైనా హక్కును లేదా నిబంధనను మేము వినియోగించుకోకపోయినా లేదా అమలు చేయకపోయినా, ఆ హక్కును లేదా నిబంధనను వదులుకున్నట్లు కాదు. ఈ నిబంధనల్లోని ఏదైనా భాగం చెల్లదని లేదా అమలు చేయడానికి వీల్లేదని తేలితే, అమలు చేయడానికి వీల్లేని ఆ భాగాన్ని సాధ్యమైనంత గరిష్ఠ మేరకు అమలు చేస్తారు అలాగే మిగిలిన భాగాలు పూర్తిగా అమల్లో కొనసాగుతాయి. మా సమ్మతి లేకుండా ఈ నిబంధనల కింద మీకు ఉన్న ఏవైనా హక్కులను లేదా బాధ్యతలను మీరు ఇతరులకు కేటాయించకూడదు లేదా బదిలీ చేయకూడదు. ఈ నిబంధనల కింద మాకు ఉన్న ఏవైనా హక్కులను, బాధ్యతలను మేము ఎలాంటి పరిమితులు లేకుండా ఇతరులకు కేటాయించవచ్చు.

ఈ నిబంధనల్లో శీర్షికలను కేవలం సూచన కోసం మాత్రమే ఉపయోగించాము. ఈ నిబంధనలను అర్థం చేసుకునేటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనల ప్రయోజనాల కోసం: (a) “చేర్చడం,” “చేరుస్తుంది,” “సహా” అనే పదాల తర్వాత “ఎలాంటి పరిమితి లేకుండా” అనే పదాలు ఉన్నట్లుగా పరిగణించాలి; (b) “వంటివి,” “ఉదాహరణకు,” “ఉదా.,” అనే పదాలు, వాటి నుంచి ఉత్పన్నమైన ఇతర పదాలు ఉదాహరణలను సూచిస్తాయి అలాగే వాటి తర్వాత పేర్కొన్న అంశాలే పూర్తి జాబితాగా పరిగణించకూడదు; అలాగే (c) “లేదా” అనే పదాన్ని “మరియు/లేదా” అనే సమ్మిళిత అర్థంలో ఉపయోగించాము. “లేదా,” “ఏదైనా,” “రెండింటిలో ఏదైనా ఒకటి” అనే పదాలు కేవలం ఒక ఎంపికకే పరిమితం కావు. ఈ నిబంధనల్లోని భాషను ఒక పక్షమే రూపొందించిందనే వాదన ఆధారంగా, ఏదైనా అస్పష్టతను ఆ పక్షానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోకూడదు.

ఈ నిబంధనలు మీకు, Reddit, Inc.కు మధ్య చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందం. ఈ నిబంధనల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

Reddit, Inc.
303 2nd Street, Suite 500S
San Francisco, CA 94107
United States

మీరు EEA, యునైటెడ్ కింగ్‌డమ్ లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే వర్తించే Reddit యూజర్ ఒప్పందం

హలో, రెడ్డిటర్‌లకు, ఇంటర్నెట్ వినియోగదారులకు! ఈ Reddit యూజర్ ఒప్పందం (“నిబంధనలు”) వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, విడ్జెట్‌లు, APIలు, ఇమెయిల్‌లు, ఇతర ఆన్‌లైన్ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లను (వీటన్నింటినీ కలిపి, “సర్వీస్‌లు” అంటారు) మీరు యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి వర్తిస్తుంది. మీరు UKలో నివసిస్తుంటే, Reddit, Inc., 548 Market Street, #16093, San Francisco, CA 94104 USAతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మీరు EEA లేదా స్విట్జర్లాండ్‌లో నివసిస్తుంటే Reddit Netherlands B.V., Looiersgracht 43, 1016 VR Amsterdam, Netherlandsతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. "Reddit", "మేము", "మాకు", లేదా "మా" అనే పదాలన్నీ మీరు నివసించే ప్రాంతం ఆధారంగా సంబంధిత సంస్థను సూచిస్తాయి.

Reddit మీరు సరదాగా గడపాలని, అలాగే మీకు వినోదం అందించాలనే ఉద్దేశంతో డెవలప్ చేసిన ప్లాట్‌ఫామ్ అని గుర్తుంచుకోండి, అయినా కానీ ఇక్కడ కొన్ని ప్రాథమిక నియమాలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. సర్వీస్‌లను ఉపయోగించడానికి, మీరు ఈ నిబంధనలను తప్పనిసరిగా అంగీకరించి ఉండాలి, ఈ నిబంధనలు: (a) మీరు ఖాతాను క్రియేట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాము; అలాగే (b) మీరు సర్వీస్‌లను యాక్సెస్ చేసినప్పుడు ఎప్పుడైనా అందుబాటులో ఉంటాయి. మీరు ఈ నిబంధనలను అంగీకరించకపోతే, మా సర్వీస్‌లను యాక్సెస్ చేయకూడదు లేదా ఉపయోగించకూడదు.

1. సర్వీస్‌లకు మీ యాక్సెస్

13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారందరికీ సర్వీస్‌లను ఉపయోగించడానికి లేదా యాక్సెస్ చేయడానికి అనుమతి ఉండదు. మా సర్వీస్‌లలోని కొన్నింటిని ఉపయోగించడానికి మీరు అంతకన్నా పెద్దవారై ఉండాలి. ఉదాహరణకు, Redditలో పెద్దలకు మాత్రమే తగిన కంటెంట్‌ను వీక్షించడానికి మీకు కనీసం 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. మీరు సర్వీస్‌లను యాక్సెస్ చేసేటప్పుడు దయచేసి అన్ని నోటీసులను, ఏవైనా అదనపు నిబంధనలను శ్రద్ధగా చదవండి.

సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా మీరు వీటిని ధృవీకరిస్తున్నారు:

  • మీ వయస్సు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి అలాగే సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి మీరు నివసించే దేశ చట్టాల ప్రకారం అవసరమైన కనీస వయస్సు కంటే ఎక్కువ ఉండాలి;
  • Redditతో చట్టబద్ధమైన ఒప్పందాన్ని కుదుర్చుకునే అర్హత మీకు ఉందని, లేదా ఒకవేళ మీకు వయస్సు 13 ఏళ్లు నిండి ఉండి, మీరు ఉంటున్న ప్రాంతంలోని చట్టాల ప్రకారం ఇంకా మేజర్ కాకపోతే, మీ లీగల్ గార్డియన్ ఈ నిబంధనలను సమీక్షించి అంగీకరించారని;
  • వర్తించే చట్టాలన్నింటి ప్రకారం మా సర్వీస్‌లను ఉపయోగించకుండా మీపై ఎలాంటి నిషేధమూ లేదని; ఇంకా
  • మా సర్వీస్‌లను ఉపయోగించకుండా మిమ్మల్ని ఎప్పుడూ శాశ్వతంగా సస్పెండ్ చేయడం కానీ, తొలగించడం గానీ జరగలేదు అని.

ఒక బిజినెస్ లేదా ప్రభుత్వరంగ సంస్థతో సహా మరొక చట్టపరమైన సంస్థ తరఫున మీరు ఈ నిబంధనలను అంగీకరిస్తున్నట్లయితే, అటువంటి సంస్థను ఈ నిబంధనలకు కట్టుబడి ఉండేలా చేయడానికి మీకు చట్టపరంగా పూర్తి అధికారం ఉందని మీరు హామీ ఇస్తున్నారు.

2. గోప్యత

మీరు మా సర్వీస్‌లను యాక్సెస్ చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, మేము మీ గురించిన సమాచారాన్ని సేకరించడం, ఉపయోగించడం, షేర్ చేయడం వంటివి ఎలా చేస్తాము, ఎందుకు చేస్తామో Reddit గోప్యతా విధానం వివరిస్తుంది. మీరు ఈ సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా ఈ సమాచారాన్ని సేకరించడానికి, ఉపయోగించడానికి సమ్మతిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారు.

3. సర్వీస్‌లకు సంబంధించి మీ వినియోగం

ఈ నిబంధనలకు మీరు పూర్తిగా, అలాగే నిరంతరం కట్టుబడి ఉన్నంత వరకు, Reddit వీటికి మీకు వ్యక్తిగత, బదిలీ చేయలేని, ప్రత్యేకమైనది కానీ, రద్దు చేయగల, పరిమిత లైసెన్స్‌ను మంజూరు చేస్తుంది: (ఎ) మీకు చెందిన లేదా మీ నియంత్రణలో ఉన్న మొబైల్ పరికరంలో, ఒక అధికారిక మార్కెట్‌ప్లేస్ నుండి పొందిన మా మొబైల్ అప్లికేషన్ కాపీని (సర్వీస్‌లకు సంబంధించినది) ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, ఉపయోగించడానికి; ఇంకా (బి) సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, ఉపయోగించడానికి. ఈ నిబంధనల ద్వారా మీకు స్పష్టంగా ఇవ్వని హక్కులన్నీ మా దగ్గరే ఉంటాయి.

వర్తించే చట్టం అనుమతించే సందర్భాల్లో తప్ప, మా రాతపూర్వక ఒప్పందం లేకుండా మీరు ఈ కింది పనులు చేయకూడదు:

  • సర్వీస్‌లను కానీ, కంటెంట్‌ను కానీ లైసెన్స్‌కు ఇవ్వడం, అమ్మడం, బదిలీ చేయడం, కేటాయించడం, పంపిణీ చేయడం, హోస్ట్ చేయడం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం;
  • సర్వీస్‌లు లేదా కంటెంట్‌లోని ఏ భాగాన్నైనా మార్చడం, వాటి ఆధారంగా కొత్తవి రూపొందించడం, డిస్‌అసెంబుల్ చేయడం, డికంపైల్ చేయడం లేదా రివర్స్ ఇంజినీరింగ్ చేయడం; లేదా
  • ఏవైనా అదనపు నిబంధనల (కింద నిర్వచించిన విధంగా) ప్రకారం అనుమతి ఉంటే తప్ప, మా సర్వీస్‌లను పోలిన లేదా మాకు పోటీగా ఉండే వేరే వెబ్‌సైట్, ప్రాడక్ట్ లేదా సర్వీస్‌ను తయారు చేయడానికి మా సర్వీస్‌లను లేదా కంటెంట్‌ను యాక్సెస్ చేయడం.

సర్వీస్‌లు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని లేదా ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తాయని మేము హామీ ఇవ్వము. మేము మా సర్వీస్‌లను నిరంతరం మెరుగుపరుస్తున్నాము. అంటే, మేము ఫీచర్‌లు, ప్రోడక్ట్‌లు లేదా ఫంక్షనాలిటీలను జోడించవచ్చు లేదా తొలగించవచ్చు; దీని గురించి మీకు ముందుగానే తెలియజేయడానికి ప్రయత్నిస్తాము, కానీ అది ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. మీకు ముందస్తు నోటీసు ఇచ్చినా, ఇవ్వకపోయినా, ఏ సమయంలోనైనా సర్వీస్‌లను (పూర్తిగా లేదా పాక్షికంగా) మార్చే, సస్పెండ్ చేసే లేదా పూర్తిగా ఆపివేసే హక్కు మాకు ఉంది. భవిష్యత్తులో విడుదలయ్యే ఏవైనా కొత్త వెర్షన్‌లు, అప్‌డేట్‌లు లేదా సర్వీస్‌ల ఫంక్షనాలిటీకి చేసే ఇతర జోడింపులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయ్యే ఈ నిబంధనలు వర్తిస్తాయి. సర్వీస్‌లలో లేదా వాటిలోని ఏదైనా భాగంలో చేసే మార్పులు, వాటిని తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా ఆపివేయడం వల్ల మీకు లేదా ఏదైనా థర్డ్-పార్టీకి మేము బాధ్యత వహించమని మీరు అంగీకరిస్తున్నారు. ఈ పేరాగ్రాఫ్‌లోని ఏ అంశమూ వర్తించే చట్టం ప్రకారం మీకు ఉండే చట్టబద్ధమైన హక్కులను ప్రభావితం చేయదు.

సర్వీస్‌లలో మీ యాక్టివిటీ, మీరు సబ్‌స్క్రైబ్ చేసుకున్న కమ్యూనిటీలు, మీ సెట్టింగ్‌లలో మీరు ఎంచుకున్న ప్రాధాన్యతలతో సహా వివిధ అంశాల ఆధారంగా సర్వీస్‌లలో మీ అనుభవాన్ని మీ అభిరుచులకు తగ్గట్టుగా మారుస్తాము. ఈ అంశాలు, ఇతర అంశాల ఆధారంగా Redditలో మీ అనుభవాన్ని మీకు మరింత సంబంధితంగా మార్చేందుకు మేము సిఫార్సులు చేయవచ్చు. మీ కంటెంట్ సిఫార్సుల గురించి మరింత సమాచారం కోసం, అలాగే కొన్ని వ్యక్తిగతీకరణ ఆప్షన్‌లను మీరు ఎలా నియంత్రించవచ్చో తెలుసుకోవడానికి, దయచేసి మా సహాయ కేంద్రాన్ని చూడండి.

4. మీ Reddit ఖాతా, ఖాతా భద్రత

మా సర్వీస్‌లలోని కొన్ని ఫీచర్‌లను ఉపయోగించడానికి, మీరు Reddit ఖాతాను (“ఖాతా”) క్రియేట్ చేసి, గోప్యతా విధానంలో పేర్కొన్న విధంగా మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో పాటు మీకు సంబంధించిన కొన్ని ఇతర వివరాలను మాకు అందించాల్సి రావచ్చు.

మీ ఖాతాతో అనుబంధించబడిన సమాచారం, మీ ఖాతాకు సంబంధించి జరిగే ప్రతి విషయానికి మీరే పూర్తి బాధ్యత వహించాలి. మీరు మీ ఖాతా భద్రతను కాపాడుకోవాలి. మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఖాతాను యాక్సెస్ చేశారని గుర్తించినా లేదా అనుమానించినా, వెంటనే Redditకు తెలియజేయాలి. మీ ఖాతా కోసం మాత్రమే ఉపయోగించే బలమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలని, టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఎనేబుల్ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము. మీరు మీ ఖాతాకు ఫోన్ నంబర్‌ను జోడించి, ఆ తర్వాత ఆ నంబర్‌ను మార్చినా లేదా డీయాక్టివేట్ చేసినా, మీ ఖాతా సమాచారాన్ని తప్పనిసరిగా అప్‌డేట్ చేయండి.

మా ముందస్తు రాతపూర్వక అనుమతి లేకుండా మీరు మీ ఖాతాను లైసెన్స్ ఇవ్వకూడదు, విక్రయించకూడదు లేదా బదిలీ చేయకూడదు.

5. మీ కంటెంట్

సర్వీస్‌లలో సమాచారం, టెక్స్ట్, లింక్‌లు, గ్రాఫిక్స్, ఫోటోలు, వీడియోలు, ఆడియో, స్ట్రీమ్‌లు, సాఫ్ట్‌వేర్, టూల్స్ లేదా ఇతర మెటీరియల్స్ (“కంటెంట్”), ఉండవచ్చు. వీటిలో మీరు లేదా మీ ఖాతా ద్వారా సర్వీస్‌లను ఉపయోగించి క్రియేట్ చేసిన లేదా సర్వీస్‌లకు సబ్మిట్ చేసిన కంటెంట్ (“మీ కంటెంట్”) కూడా ఉంటుంది. మీ కంటెంట్‌లో దేనికైనా సంబంధించిన సంపూర్ణత, నిజాయితీ, ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు మేము ఎలాంటి బాధ్యత వహించము. అలాగే వాటిని ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆమోదించము, మద్దతు ఇవ్వము లేదా వాటికి హామీ ఇవ్వము.

మీ కంటెంట్‌ను సర్వీస్‌లకు సమర్పించడం ద్వారా, ఈ నిబంధనల్లో పేర్కొన్న మీ కంటెంట్‌కు సంబంధించిన హక్కులను మంజూరు చేయడానికి అవసరమైన అన్ని హక్కులు, అధికారాలు మీకు ఉన్నాయని మీరు ప్రకటిస్తూ, హామీ ఇస్తున్నారు. మీ కంటెంట్‌కు మీరే పూర్తి బాధ్యత వహిస్తారు కాబట్టి, అవసరమైన అన్ని హక్కులు లేకుండా కంటెంట్‌ను పోస్ట్ చేసినా లేదా షేర్ చేసినా, మీరు చట్టపరమైన బాధ్యతను ఎదుర్కోవాల్సి రావచ్చు.

మీ కంటెంట్‌పై మీకు ఉన్న యాజమాన్య హక్కులన్నీ మీ వద్దనే ఉంటాయి, అయితే ఆ కంటెంట్‌ను ఉపయోగించడానికి మీరు Redditకు కింది లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు:

మీ కంటెంట్‌ను సర్వీస్‌లను ఉపయోగించి క్రియేట్ చేసినప్పుడు లేదా సర్వీస్‌లకు సమర్పించినప్పుడు, మీ కంటెంట్‌ను, దానికి సంబంధించి అందించిన ఏదైనా పేరు, యూజర్‌నేమ్, వాయిస్ లేదా రూపాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న లేదా భవిష్యత్తులో అభివృద్ధి చేసే అన్ని మీడియా ఫార్మాట్‌లు, చానెల్‌లలో ఉపయోగించడానికి, కాపీ చేయడానికి, మార్చడానికి, అనుకూలంగా మలచడానికి, దాని ఆధారంగా ఇతర రచనలను రూపొందించడానికి, పంపిణీ చేయడానికి, స్టోర్ చేయడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి, చూపించడానికి మీరు మాకు ప్రపంచవ్యాప్తంగా వర్తించే, రాయల్టీ రహిత, శాశ్వతమైన, రద్దు చేయలేని, ప్రత్యేక హక్కులు లేని, బదిలీ చేయగల, సబ్‌లైసెన్స్ ఇవ్వగల లైసెన్స్‌ను మంజూరు చేస్తున్నారు. Redditతో భాగస్వాములుగా ఉన్న ఇతర కంపెనీలు, సంస్థలు లేదా వ్యక్తులు మీ కంటెంట్‌ను సిండికేషన్, ప్రసారం, పంపిణీ లేదా ప్రచురణ కోసం ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంచే హక్కు కూడా ఈ లైసెన్స్‌లో ఉంటుంది. ఉదాహరణకు, మా పబ్లిక్ కంటెంట్ పాలసీలో మరింత వివరంగా పేర్కొన్నట్లుగా, AI, మెషిన్ లెర్నింగ్ మోడల్‌లకు శిక్షణ ఇవ్వడానికి మీ కంటెంట్‌ను ఉపయోగించే హక్కు కూడా ఈ లైసెన్స్‌లో ఉంటుంది. మీ కంటెంట్‌తో అనుబంధించబడిన మెటాడేటాను మేము తొలగించవచ్చని కూడా మీరు అంగీకరిస్తున్నారు. అలాగే మీ కంటెంట్‌కు సంబంధించి నైతిక హక్కులు లేదా రచయితగా గుర్తింపు పొందే హక్కులపై ఏవైనా క్లెయిమ్‌లు, వాదనలు చేసే హక్కును మీరు శాశ్వతంగా వదులుకుంటున్నారు.

Reddit లేదా మా సర్వీస్‌ల గురించి మీరు మాకు ఏవైనా ఐడియాలు, సూచనలు లేదా ఫీడ్‌బ్యాక్ అందించడం పూర్తిగా మీ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. మీరు అందించిన వాటిని Reddit మీకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా లేదా మీ పట్ల ఎలాంటి బాధ్యత వహించకుండా ఉపయోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.

మీ కంటెంట్‌ను సమీక్షించడానికి, పరిశీలించడానికి, ఎడిట్ చేయడానికి లేదా పర్యవేక్షించడానికి మాకు హక్కు ఉన్నప్పటికీ, సర్వీస్‌లకు సమర్పించిన సమయంలో మీ కంటెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని కాదు. అయితే, ఈ నిబంధనలు, మా Reddit నియమాలు, లేదా మా ఇతర నిబంధనలు, విధానాలను, ఉల్లంఘించడం వంటి ఏ కారణంతోనైనా, ఏ సమయంలోనైనా, మా స్వంత నిర్ణయం ప్రకారం మీ కంటెంట్‌ను తొలగించవచ్చు, డబ్బు ఆర్జనకు అనర్హమైనదిగా పరిగణించవచ్చు లేదా తొలగించవచ్చు. అలాగే, మీరు మాకు చట్టపరమైన బాధ్యత కలిగించినా లేదా అలాంటి బాధ్యత కలిగించే అవకాశం ఉన్నా మేము ఈ చర్యలు తీసుకోవచ్చు.

మా Reddit నిబంధనలను ఎలా అమలు చేస్తాము, కంటెంట్ మోడరేషన్ నిర్ణయాలపై అప్పీల్ ఎలా చేయాలి అనే వివరాలతో సహా, కంటెంట్ మోడరేషన్ విషయంలో Reddit అనుసరించే విధానం గురించి మరింత సమాచారం కోసం, దయచేసి మా సహాయ కేంద్రాన్ని సందర్శించండి.

6. థర్డ్-పార్టీ కంటెంట్, యాడ్స్, ప్రమోషన్‌లు

ఈ సర్వీస్‌లలో థర్డ్-పార్టీ వెబ్‌సైట్‌లు, ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు సంబంధించిన లింక్‌లు ఉండవచ్చు ఈ లింక్‌లను అడ్వర్టైజర్‌లు, మా అనుబంధ సంస్థలు, మా భాగస్వాములు లేదా ఇతర యూజర్‌లు పోస్ట్ చేసి ఉండవచ్చు (“థర్డ్-పార్టీ కంటెంట్”). థర్డ్-పార్టీ కంటెంట్‌పై మాకు ఎలాంటి నియంత్రణ ఉండదు. అలాగే, ఏ థర్డ్-పార్టీకి చెందిన వెబ్‌సైట్‌లు, ప్రోడక్ట్‌లు లేదా సర్వీస్‌లకు మేము బాధ్యత వహించము. థర్డ్-పార్టీ కంటెంట్‌ను ఉపయోగించడం పూర్తిగా మీ సొంత రిస్క్‌పైనే ఆధారపడి ఉంటుంది. అటువంటి థర్డ్-పార్టీ కంటెంట్‌కు సంబంధించి ఏదైనా లావాదేవీని కొనసాగించే ముందు, అవసరమని మీరు భావించే అన్ని విషయాలను పరిశీలించుకోవాలి.

సర్వీస్‌లలో స్పాన్సర్ చేసిన థర్డ్-పార్టీ కంటెంట్ లేదా అడ్వర్టైజ్‌మెంట్‌లు కూడా ఉండవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్‌ల రకం, స్థాయి, టార్గెటింగ్ మారవచ్చు, అలాగే మీ కంటెంట్‌తో సహా సర్వీస్‌లలో ఏదైనా కంటెంట్ లేదా సమాచారాన్ని ప్రదర్శించే సందర్భంలో మేము అడ్వర్టైజ్‌మెంట్‌లను ఉంచవచ్చనే విషయాన్ని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు.

మీరు కాంటెస్ట్ లేదా స్వీప్‌స్టేక్స్ (“ప్రమోషన్”)తో సహా ఏదైనా ప్రమోషన్‌ను నిర్వహించడానికి సర్వీస్‌లను ఉపయోగించాలని ఎంచుకుంటే, ఆ ప్రమోషన్‌కు సంబంధించిన అధికారిక నియమాలు, ఆఫర్ నిబంధనలు, అర్హత అవసరాలను రూపొందించడం, అలాగే ఆ ప్రమోషన్‌ను నియంత్రించే వర్తించే చట్టాలు, నియమాలు, నిబంధనలకు (లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌లు, బాండ్‌లు, నియంత్రణ సంస్థల ఆమోదం వంటివి) అనుగుణంగా వ్యవహరించడం సహా వర్తించే అన్ని చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ప్రమోషన్‌ను నిర్వహించే పూర్తి బాధ్యత మీదే. మీ ప్రమోషన్‌ను Reddit స్పాన్సర్ చేయడం లేదని, దానికి మద్దతు ఇవ్వడం లేదని లేదా Redditతో దానికి ఎలాంటి సంబంధం లేదని మీ ప్రమోషన్‌లో స్పష్టంగా పేర్కొనాలి, అలాగే ప్రమోషన్‌కు సంబంధించిన ఏదైనా బాధ్యత నుండి Redditను మినహాయించేందుకు పోటీలో పాల్గొనడానికి నమోదు చేసుకున్న ప్రతి వ్యక్తి లేదా పాల్గొనే ప్రతి వ్యక్తి అంగీకరించడం తప్పనిసరి అని మీ ప్రమోషన్ నియమాలలో పేర్కొనాలి. మీ ప్రమోషన్ నిర్వహణలో మేము మీకు ఏ విధంగానూ సహాయం చేయమనే విషయాన్ని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు, అలాగే మీ సొంత రిస్క్‌తో ప్రమోషన్‌ను నిర్వహించడానికి అంగీకరిస్తున్నారు.

7. మీరు చేయకూడని పనులు

Redditను ఉపయోగించేటప్పుడు లేదా యాక్సెస్ చేసేటప్పుడు మీరు ఈ నిబంధనలతో పాటు వర్తించే అన్ని చట్టాలు, నియమాలు, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. దయచేసి Reddit నిబంధనలను సమీక్షించండి, ఈ సూచన ద్వారా అవి ఈ నిబంధనలలో చేర్చబడి వాటిలో భాగంగా పరిగణించబడతాయి, అలాగే నిషేధించబడిన కంటెంట్, ప్రవర్తనకు సంబంధించిన మా నియమాలు వాటిలో ఉంటాయి. Reddit నిబంధనలలో నిషేధించిన వాటితో పాటు మీరు కింది వాటిలో దేనినీ చేయకూడదు:

  • సర్వీస్‌ల పనితీరుకు అంతరాయం కలిగించే, వాటిని నిలిపివేసే, వాటి నిర్వహణకు ఆటంకం కలిగించే, వాటిపై అధిక భారం మోపే లేదా ఇతరత్రా వాటి పనితీరును దెబ్బతీసే విధంగా సర్వీస్‌లను ఏ పద్ధతిలోనైనా (ఆటోమేటెడ్ పద్ధతిలో, బాట్‌ల ద్వారా సహా, లేదా ఇతరత్రా) ఉపయోగించడం;
  • మరొక యూజర్ ఖాతాను లేదా సర్వీస్‌లలో పబ్లిక్‌కు అందుబాటులో లేని ఏవైనా భాగాలను యాక్సెస్ చేయడం (లేదా యాక్సెస్ చేయడానికి ప్రయత్నించడం), వీటిలో సర్వీస్‌లకు కనెక్ట్ అయిన లేదా సర్వీస్‌లతో కలిసి ఉపయోగించే కంప్యూటర్ సిస్టమ్‌లు లేదా నెట్‌వర్క్‌లు కూడా ఉంటాయి;
  • సర్వీస్‌ల భద్రతకు సంబంధించిన ఫీచర్‌లతో సహా వాటి పనితీరుకు అంతరాయం కలిగించే ఉద్దేశంతో రూపొందించిన వైరస్‌లు, వార్మ్‌లు, హానికరమైన కోడ్ లేదా ఇతర సాఫ్ట్‌వేర్‌ను సర్వీస్‌లకు లేదా వాటి ద్వారా అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం లేదా పంపిణీ చేయడం;
  • వర్తించే చట్టాలను ఉల్లంఘించడానికి లేదా ఏ వ్యక్తి లేదా సంస్థకు చెందిన మేధో సంపత్తి హక్కులను లేదా ఇతర యాజమాన్య హక్కులను ఉల్లంఘించడానికి సర్వీస్‌లను ఉపయోగించడం;
  • ఈ నిబంధనలలో లేదా Redditతో కుదుర్చుకున్న ప్రత్యేక ఒప్పందంలో అనుమతించిన సందర్భాలలో మినహా, సర్వీస్‌ల నుండి డేటాను ఏ పద్ధతిలోనైనా (ఆటోమేటెడ్ పద్ధతిలో లేదా ఇతరత్రా) యాక్సెస్ చేయడం, శోధించడం లేదా సేకరించడం (మా robots.txt ఫైల్‌లో పేర్కొన్న పారామీటర్‌లకు అనుగుణంగా సర్వీస్‌లను క్రాల్ చేయడానికి మేము షరతులతో కూడిన అనుమతిని ఇస్తాము, అయితే Reddit ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా సర్వీస్‌ల నుండి డేటాను స్క్రాప్ చేయడం నిషేధం); లేదా
  • Reddit లేదా ఏదైనా చెల్లింపు వ్యవస్థను దుర్వినియోగం చేయడం లేదా మోసానికి పాల్పడటంగా మేము సహేతుకంగా భావించే విధంగా సర్వీస్‌లను ఉపయోగించడం.

ఈ నిబంధనలను లేదా మా Reddit నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని మీరు భావించే కంటెంట్ లేదా ప్రవర్తన గురించి రిపోర్ట్ చేయాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. భద్రతా లోపాల గురించి బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయడానికి కూడా మేము మద్దతు ఇస్తాము. భద్రతకు సంబంధించిన సమస్యను రిపోర్ట్ చేయడానికి, దయచేసి security@reddit.comకు ఇమెయిల్ పంపండి.

8. మోడరేటర్లు

సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయడం అనేది సర్వీస్‌ల యూజర్‌లకు అందుబాటులో ఉండే అవకాశం ఉన్న అనధికారిక, స్వచ్ఛంద బాధ్యత. మోడరేటర్‌లు తీసుకునే చర్యలకు మేము బాధ్యత వహించము. ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో సహా ఏ కారణంతోనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానైనా, ఎప్పుడైనా సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేసే యూజర్ సామర్థ్యాన్ని రద్దు చేసే లేదా పరిమితం చేసే హక్కు మాకు ఉంది.

మీరు సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయాలని ఎంచుకుంటే:

  • మీరు మోడరేటర్ ప్రవర్తనా నియమావళిని పాటించడానికి అంగీకరిస్తున్నారు;
  • మీరు మోడరేట్ చేసే సబ్‌రెడిట్‌కు సంబంధించిన రిపోర్ట్‌లు అందినప్పుడు తగిన చర్యలు తీసుకోవడానికి అంగీకరిస్తున్నారు, వీటిలో పాలసీని ఉల్లంఘించే కంటెంట్‌ను తొలగించడం మరియు/లేదా సమీక్ష కోసం వెంటనే Redditకు పంపించడం వంటివి ఉండవచ్చు;
  • Reddit తరఫున వ్యవహరించడానికి మీకు అధికారం లేదు, అలాగే మీకు అలాంటి అధికారం ఉన్నట్లు చెప్పుకోకూడదు;
  • మా రాతపూర్వక ఆమోదం లేకుండా Reddit తరఫున లేదా మీరు మోడరేట్ చేసే ఏ సబ్‌రెడిట్ తరఫునైనా థర్డ్ పార్టీతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోకూడదు;
  • థర్డ్ పార్టీల నుండి ఏ రూపంలోనైనా పారితోషికం, ప్రతిఫలం, గిఫ్ట్ లేదా ఉపకారం పొందడానికి బదులుగా మీరు మోడరేషన్ చర్యలు చేపట్టకూడదు;
  • సబ్‌రెడిట్‌ను మోడరేట్ చేయడం వల్ల పబ్లిక్‌కు అందుబాటులో లేని సమాచారం మీకు లభిస్తే, ఆ సమాచారాన్ని మోడరేటర్‌గా మీ బాధ్యతలను నిర్వర్తించడానికి మాత్రమే ఉపయోగించాలి; అలాగే
  • మీరు మోడరేట్ చేసే సబ్‌రెడిట్‌ల కోసం నియమాలను క్రియేట్ చేసి, అమలు చేయవచ్చు, అయితే, ఆ నియమాలు ఈ నిబంధనలకు, Reddit నిబంధనలకు, లేదా మోడరేటర్ ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉండకూడదు.

మోడరేటర్ తీసుకున్న ఏదైనా చర్య లేదా నిర్ణయం Reddit లేదా Reddit కమ్యూనిటీ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని Reddit తన స్వంత విచక్షణ మేరకు భావిస్తే, ఆ చర్యను లేదా నిర్ణయాన్ని రద్దు చేసే హక్కు Redditకు ఉంటుంది, అయితే అలా చేయాల్సిన బాధ్యత Redditకు లేదు.

9. కాపీరైట్, ట్రేడ్‌మార్క్, DMCA, ఇంకా తొలగింపులు

Reddit ఇతరుల మేధో సంపత్తిని గౌరవిస్తుంది, అలాగే మా సర్వీస్‌ల యూజర్‌లు కూడా ఇతరుల మేధో సంపత్తిని గౌరవించాలని కోరుతుంది. హక్కులను ఉల్లంఘించే ఏ కంటెంట్‌నైనా సర్వీస్‌ల నుండి తొలగించడం అలాగే పదేపదే హక్కులను ఉల్లంఘించే మా సర్వీస్‌ల యూజర్‌లకు తగిన పరిస్థితుల్లో సర్వీస్‌ల యాక్సెస్‌ను రద్దు చేయడం వంటి నిబంధనలతో కూడిన పాలసీ మాకు ఉంది. మా సర్వీస్‌లలోని ఏదైనా కంటెంట్ మీకు చెందిన లేదా మీ నియంత్రణలో ఉన్న కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ హక్కులను ఉల్లంఘిస్తోందని మీరు భావిస్తే, మా కాపీరైట్ రిపోర్ట్ ఫామ్ లేదా ట్రేడ్‌మార్క్ రిపోర్ట్ ఫారమ్‌ను పూరించడం ద్వారా లేదా కింది అడ్రస్‌లో సంప్రదించడం ద్వారా Reddit నియమించిన ఏజెంట్‌కు తెలియజేయవచ్చు:

కాపీరైట్ ఏజెంట్
Reddit, Inc.
548 Market Street, #16093
San Francisco, CA 94104
copyright@reddit.com

సరైన నోటిఫికేషన్‌కు సంబంధించిన అవసరాల కోసం 17 U.S.C. § 512(c)(3)ను చూడండి. అలాగే, మా సర్వీస్‌లలోని ఏదైనా యాక్టివిటీ లేదా కంటెంట్ హక్కులను ఉల్లంఘిస్తోందని తెలిసి కూడా తప్పుడు సమాచారం అందిస్తే, కొన్ని ఖర్చులు, ఇంకా నష్టాలకు సంబంధించి మీరు Redditకు పరిహారం చెల్లించాల్సి రావచ్చని దయచేసి గమనించండి.

కాపీరైట్ లేదా ట్రేడ్‌మార్క్ నోటీసుకు ప్రతిస్పందనగా మేము మీ కంటెంట్‌ను తొలగిస్తే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాము. కాపీరైట్ నోటీసులో పొరపాటు లేదా తప్పుగా గుర్తించడం వల్ల మీ కంటెంట్‌ను తొలగించారని మీరు భావిస్తే, మా కాపీరైట్ కౌంటర్ నోటీస్ ఫామ్ ద్వారా లేదా మా కాపీరైట్ ఏజెంట్‌కు (సంప్రదింపు వివరాలు పైన అందించాము) కౌంటర్ నోటిఫికేషన్‌ను పంపవచ్చు. సరైన కౌంటర్ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఆవశ్యకతల కోసం 17 U.S.C. § 512(g)(3)ను చూడండి.

10. చెల్లింపు సర్వీస్‌లు

సర్వీస్‌లలోని అనేక సౌకర్యాలను ఉపయోగించడానికి ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, కొన్ని సర్వీస్‌లు, ఫీచర్‌లు, ప్రోడక్ట్‌లు కొనుగోలు చేయడానికి (“చెల్లింపు సర్వీస్‌లు”) అందుబాటులో ఉండవచ్చు. ఈ నిబంధనలతో పాటు Reddit Econ నిబంధనలు కూడా చెల్లింపు సర్వీస్‌లకు వర్తిస్తాయి. చెల్లింపు సర్వీస్‌లను కొనుగోలు చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు Econ నిబంధనలకు, అలాగే వర్తించే సందర్భాల్లో, ప్రివ్యూల నిబంధనలకు కూడా అంగీకరిస్తున్నారు.

11. మేధో సంపత్తి

సర్వీస్‌ల యాజమాన్యం, నిర్వహణ Redditకు చెందినవి. Reddit అందించే విజువల్ ఇంటర్‌ఫేస్‌లు, గ్రాఫిక్స్, డిజైన్, కంపైలేషన్, సమాచారం, డేటా, కంప్యూటర్ కోడ్, ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లు, ట్రేడ్‌మార్క్‌లు, అలాగే సర్వీస్‌లలోని ఇతర అన్ని అంశాలు (“మెటీరియల్స్”) మేధో సంపత్తి చట్టాలు, ఇతర చట్టాల ద్వారా రక్షణ పొందుతాయి. సర్వీస్‌లలోని అన్ని మెటీరియల్స్ Reddit లేదా దాని థర్డ్-పార్టీ లైసెన్స్‌దారుల యాజమాన్యానికి చెందినవి. మెటీరియల్స్‌ను డౌన్‌లోడ్ చేయడం ద్వారా లేదా చెల్లింపు సర్వీస్‌లను కొనుగోలు చేయడం ద్వారా మీకు ఎలాంటి యాజమాన్య హక్కులూ లభించవని మీరు గుర్తించి, అంగీకరిస్తున్నారు. Reddit స్పష్టంగా అనుమతించిన సందర్భాల్లో మినహా, Reddit బ్రాండ్ మార్గదర్శకాలకుకు లోబడి మీరు మెటీరియల్స్‌ను ఉపయోగించకూడదు. ఈ నిబంధనలలో స్పష్టంగా మంజూరు చేయని మెటీరియల్స్‌కు సంబంధించిన అన్ని హక్కులను Reddit తన వద్ద ఉంచుకుంటుంది.

12. నష్టపరిహారం

చట్టం నిషేధించిన లేదా అన్యాయమైనదిగా పరిగణించిన మేరకు మినహా, ఏదైనా థర్డ్ పార్టీ చేసే క్లెయిమ్ లేదా డిమాండ్ నుండి అలాగే వాటికి సంబంధించిన ఏవైనా బాధ్యతలు, హాని, నష్టాలు, ఖర్చులు (వ్యయాలు, న్యాయవాదుల ఫీజులతో సహా) నుండి Reddit, దాని అనుబంధ సంస్థలు అలాగే వాటి సంబంధిత డైరెక్టర్‌లు, అధికారులు, ఉద్యోగులు, అనుబంధ సంస్థలు, ఏజెంట్‌లు, కాంట్రాక్టర్‌లు, థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌లు, లైసెన్స్‌దారులను (“Reddit సంస్థలు”) రక్షించడానికి, వారికి పరిహారం చెల్లించడానికి అలాగే వారికి ఎలాంటి నష్టం కలగకుండా చూసుకోవడానికి మీరు అంగీకరిస్తున్నారు. కింది కారణాల వల్ల లేదా వాటి నుండి ఉత్పన్నమయ్యే లేదా వాటికి సంబంధించిన క్లెయిమ్‌లు, డిమాండ్‌లకు ఇది వర్తిస్తుంది: (a) మీరు సర్వీస్‌లను ఉపయోగించడం; (b) మీరు ఈ నిబంధనలను ఉల్లంఘించడం; (c) మీరు వర్తించే చట్టాలు లేదా నిబంధనలను ఉల్లంఘించడం; లేదా (d) మీ కంటెంట్. మీరు మాకు పరిహారం చెల్లించాల్సిన ఏదైనా అంశానికి సంబంధించిన క్లెయిమ్‌లపై రక్షణ చర్యలను నియంత్రించే హక్కు మాకు ఉంది, అలాగే ఈ క్లెయిమ్‌లను ఎదుర్కోవడంలో మాకు సహకరించడానికి మీరు అంగీకరిస్తున్నారు.

13. బాధ్యత పరిమితి

సర్వీస్‌లను ఉపయోగించడం ద్వారా, మీరు నివసించే దేశంలో చట్టం అనుమతించే గరిష్ఠ పరిమితి మేరకు Reddit సంస్థల బాధ్యత పరిమితం చేయబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు. ఈ రకమైన ఒప్పందానికి సంబంధించిన ముఖ్యమైన ఒప్పందపరమైన బాధ్యతలను ఉల్లంఘించడం వల్ల కలిగే, ముందుగా ఊహించగల నష్టాలకు మాత్రమే బాధ్యత పరిమితం అవుతుంది. వర్తించే ఇతర సంరక్షణ బాధ్యతలను స్వల్పంగా ఉల్లంఘించడం వల్ల కలిగే నష్టాలకు Reddit బాధ్యత వహించదు. చట్టం ప్రకారం పరిమితం చేయలేని బాధ్యతలకు, మా నిర్లక్ష్యం లేదా ఉద్దేశపూర్వకంగా చేసిన తప్పుల వల్ల కలిగే మరణం లేదా వ్యక్తిగత గాయాలకు సంబంధించిన బాధ్యతలకు ఈ పరిమితి వర్తించదు. అలాగే, మేము మీకు ప్రత్యేకంగా ఇచ్చిన హామీలకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ పరిమితిని ఉపయోగించలేము.

14. ఈ నిబంధనలకు మార్పులు

మేము ఎప్పటికప్పుడు ఈ నిబంధనలకు మార్పులు చేయవచ్చు. మేము ఏవైనా మార్పులు చేస్తే, సవరించిన నిబంధనలను పోస్ట్ చేసి, పైన పేర్కొన్న అమల్లోకి వచ్చే తేదీని అప్‌డేట్ చేస్తాము. మా అంచనా ప్రకారం ఈ మార్పులు ముఖ్యమైనవైతే, అవి అమల్లోకి వచ్చే తేదీకి కనీసం 30 రోజుల ముందుగా మీకు తెలియజేస్తాము. ఇందుకోసం, మీ ఖాతాతో అనుబంధించబడిన ఇమెయిల్ అడ్రస్‌కు (మీరు ధృవీకరించిన ఇమెయిల్ అడ్రస్‌ను అందించి ఉంటే) ఇమెయిల్ పంపుతాము లేదా మా సర్వీస్‌ల ద్వారా మరో విధంగా నోటీసు అందిస్తాము. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీన లేదా ఆ తర్వాత కూడా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం లేదా ఉపయోగించడం కొనసాగించడం ద్వారా, సవరించిన నిబంధనలకు కట్టుబడి ఉండేందుకు మీరు అంగీకరిస్తున్నారు. సవరించిన నిబంధనలకు మీరు అంగీకరించకపోతే, మార్పులు అమల్లోకి రాకముందే మా సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం ఆపివేయాలి.

15. అదనపు నిబంధనలు

మేము వివిధ రకాల సర్వీస్‌లను అందిస్తున్నందున, Reddit అందించే నిర్దిష్ట ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను ఉపయోగించే ముందు అదనపు నిబంధనలు, విధానాలు, మార్గదర్శకాలు లేదా నియమాలకు (వీటన్నింటినీ కలిపి, “అదనపు నిబంధనలు” అంటారు) అంగీకరించాల్సిందిగా మిమ్మల్ని కోరవచ్చు. ఈ సూచన ద్వారా అన్ని అదనపు నిబంధనలు ఈ నిబంధనల్లో చేర్చబడి, వీటిలో భాగంగా పరిగణించబడతాయి, ఏవైనా అదనపు నిబంధనలు ఈ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మేరకు, సంబంధిత సర్వీస్‌లను మీరు ఉపయోగించే విషయంలో అదనపు నిబంధనలే వర్తిస్తాయి.

  • మీరు ఏవైనా చెల్లింపు సర్వీస్‌లు లేదా డిజిటల్ వస్తువులను ఉపయోగిస్తే, Reddit Econ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు ఏవైనా ప్రివ్యూ ఫీచర్‌లను ఉపయోగిస్తే Reddit ప్రివ్యూల నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు సర్వీస్‌లలో అడ్వర్టైజ్‌మెంట్‌లు ఇస్తే, Reddit అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు మా డెవలపర్ సర్వీస్‌లలో దేనినైనా (మా APIలతో సహా) ఉపయోగిస్తే, Reddit డెవలపర్ నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
  • మీరు అదనపు నిబంధనలు వర్తించే ఏదైనా Reddit ప్రోగ్రామ్‌లో (ఉదా., ఏదైనా ఎర్నింగ్స్ ప్రోగ్రామ్ కోసం, సంపాదనల నిబంధనలు) పాల్గొంటే, ఆ అదనపు నిబంధనలకు కూడా తప్పనిసరిగా అంగీకరించాలి.
16. రద్దు

మీరు మీ ఖాతాను తొలగించి, అన్ని సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేయడం ద్వారా ఏ సమయంలోనైనా, ఏ కారణంతోనైనా ఈ నిబంధనలను రద్దు చేసుకోవచ్చు. మీరు మీ ఖాతాను తొలగించకుండా సర్వీస్‌లను ఉపయోగించడం ఆపివేస్తే, ఎక్కువ కాలం పాటు ఎలాంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల మీ ఖాతా డీయాక్టివేట్ కావచ్చు.

వర్తించే చట్టం అనుమతించే గరిష్ఠ మేరకు, ఈ నిబంధనలు లేదా మా Reddit నిబంధనలను ఉల్లంఘించడంతో సహా ఏ కారణంతోనైనా లేదా ఎలాంటి కారణం లేకుండానైనా, ఏ సమయంలోనైనా మీ ఖాతాను, మోడరేటర్ హోదాను లేదా సర్వీస్‌లను యాక్సెస్ చేసే లేదా ఉపయోగించే మీ సామర్థ్యాన్ని మేము సస్పెండ్ చేయవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

ఈ నిబంధనలు లేదా మీ ఖాతా రద్దయిన తర్వాత కూడా కింది సెక్షన్‌లు అమల్లో కొనసాగుతాయి: 5 (మీ కంటెంట్), 7 (మీరు చేయకూడని పనులు), 12 (నష్టపరిహారం), 13 (బాధ్యత పరిమితి), 16 (రద్దు), అలాగే 17 (ఇతర అంశాలు).

17. ఇతర అంశాలు

ఈ నిబంధనలు గోప్యతా విధానం, అలాగే ఈ నిబంధనల్లో సూచన ద్వారా స్పష్టంగా చేర్చిన ఇతర ఒప్పందాలతో కలిపి, మీరు సర్వీస్‌లను యాక్సెస్ చేయడం, ఉపయోగించడం గురించి మీకు, మాకు మధ్య ఉన్న పూర్తి ఒప్పందంగా పరిగణించబడతాయి. ఈ నిబంధనల్లోని ఏదైనా హక్కును లేదా నిబంధనను మేము వినియోగించుకోకపోయినా లేదా అమలు చేయకపోయినా, ఆ హక్కును లేదా నిబంధనను వదులుకున్నట్లు కాదు. ఈ నిబంధనల్లోని ఏదైనా భాగం చెల్లదని లేదా అమలు చేయడానికి వీల్లేదని తేలితే, అమలు చేయడానికి వీల్లేని ఆ భాగాన్ని సాధ్యమైనంత గరిష్ఠ మేరకు అమలు చేస్తారు అలాగే మిగిలిన భాగాలు పూర్తిగా అమల్లో కొనసాగుతాయి. Reddit ముందస్తు రాతపూర్వక సమ్మతి లేకుండా ఈ నిబంధనల కింద మీకు ఉన్న ఏవైనా హక్కులను లేదా బాధ్యతలను మీరు ఇతరులకు కేటాయించకూడదు లేదా బదిలీ చేయకూడదు. Reddit తన స్వంత నిర్ణయం ప్రకారం, 30 రోజుల ముందుగా నోటీసు ఇచ్చి, ఈ నిబంధనల కింద మాకు ఉన్న ఏవైనా హక్కులను, బాధ్యతలను ఎలాంటి పరిమితులు లేకుండా ఇతరులకు కేటాయించవచ్చు. సెక్షన్ 16 ప్రకారం ఈ నిబంధనలను ఎప్పుడైనా రద్దు చేసుకునే మీ హక్కుపై దీని ప్రభావం ఉండదు.

ఈ నిబంధనల్లో శీర్షికలను కేవలం సూచన కోసం మాత్రమే ఉపయోగించాము. ఈ నిబంధనలను అర్థం చేసుకునేటప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ నిబంధనల ప్రయోజనాల కోసం: (a) “చేర్చడం,” “చేరుస్తుంది,” “సహా” అనే పదాల తర్వాత “ఎలాంటి పరిమితి లేకుండా” అనే పదాలు ఉన్నట్లుగా పరిగణించాలి; (b) “వంటివి,” “ఉదాహరణకు,” “ఉదా.,” అనే పదాలు, వాటి నుంచి ఉత్పన్నమైన ఇతర పదాలు ఉదాహరణలను సూచిస్తాయి అలాగే వాటి తర్వాత పేర్కొన్న అంశాలే పూర్తి జాబితాగా పరిగణించకూడదు; అలాగే (c) “లేదా” అనే పదాన్ని “మరియు/లేదా” అనే సమ్మిళిత అర్థంలో ఉపయోగించాము. “లేదా,” “ఏదైనా,” “రెండింటిలో ఏదైనా ఒకటి” అనే పదాలు కేవలం ఒక ఎంపికకే పరిమితం కావు. ఈ నిబంధనల్లోని భాషను ఒక పక్షమే రూపొందించిందనే వాదన ఆధారంగా, ఏదైనా అస్పష్టతను ఆ పక్షానికి వ్యతిరేకంగా అర్థం చేసుకోకూడదు.

ఈ నిబంధనలు మీకు, Reddit Netherlands B.V.కు మధ్య చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఒప్పందం. ఈ నిబంధనల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, దయచేసి మమ్మల్ని సంప్రదించండి.

Reddit Netherlands B.V.
Looiersgracht 43, 1016 VR Amsterdam
Netherlands

KVK నంబర్: 83433880

డచ్ VAT రిజిస్ట్రేషన్ నంబర్: NL862872662B01

Reddit, Inc.

548 Market Street, #16093,

San Francisco, CA 94104

USA

UK VAT రిజిస్ట్రేషన్ నంబర్: 431 7546 01

⌂ 换网址